Fake Doctors: హైదరాబాద్‌లో టాస్క్‌ఫోర్స్ దాడులు.. 12 మంది ఫేక్ డాక్టర్ల గుట్టురట్టు

2 months ago 3
ARTICLE AD
<p>హైదరాబాద్: &nbsp;నగరంలో ఎలాంటి సరైన అర్హతలు లేకుండా నకిలీ డాక్యుమెంట్స్&zwnj;తో డాక్టర్లుగా చెలామణి అవుతున్న 12 మందిని టాస్క్&zwnj;ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ జోన్ల పరిధిలో పోలీసులు స్పెషల్ ఆపరేషన్ పేరిట విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సరైన మెడికల్ అర్హతలు లేకపోయినప్పటికీ వీరు క్లినిక్&zwnj;లు ఏర్పాటు చేసి, ప్రజలకు సెలైన్లు, ఇంజక్షన్లు, మెడిసిన్ ఇస్తున్నట్లు టాస్క్&zwnj;ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ వెల్లడించారు.</p> <p>ఈ తనిఖీల్లో భాగంగా పారామెడికల్ కోర్సు పూర్తి చేసిన ఒక మహిళ ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా గత కొన్నేళ్ల నుంచి అక్రమంగా క్లినిక్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దొరికిన ఈ 12 మంది ఫేక్ డాక్టర్లను అదుపులోకి తీసుకున్న టాస్క్&zwnj;ఫోర్స్ సిబ్బంది, వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున సెలైన్ బాటిళ్లు, బీపీ టెస్టింగ్ పరికరాలు, సర్జికల్ కత్తెరలు, పలు రకాల మెడిసిన్ &nbsp;స్వాధీనం చేసుకున్నారు.</p>
Read Entire Article