కొన్నిసార్లు మీకు అర్జంటుగా ప్రింటౌట్ అవసరం పడుతుంది. కానీ జిరాక్స్ షాప్ వద్ద క్యూ కనిపిస్తే చిరాకు వస్తుంది. అయితే అందుకు పరిష్కారం కోసం ఓ టెక్నాలజీని ఇటీవల అందుబాటులోకి తెచ్చారు. క్విక్‌ప్రింట్ (QwikPrint) కియోస్క్ అనేది సులభంగా, వేగంగా ప్రింట్ తీసుకోవడానికి ఉపయోగపడే మెషీన్. ATM తరహాలో పనిచేసే సెల్ఫ్-సర్వీస్ ప్రింటింగ్ మెషిన్ ఇది. 24/7 అందుబాటులో ఉంటుంది. దీనిని ఉపయోగించి మీరు మీ ఫోన్, ఈమెయిల్ లేదా క్లౌడ్ స్టోరేజ్ నుండి నేరుగా ప్రింట్లు తీసుకోవచ్చు. జేఎన్‌టీయూ మెట్రో స్టేషన్ వద్ద సైతం ఇన్‌స్టాల్ చేసిన ఓ క్విక్ ప్రింట్ ప్రింటింగ్ మెషిన్ సేవలు అందిస్తోంది.

క్విక్‌ప్రింట్ కియోస్క్ ద్వారా ప్రింట్ తీసుకునే విధానాన్ని స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇదే..

మీ ఫైల్‌ను అప్‌లోడ్ చేయడం (Upload Your File)
మీరు ప్రింట్ తీసుకోవాలనుకుంటున్న ఫైల్‌ను కియోస్క్ సిస్టమ్‌లోకి పంపడానికి 3 ప్రధాన మార్గాలు ఉన్నాయి. అవి

వెబ్‌సైట్ ద్వారా: QwikPrint వెబ్‌సైట్‌కు వెళ్లి మీ ఫైల్‌ను అప్‌లోడ్ చేయండి. అప్పుడు మీకు ఒక 6 అంకెల రిజిస్ట్రేషన్ కోడ్ వస్తుంది.

ఈమెయిల్ ద్వారా: మీరు ప్రింట్ చేయాల్సిన డాక్యుమెంట్‌ను QwikPrint వారు సూచించిన ఈమెయిల్ ఐడికి పంపాలి. వెంటనే మీకు Reply Emailకు రిజిస్ట్రేషన్ కోడ్ అందుతుంది.

మొబైల్ యాప్: QwikPrint యాప్ ద్వారా ఫైల్ అప్‌లోడ్ చేసి కోడ్ పొందవచ్చు.

స్టెప్ 2: కియోస్క్ వద్దకు వెళ్లాలి (Go to the Kiosk)
మీకు దగ్గరలో ఉన్న షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్లు లేదా లైబ్రరీలలో ఉన్న క్విక్‌ప్రింట్ కియోస్క్ వద్దకు వెళ్లాలి.

View this post on Instagram

A post shared by Mesmerizing Sai 💥👑 (@mesmerizing_sai)

స్టెప్ 3: కోడ్‌ను ఎంటర్ చేయాలి.
కియోస్క్ స్క్రీన్ మీద ఉన్న Print ఆప్షన్‌ను ఎంచుకోండి.

మీకు వచ్చిన 6 అంకెల రిజిస్ట్రేషన్ కోడ్‌ను అక్కడ ఎంటర్ చేయండి.

తరువా మీ డాక్యుమెంట్‌ను ఫోన్, ల్యాప్‌టాప్, గూగుల్ డ్రైవ్ నుంచి సెలక్ట్ చేయాలి. ఒకసారి దాన్ని చెక్ చేసుకోండి

స్టెప్ 4: ప్రింట్ సెట్టింగ్‌లు మార్చుకోవాలి
మీకు కావాల్సిన విధంగా సెట్టింగ్‌లను మార్చుకోవచ్చు:

Color/B&W: రంగుల ప్రింట్ కావాలా లేదా బ్లాక్ అండ్ వైట్ కావాలా అనేది ఎంచుకోండి.

Sides: పేజీకి ఒక వైపు కావాలా లేదా రెండు వైపులా కావాలా అనేది సెట్ చేయండి.

Copies: ఎన్ని కాపీలు కావాలనేది ఎంచుకోండి.

స్టెప్ 5: పేమెంట్ చేయడం (Make Payment)
స్క్రీన్ మీద మీకు ఎంత ఖర్చు అవుతుందో కనిపిస్తుంది. మీరు ఈ క్రింది మార్గాల్లో డబ్బులు చెల్లించాలి:

UPI: గూగుల్ పే, PhonePe, పేటీఎం ద్వారా QR కోడ్ స్కాన్ చేసి చెల్లించవచ్చు.

Card/Wallet: డెబిట్/క్రెడిట్ కార్డ్ లేదా ఇతర వాలెట్ల ద్వారా కూడా పేమెంట్ చేయవచ్చు.

స్టెప్ 6: ప్రింట్ తీసుకోవడం
పేమెంట్ పూర్తయిన వెంటనే, కియోస్క్ నుండి మీ పేపర్లు ప్రింట్ అయ్యి బయటకు వస్తాయి. వాటిని కలెక్ట్ చేసుకోండి.

ముఖ్య గమనిక:
మీరు అప్‌లోడ్ చేసిన ఫైల్‌లు ప్రింట్ తీసుకోగానే లేదా కొంత సమయం తర్వాత సర్వర్ నుండి ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతాయి.

ఫైల్ ఫార్మాట్: సాధారణంగా PDF, Word (Docx), JPEG ఫార్మాట్‌లు బాగా పనిచేస్తాయి.