Fatty Liver Control with Simple Tips : కాలేయ ఆరోగ్యమనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలేయ ఆరోగ్యం చెడిపోతే పూర్తి ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. పైగా ఇది చాలా ప్రమాదాకరం. ఎందుకంటే కాలేయ సమస్యలు ముందుగా భయటపడవు. దీనివల్ల సమస్య తీవ్రమయ్యేవరకు గుర్తించలేము. అలాంటి సమస్యల్లో ఫ్యాటీ లివర్ కూడా ఒకటి. కానీ ఈ మేజర్ సమస్య నుంచి పూర్తి ఉపశమనం కోసం 5 టిప్స్ ఫాలో అవ్వాలంటున్నారు నిపుణులు.

మారుతున్న జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలామందిలో ఫ్యాటీ లివర్ అనేది ఒక సాధారణ సమస్యగా మారుతోంది. కాలేయంలో అధిక కొవ్వు పేరుకుపోయినప్పుడు ఈ పరిస్థితి ఏర్పడుతుంది. సకాలంలో గుర్తించకపోతే.. తీవ్రమైన అనారోగ్యాలకు దారితీస్తుంది. అయితే వైద్యుల ప్రకారం ఫ్యాటీ లివర్‌ను దాని ప్రారంభ దశలోనే నియంత్రించవచ్చట. సరైన ఆహారం, వ్యాయామంతో దీనిని పూర్తిగా దూరం చేసుకోవచ్చని చెప్తున్నారు. రోజువారీ జీవితంలో కొన్ని అలవాట్లను పాటించడం వల్ల కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడమే కాకుండా.. మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చని చెప్తున్నారు.

శారీరక శ్రమ

ఫ్యాటీ లివర్ నుంచి ఉపశమనం పొందడానికి రెగ్యులర్గా వ్యాయామం చేయడం చాలా అవసరం. వేగంగా నడవడం, సైక్లింగ్ లేదా ఈత వంటి వ్యాయామాలు కాలేయంలో కొవ్వు నిల్వలను తగ్గించడంలో సహాయపడతాయి. వారానికి కనీసం 150 నిమిషాల మధ్యస్థ-తీవ్రత గల వ్యాయామం చేయాలని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఇది కొవ్వును కరిగించడమే కాకుండా.. ఇన్సులిన్ సెన్సిటివిటీని, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీనివల్ల కాలేయం సరిగ్గా పనిచేస్తుంది.

ఆహారంలో మార్పులు

పాలకూర, మెంతులు, బ్రోకలీ వంటి ఆకుపచ్చని కూరగాయలు కాలేయానికి చాలా మేలు చేస్తాయని చెప్తారు. వాటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు కాలేయాన్ని శుభ్రపరచడానికి, వాపును తగ్గించడానికి సహాయపడతాయి. ఈ కూరగాయలు కాలేయంలో కొవ్వు పేరుకుపోవడాన్ని నెమ్మదింపజేస్తాయి. తద్వారా ఫ్యాటీ లివర్ సమస్యలు అదుపులో ఉంటాయి.

గ్రీన్ టీ

గ్రీన్ టీలో ఉండే కాటెచిన్లు కాలేయ పనితీరును మెరుగుపరచడానికి, కొవ్వు పేరుకుపోకుండా నిరోధించడానికి సహాయపడతాయి. ప్రతిరోజూ రెండు నుంచి మూడు కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల కాలేయ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మరసం, పసుపు నీళ్లు తాగడం కూడా ప్రయోజనకరంగా చెప్తారు. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు కాలేయ కణాలను దెబ్బతినకుండా కాపాడి.. వాపును తగ్గిస్తాయి.

దూరంగా ఉండాల్సిన ఫుడ్స్

ఫ్యాటీ లివర్‌కు ప్రధాన కారణాలలో అధిక చక్కెర, కొవ్వు పదార్థాలున్న ఆహారం కూడా మేజర్ రీజన్. కేకులు, పేస్ట్రీలు, మిఠాయిలు, స్వీట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్.. కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి దోహదం చేస్తాయి. అందువల్ల కాలేయంపై అధిక ఒత్తిడిని నివారించడానికి, కొవ్వు పేరుకుపోవడాన్ని తగ్గించడానికి ఈ ఆహార పదార్థాల వినియోగాన్ని తగ్గించడం ముఖ్యం.

బరువు నియంత్రణ

బరువు పెరగడం వల్ల ఫ్యాటీ లివర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అందువల్ల క్రమంగా బరువు తగ్గడం, దానిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వంటి వ్యాయామాలు కండరాలను పెంచడంలో సహాయపడతాయి. ఇది జీవక్రియను వేగవంతం చేసి, శరీరం విశ్రాంతిగా ఉన్నప్పుడు కూడా కొవ్వును కరిగించేలా చేస్తుంది. దీనివల్ల కాలేయంలో కొవ్వు నిల్వలు తగ్గి.. దాని పనితీరు మెరుగుపడుతుంది.

ఈ అలవాట్లు రెగ్యులర్గా ఫాలో అయితే కాలేయంలో కొవ్వు కరిగిపోతుందని చెప్తున్నారు నిపుణులు. అలాగే ఆల్కహాల్కి దూరంగా ఉంటే కూడా మంచి ఫలితాలు చూడవచ్చని చెప్తున్నారు. ఇవి కేవలం కాలేయం కోసమే కాదు.. పూర్తి ఆరోగ్యానికి మేలు చేస్తాయని అంటున్నారు.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.