Official Statement On Fauzi Postponed: రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులను కాస్త డిజప్పాయింట్ చేసే న్యూస్ ఇది. డిసెంబర్ మొదటి వారంలో తమ ఫేవరేట్ హీరో థియేటర్లలో సందడి చేస్తాడని ఆశించిన ఫ్యాన్స్ ఆశలపై నీళ్ళు చల్లుతూ... గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న వార్తలను నిజం చేస్తూ... సినిమా వాయిదా పడిన విషయాన్ని నిర్మాత రవిశంకర్ యలమంచిలి అధికారికంగా ప్రకటించారు.

'ఫౌజీ' విడుదల ఈ ఏడాది లేనట్టే
ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ 'ఫౌజీ' (Fauzi). గత కొన్ని రోజులుగా తెలుగు సినీ వర్గాల్లో హల్‌చల్ చేస్తున్న ప్రచారానికి తెర దించుతూ... తమ సినిమా విడుదల వాయిదా పడినట్లు నిర్మాత అధికారికంగా ధృవీకరించారు.

Also Read: Naga Chaitanya Maradalu Samanta Photos - నాగచైతన్య మరదలు... మోడ్రన్ డ్రస్‌లో సమంత ధూళిపాళ ఫోటోలు

ఈ ఏడాది (2026) డిసెంబర్ 3వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ 'ఫౌజీ' చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయాలని చిత్రనిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేసింది. అయితే... పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడంతో పాటు మరి కొన్ని వర్క్స్ పెండింగ్ పడటం వల్ల అనుకున్న సమయానికి సినిమా రెడీ కావడం కష్టమని తెలిసింది. దాంతో సినిమాను వచ్చే ఏడాది (2027)కి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'ది ప్యారడైజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నిర్మాత రవిశంకర్ పాల్గొన్నారు. 'ఫౌజీ' ప్రొడ్యూసర్లలో ఆయన ఒకరు. ముందుగా అనుకున్న సమయానికి తమ సినిమా విడుదల కావడం లేదని రవిశంకర్ స్పష్టం చేశారు. అదీ సంగతి.

Also Read: Vidya Balan Jailer 2 First Look Video - చేతిలో సిగరెట్... అక్కడ టాటూ... 'జైలర్ 2'లో విద్యాబాలన్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్... కాంతగా పవర్ ఫుల్ ఎంట్రీ

మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 'ఫౌజీ'లో ప్రభాస్ సరసన ఇమాన్వి కథానాయికగా పరిచయం అవుతోంది. సోషల్ మీడియాలో డ్యాన్స్ రీల్స్ ద్వారా వైరల్ అయిన ఆ అమ్మాయికి కథానాయికగా మొదటి చిత్రమిది. ఆమె కాకుండా అనుపమ్ ఖేర్, జయప్రద, మిథున్ చక్రవర్తి, చైత్ర జె ఆచార్, రాహుల్ రవీంద్రన్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 'సీతా రామం' బ్లాక్‌ బస్టర్ సాధించిన తర్వాత హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న చిత్రమిది. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్, ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు.

Also Read: Mysaa Teaser Review - 'మైసా' తెలుగు టీజర్ రివ్యూ... యుద్ధాన్ని డిసైడ్ చేసే ఆయుధంలా రష్మిక... భయం లేదు, యాక్షన్‌తో అదరగొట్టిందిగా