Remove Dirt and Dead Skin From Feet at Home : చాలామంది ముఖం, చేతులపై చూపించనంత శ్రద్ధ పాదాలపై చూపించరు. కానీ రోజంతా చెప్పులు, షూస్ వేసుకోవడం, దుమ్ము, చెమట కారణంగా పాదాలపై మురికి ఎక్కువగా పేరుకుపోతుంది. దీంతో కొందరికి మడమల దగ్గర చర్మం పొడిబారి గరుకుగా మారుతుంది. దీంతో పాదాలు అందంగా కనిపించవు. మరికొందరికి ఈ డ్రైనెస్ వల్ల పాదాలు కూడా పగిలిపోతాయి. ఇలాంటి సమయంలో పార్లర్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా.. ఇంట్లోనే కొన్ని సింపుల్ స్టెప్స్‌తో పాదాలను శుభ్రం చేసుకోవచ్చు. అదేలాగో చూసేద్దాం.

గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి

ఒక టబ్ లేదా పెద్ద గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకుని పాదాలను అందులో ఉంచాలి. 15 నిమిషాలు అలాగే ఉంచితే.. పాదాలపై పేరుకున్న మురికి, డెడ్ స్కిన్ కొంతవరకు మెత్తబడుతుంది. తర్వాత మృదువైన టవల్‌తో పాదాలను తుడవాలి.

Also Read : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

స్క్రబ్ ఇంపార్టెంట్..

పాదాలు మెత్తబడిన తర్వాత సున్నితమైన ఫుట్ స్క్రబ్ ఉపయోగించి మడమలు, పాదాల కింది భాగాన్ని మెల్లగా రుద్దాలి. గట్టిగా స్క్రబ్ చేస్తే చర్మానికి ఇరిటేషన్ కలగొచ్చు. ముఖ్యంగా పగుళ్లు ఉన్న చోట స్క్రబ్ చేయకపోవడం మంచిది. కానీ ఇలా చేస్తే డెడ్ స్కిన్, మురికి దాదాపుగా తగ్గుతుంది.

గోళ్లను శుభ్రం చేసుకోండి..

గోళ్ల కింద పేరుకున్న మురికిని మృదువైన నెయిల్ బ్రష్‌తో నెమ్మదిగా శుభ్రం చేసుకోవాలి. గోళ్లను మరీ లోతుగా కత్తిరించకుండా.. చిన్నగా, షేప్లో ట్రిమ్ చేసుకోవడం మంచిది. దీంతో గోళ్లు నీట్గా కనిపిస్తాయి.

Also Read : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే

మాయిశ్చరైజర్ మరచిపోకండి..

పాదాలను శుభ్రం చేసిన తర్వాత పూర్తిగా తుడిచి మాయిశ్చరైజింగ్ ఫుట్ క్రీమ్ లేదా మందమైన మాయిశ్చరైజర్‌ను పాదాలకు అప్లై చేయాలి. ముఖ్యంగా మడమలపై బాగా అప్లై చేయాలి. రాత్రి పడుకునే ముందు ఇలా చేసి కాటన్ సాక్స్ వేసుకుంటే పాదాలు తేమను నిలుపుకుంటాయి.

వారానికి ఎన్నిసార్లు చేస్తే మంచిది..

పాదాలను ప్రతిరోజూ శుభ్రంగా కడుక్కోవచ్చు. అయితే డీప్ క్లీనింగ్, స్క్రబ్బింగ్‌ను రోజూ చేయాల్సిన అవసరం లేదు. వారానికి ఒకసారి చేస్తే చాలు. చర్మం సెన్సిటివ్‌గా ఉంటే నెలలో రెండుసార్లు చేసుకోవచ్చు.

Also Read : అరటిపండు హెయిర్ మాస్క్ తయారీ.. అప్లై చేస్తే జుట్టుకు కలిగే లాభాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే

పాదాలపై పగుళ్లు, గాయాలు, దురద, ఎర్రగా మారడం లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు ఉంటే ఇంట్లో స్క్రబ్ చేయడం లేదా గట్టిగా రుద్దడం వంటివి చేయకూడదు. అలాంటి సమస్యలు ఎక్కువకాలం కొనసాగితే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిది. నిమ్మరసం, బేకింగ్ సోడా వంటి DIY పదార్థాలతో చర్మాన్ని రుద్దకపోవడమే బెటర్. ఎందుకంటే ఇవి చర్మాన్ని ఇరిటేట్ చేసే అవకాశం ఉంది.

Also Read : గ్లోయింగ్ స్కిన్ కోసం అవిసె గింజలతో DIY జెల్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకుని, అప్లై చేయండి