Fenugreek Water for 15 Days : ఉదయాన్నే ఒక్క గ్లాసు మెంతి నీళ్లు తాగడం అనేది చాలా చిన్న విషయంలా కనిపిస్తుంది. కానీ ఈ పాత ఇంటి చిట్కా ఆరోగ్యానికి ఎన్నో లాభాలు చేకూరుస్తుంది. జీర్ణశక్తి మెరుగుపడడం నుంచి రక్తంలో చక్కెర స్థాయి సమతుల్యం చేయడం వరకు బోలెడు ప్రయోజనాలు అందిస్తుంది. అందుకే పోషకాహార నిపుణులు సైతం మెంతులు డైట్లో చేర్చుకోవాలంటున్నారు. పీచు, యాంటీఆక్సిడెంట్లు, సహజ సమ్మేళనాలతో నిండిన మెంతులను నానబెట్టి.. 15 రోజులు తాగితే బాడీలో ఎలాంటి మార్పులు జరుగుతాయో చూద్దాం.

మెంతుల్లోని పోషకాలు..

మెంతుల్లో కరిగే ఫైబర్ ఉంటుంది. అలాగే ప్లాంట్ బేస్డ్ ఈస్ట్రోజెన్ ఉంటుంది. ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6, ఫోలిక్ యాసిడ్తో పాటు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవన్నీ కలిసి శరీరాన్ని లోపల నుంచి మెరుగుపరుస్తాయి. ప్రధానంగా కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.

బ్లడ్ షుగర్ కంట్రోల్..

మెంతుల్లో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది రక్తంలోకి చక్కెర వేగంగా చేరకుండా నెమ్మదిగా విడుదలవడానికి సహాయపడుతుంది. 15 రోజులు తాగితే ఇన్సులిన్ నిరోధకత ప్రారంభ సంకేతాలు ఉన్నవారిలో చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. పలు అధ్యయనాలు మెంతి ఇన్సులిన్ సమతుల్యతను మెరుగుపరుస్తుందని నిరూపించాయి. అంటే శరీరం చక్కెరను కొవ్వుగా నిల్వ చేయకుండా సమర్థంగా ఉపయోగించుకుంటుంది.

మెరుగైన మెటబాలీజం

మెంతి నీళ్లు జీవక్రియను ప్రభావంతమైన రీతిలో మెరుగుపరుస్తాయి. గింజల్లోని సహజ సమ్మేళనాలు జీర్ణ ఎంజైమ్‌లను విచ్ఛిన్నం చేస్తాయి. దీంతో కడుపు ఉబ్బరం తగ్గి.. తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవడం గమనిస్తారని NIHలో ప్రచురించిన అధ్యయనం తెలిపింది.

బాడీ డీటాక్స్

మెంతి గింజలు గట్ని సహజంగా శుద్ధి చేస్తాయి. దాని పీచు పదార్థం పేరుకుపోయిన విషాలను తొలగించడంలో సహాయపడుతుంది. మలబద్ధకాన్ని, అసిడిటీని దూరం చేస్తుంది. కడుపులోని చికాకును తగ్గిస్తుంది. రెండు వారాల్లో గట్ హెల్త్ మెరుగవుతుంది.

స్కిన్ హెల్త్

మెంతి నీళ్లు చర్మానికి కూడా మంచి ఫలితాలిస్తాయి. శరీరం వ్యర్థాలు, అదనపు నూనెను బయటకు పంపించి.. మొటిమలు తగ్గిస్తాయి. దీంతో చర్మం తాజాగా కనిపిస్తుంది. మెంతిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలుష్యం, ఒత్తిడి వల్ల కలిగే కణ నష్టాన్ని తగ్గిస్తాయి. దీంతో స్కిన్ టోన్ మెరుగవుతుంది.

హార్మోన్ సమతుల్యత

మెంతి గింజల్లో ఈస్ట్రోజెన్‌ను పోలిన సమ్మేళనాలు ఉంటాయి. ఇవి కొన్ని హార్మోన్ హెచ్చుతగ్గులను నియంత్రించడంలో సహాయపడతాయి. ముఖ్యంగా మహిళలకు ఇది చాలామంచిది. అలాగే పీరియడ్ రెగ్యులర్గా రావడానికి హెల్ప్ చేస్తుంది.

తయారీ విధానం

మెంతులు రాత్రుళ్లు నానబెట్టుకోవాలి. ఒక టీస్పూన్ తీసుకుంటే చాలు. 6–8 గంటలు నానితే.. గింజలు ఉబ్బి.. నీళ్లు కాస్త రంగు మారతాయి. ఉదయాన్నే వాటిని వడబోసి.. తాగాలి. గింజలను కూడా తినొచ్చు. ఖాళీ కడుపుతో తాగితే.. మంచిది. బెనిఫిట్స్ అనేవి ఒక్కరోజులో కనిపించవు. కానీ ఇలా 15 రోజులు చేస్తే తేడాలు మీకు కచ్చితంగా తెలుస్తాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మెంతి నీరు ఆరోగ్యానికి మంచిదే అయినా.. కొందరు తీసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవాలి. ప్రెగ్నెన్సీతో ఉన్నవారు, కొన్నిరకాల మందులు వాడేవారు వైద్యుడిని సంప్రదించిన తర్వాతే వాడాలి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.