Fertility Concerns : పెర్​ఫ్యూమ్ ఎక్కువగా వాడుతున్నారా? అయితే జాగ్రత్త సంతాన సమస్యలు రావొచ్చు.. రూమ్ ఫ్రెషనర్స్​తో కూడా
10 months ago 8
ARTICLE AD
Perfumes and Room Fresheners Linked to Fertility Issues : ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటే ఒంటికి పెర్​ఫ్యూమ్ కొట్టాల్సిందే. స్నానం చేసి అందంగా ముస్తాబైనా.. స్నానం చేయకుండా బయటకువెళ్లాలన్నా.. చాలా మంది పర్​ఫ్యూమ్​ని ఓ కవచంగా స్ప్రే చేసుకుంటారు. ఆడవారు, మగవారు తేడా లేకుండా వీటిని ఉపయోగిస్తారు. పైగా వారి అవసరాలకు, టేస్ట్​లకు తగ్గట్లు ఎన్నోరకాల పర్​ఫ్యూమ్​లు మార్కెట్లలో అందుబాటులో ఉన్నాయి. మీకు కూడా ఈ పర్​ఫ్యూమ్ వాడే అలవాటు ఉందా? అయితే జాగ్రత్త.
తమ బాడీ ఎంత మంచి స్మెల్​ వస్తుందో.. రూమ్​ కూడా అంతే మంచి ఫ్రెష్​నెస్ ఇవ్వాలని రూమ్ ఫ్రెషనర్స్ కూడా వాడుతారు. ఈ సువాసనలు మనసుకు హాయినిస్తాయి. అయితే ఆరోగ్యానికి మాత్రం ముప్పును ఇస్తాయని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే కొన్ని పెర్​ఫ్యూమ్​లు, ఫ్రెషనర్లు.. స్త్రీ, పురుషుల్లో సంతానోత్పత్తి సమస్యలను పెంచుతాయని హెచ్చరిస్తున్నారు.
కారణాలివే..
పర్​ఫ్యూమ్​లు, రూమ్​ ఫ్రెషనర్లు.. స్త్రీలలో, పురుషుల్లో హార్మోన్ల అసమతుల్యతకు దారి తీసి.. ఫెర్టిలిటీ సమస్యలను పెంచుతాయట. ఎందుకంటే వీటి తయారీలో.. థాలేట్స్, పారాబెన్లు, బ్యూటిలేటెడ్ హైడ్రాక్సీటోల్యూన్, ఆక్సినాల్స్, ఫార్మాలిహైడ్లు, సింథటిక్ కెమికల్స్ వంటి ప్రమాదకర రసాయనాలను వినియోగిస్తారు. వీటిని ఎండోక్రైన్ డిస్రప్టింగ్ కెమికల్స్ అంటారు. ఇవి శరీరంలోని సహజ హార్మోన్లను నిరోధిస్తాయి. దీనివల్ల హార్మోన్లలో అసమతుల్యత పెరుగుతుందని గుర్తించారు.
స్త్రీలలో కలిగే సమస్యలు..
హార్మోన్ల అంతరాయం వల్ల స్త్రీలలో పీరియడ్స్, అండోత్సర్గం, రిప్రొడెక్టివ్ హెల్త్​పై ప్రభావం చూపిస్తుంది. PCOS, ఇర్​రెగ్యూలర్ పీరియడ్స్ వంటి సమస్యలకు దారి తీస్తుంది. అండాశయ ఫోలికల్స్​ను దెబ్బతీస్తాయి. ఇవన్నీ ప్రెగ్నెన్సీకి ఆటంకం కలిగిస్తాయి. అంతేకాకుండా గుడ్డు నాణ్యతను, అభివృద్ధిపై నెగిటివ్ ప్రభావం చూపిస్తాయి. గర్భస్రావం ప్రమదాన్ని కూడా పెంచుతాయి.
పురుషుల్లో వచ్చే సమస్యలివే..
మగవారు కూడా పర్​ఫ్యూమ్ ఉపయోగించడం, రూమ్​ ఫ్రెషనర్స్​ వాడడం వల్ల ఫెర్టిలిటీలో నెగిటివి ఇంపాక్ట్ చూడాల్సి వస్తుంది. వీటివల్ల స్పెర్మ్ క్వాలిటీ, కౌంట్ తగ్గుతుంది. స్పెర్మ్​లోని DNA దెబ్బతింటుంది. ఇది పిండం అభివృద్ధి, సంతానోత్పత్తి ఫలితాలను ప్రతికూలంగా మారుస్తుంది.
అందుకే పర్​ఫ్యూమ్​లకు, రూమ్​ ఫ్రెషనర్స్​కు వీలైనంత దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటికి బదులుగా.. సహజమైన సుగంధ పరిమళ ద్రవ్యాలను ప్రత్యామ్నాయాలుగా వాడవచ్చని సూచిస్తున్నారు. సింథటిక్ సువాసనలకు బదులుగా.. మొక్కల నుంచి తయారు చేసిన నూనెలను రూమ్​ఫ్రెషనర్స్​గా వాడుకోవచ్చు. ఇంట్లో రూమ్​ ఫ్రెషనర్స్​కి బదులు కిటికీలు తెరవడం, వెంటిలేషన్ మెరుగు చేయడం, ఎయిర్ ప్యూరిఫైయర్​లు వాడడం మంచిదని సూచిస్తున్నారు.
కొన్ని అధ్యయనాలు రూమ్ ఫ్రెషనర్లు, పెర్​ఫ్యూమ్​లు.. సంతానోత్పత్తి సమస్యలను పెంచడం.. వాటి మధ్య ఉన్న లింక్​ని గుర్తించినప్పటికీ.. ఇంకా దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. అయినా సరే వీటివల్ల ఉన్న ప్రమాదాలను తగ్గించడానికి ముందే జాగ్రత్తలు తీసుకోవాలని.. ప్రత్యామ్నాయలను ఎంచుకోవాలని నిపుణులు చెప్తున్నారు.
Also Read : మగవారిలో ఫెర్టిలిటీ సమస్యలుంటే.. V-cut అండర్​వేర్ వేసుకోవాలా లేక బాక్సర్ మంచిదా? నిపుణుల సలహాలివే
Read Entire Article