Tollywood Top Family Entertainers Movies List : ప్రస్తుతం ఓటీటీ ట్రెండ్ కంటిన్యూ అవుతున్న క్రమంలో హారర్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ కంటెంట్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్‌కు కూడా స్పెషల్ క్రేజ్ ఉంది. పిల్లల నుంచి పెద్దల వరకూ సరదాగా చూసి నవ్వుకోవడమే కాకుండా సామాజిక విలువలు, ఎథిక్స్ కూడిన మంచి మెసేజ్ కూడా ఈ మూవీ‌స్‌లో ఉంటుంది. మరి అలాంటి టాప్ తెలుగు మూవీస్ లిస్ట్ ఓసారి చూస్తే...

టాప్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్

సంక్రాంతి - వెంకటేశ్, శ్రీకాంత్, స్నేహ, సంగీత ప్రధాన పాత్రల్లో నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ సంక్రాంతి. ముప్పలనేని శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ... ప్రతీ సంక్రాంతికి ఇప్పటికీ టీవీల్లో సందడి చేయాల్సిందే. మధ్య తరగతి అనుబంధాలు, ఫ్యామిలీ ఎమోషన్స్ చక్కగా చూపించారు. యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.

బొమ్మరిల్లు - సిద్దార్థ్, జెనీలియా జంటగా నటించిన ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ బొమ్మరిల్లు. ఈ సినిమాతోనే డైరెక్టర్ భాస్కర్ బొమ్మరిల్లు భాస్కర్‌గా పేరొందారు. ప్రకాశ్ రాజ్, జయసుధ, కోట శ్రీనివాసరావు, సురేఖా వాణి తదితరులు కీలకపాత్రలు పోషించారు. తండ్రీ కొడుకుల మధ్య అనుబంధం, యంగ్ ఏజ్‌లో పేరెంట్స్ ఎలా ఆలోచించాలి? అనే కాన్సెప్ట్‌తో మంచి మెసేజ్ అందించారు. యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.

మల్లీశ్వరి - విక్టరీ వెంకటేశ్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. కామెడీతో పాటు ఫ్యామిలీ, ఎమోషన్, లవ్ అన్నీ అంశాలు కలిపి కె విజయ్ భాస్కర్ ఈ మూవీని తెరకెక్కించారు.

ఆడవారి మాటలకు అర్థాలే వేరులే - వెంకటేశ్, త్రిష ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఉమ్మడి కుటుంబం ప్రాధాన్యతతో పాటు కామెడీ, లవ్ అంశాలను కూడా చూపించారు.

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు - విక్టరీ వెంకటేశ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీ స్టారర్ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. కుటుంబ విలువలు, అనుబంధాలు, పల్లెటూరి వాతావరణం, వసుదైక కుటుంబం అనే కాన్సెప్ట్‌తో అద్భుతంగా రూపొందించారు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల. యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.

Also Read : వరల్డ్‌ను ఊపేస్తోన్న స్పైడర్ మ్యాన్ ట్రైలర్ - కొద్ది రోజుల్లోనే హిస్టారికల్ వ్యూస్... వెయిటింగ్ ఫర్ రిలీజ్

ఆ నలుగురు - రాజేంద్ర ప్రసాద్, మీనా, కోట శ్రీనివాసరావు ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ఆ నలుగురు. చంద్ర సిద్దార్థ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఫ్యామిలీ రిలేషన్స్‌తో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది. కేవలం డబ్బు మాత్రమే ప్రధానం అనుకునే వారికి కనువిప్పు కలిగేలా ఈ స్టోరీని రూపొందించారు.

అదుర్స్ - జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించిన పర్ఫెక్ట్ కామెడీ ఎంటర్టైనర్ అదుర్స్. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ మూవీ కామెడీతో పాటు తండ్రీ కొడుకుల, సెంటిమెంట్ ప్రధానాంశంగా సాగుతుంది.

శతమానం భవతి - సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్‌లో 'శతమానం భవతి' ముందు వరుసలో ఉంటుంది. శర్వానంద్, అనుపమ పరమేశ్వరన్, ప్రకాష్ రాజ్, జయసుధ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ... ఫ్యామిలీతో కలిసి ఎప్పుడైనా చూడొచ్చు. సతీష్ వేగ్నేశ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.

అల వైకుంఠపురంలో - అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా నటించిన లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అల వైకుంఠపురంలో. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆద్యంతం ఎమోషన్‌గా సాగుతుంది. కుటుంబంతో కలిసి చూడొచ్చు.

దృశ్యం - విక్టరీ వెంకటేశ్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా అవడానికి క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లరే అయినా కుటుంబంతో కలిసి చూడొచ్చు. ఫ్యామిలీ, కూతురి కోసం ఓ మధ్య తరగతి తండ్రి పడే తపన ఎంతో ఇంట్రెస్టింగ్‌గా చూపించారు.

వెంకీ - అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్ వెంకీ. రవితేజ, స్నేహ జంటగా నటించిన ఈ మూవీకి శ్రీను వైట్ల దర్శకత్వం వహించారు.

మనం - నాగార్జున, నాగచైతన్య, సమంత, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. త్రీ జనరేషన్స్‌ను కవర్ చేస్తూ ఎమోషన్, కుటుంబ అనుబంధాలు ప్రధానాంశంగా అద్భుతంగా రూపొందించారు.

ఈ మూవీస్‌‌తో పాటే మహానటి, దుబాయ్ శ్రీను, అ ఆ, హాయ్ నాన్న, సీతారామం, అహ నా పెళ్లంట మూవీస్ ఫ్యామిలీతో కలిసి చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు. ఈ మూవీస్ యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి.