Glenn chapple fastest century | క్రికెట్‌లో సెంచరీ చేసిన వారి గురించి మాట్లాడేటప్పుడు, చాలా తక్కువ బంతుల్లో చేసిన సెంచరీల గురించి తరచుగా ప్రస్తావిస్తారు. కానీ అతి తక్కువ సమయంలో, తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన రికార్డు ఏ ఆటగాడి పేరిట ఉందో చాలా మందికి తెలియదు. ఈ ఘనతను ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ గ్లెన్ చాపెల్ సాధించాడు. 1993లో ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లో చాపెల్ ఈ రికార్డు నెలకొల్పాడు. నేటికీ 32 సంవత్సరాలు గడిచినా ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు చెక్కుచెదరకుండా ఉంది.

21 నిమిషాల్లో 100 పరుగులు

లాంక్‌ఫైర్ తరపున ఆడుతున్న చాపెల్ 15 జూలై 1993న గ్లెమోర్గాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ అద్భుతం ఫీట్ సాధించాడు. రెండవ ఇన్నింగ్స్‌లో లాంక్‌షైర్ బ్యాటింగ్ ప్రారంభించగా, చాపెల్‌ను ఇన్నింగ్స్ ప్రారంభించడానికి ఓపెనర్‌గా వెళ్లాడు. అతను క్రీజులోకి అడుగుపెట్టిన వెంటనే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. చాపెల్ కేవలం 21 నిమిషాల్లో, 27 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను 10 ఫోర్లు, 9 సిక్సర్లు బాదేశాడు. సమయం విషయానికి వస్తే, ఇది ఇప్పటివరకు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ.

పాత రికార్డులు బద్దలు

అంతకుముందు ఆస్ట్రేలియాకు చెందిన టామ్ మూడీ ఈ ఘనత సాధించాడు. మూడీ 1990లో వార్విక్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లెమోర్గాన్ తరపున ఆడుతూ కేవలం 26 నిమిషాల్లోనే సెంచరీ చేశాడు. టామ్ మూడీ రికార్డును చాపెల్ బద్దలు కొట్టి కొత్త చరిత్ర సృష్టించాడు.

మ్యాచ్ రిజల్ట్

మొదటి ఇన్నింగ్స్‌లో లాంక్‌షైర్ 310 పరుగులు చేసింది. దీనికి బదులుగా గ్లెమోర్గాన్ 303 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ విధంగా లాంక్ షైర్‌కు మ్యాచ్‌లో కేవలం 7 పరుగుల ఆధిక్యం లభించింది. ఆ తర్వాత చాపెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడి బ్యాటింగ్ కారణంగా లాంక్‌షైర్ కేవలం 12 ఓవర్లలో 235 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. గ్లెమోర్గాన్ విజయానికి 243 పరుగులు చేయాల్సి ఉంది, వారు 52.1 ఓవర్లలో ఛేదించారు. ఈ సమయంలో కేవలం 3 వికెట్లు పడ్డాయి. చాపెల్ తుఫాన్ సెంచరీ జట్టుకు ఉపయోగపడలేదు, కానీ క్రికెట్ చరిత్రలో ఈ ఇన్నింగ్స్ ఎప్పటికీ నిలిచిపోయింది.

చాపెల్ కెరీర్

గ్లెన్ చాపెల్ దేశవాళీ కెరీర్ అద్భుతంగా సాగినా, అంతర్జాతీయ క్రికెట్‌లో అదృష్టం అతనికి కలిసిరాలేదు. 2006లో అతను ఇంగ్లాండ్ తరపున వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు, కానీ అదే మ్యాచ్‌లో గాయపడ్డాడు. కేవలం నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన తర్వాత అతను మైదానాన్ని వీడాడు. ఆ తర్వాత మళ్లీ ఇంగ్లాండ్ జట్టు జెర్సీ ధరించే అవకాశం రాలేదు.

32 సంవత్సరాల తర్వాత కూడా చాపెల్ రికార్డు చెక్కుచెదరలేదు. నేటికి వేగవంతమైన క్రికెట్, T20ల యుగంలో కూడా ఇంత తక్కువ సమయంలో, తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాడు మరోకడు లేడు. అందుకే క్రికెట్ అభిమానులకు ఈ ఇన్నింగ్స్ ఒక లెజెండరీ కంటే తక్కువ కాదు.