Ennallo Vechina Hrudayam Serial Today Episode అనంత్ ఆఫీస్‌కి రావడం చూసిన గాయత్రీ తనని ఫాలో అయి వచ్చాడని అనుకొని అనంత్ దగ్గరకు వెళ్లి నన్ను ఫాలో అవుతూ మా ఆఫీస్‌కే వచ్చేశావా అని అడుగుతుంది. చెడా మడా తిట్టేస్తుంది. అనంత్‌ని మాట్లాడే అవకాశమే ఇవ్వదు. ఇంతలో మేనేజర్ వచ్చి గాయత్రీని ఆపి తను మన క్లైంట్ అని చెప్తాడు. దాంతో గాయత్రీ నాలుక కరుచుకుంటుంది. అనంత్ లోపలికి వెళ్లి తనకు ఈ ఊరిలో రిసార్ట్ కట్టాలని ఉందని మంచి ల్యాండ్స్ చూపిస్తే బిజినెస్ ఐడియా ఇంప్లిమెంట్ చేస్తా అని మేనేజర్‌తో చెప్తాడు. దాంతో మేనేజర్ గాయత్రీని పంపిస్తా తను మీకు ల్యాండ్స్ చూపిస్తుందని అంటారు. ఇద్దరూ కలిసి వెళ్తారు.

రాత్రి త్రిపుర రాసుకుంటూ ఉంటే గాయత్రీ పెద్దగా నవ్వుతూ వస్తుంది. ఏమైందని త్రిపుర అడుగుతుంది. ఎప్పుడూ లేనిది ఇలా నవ్వుతుందేంటి ఇలా నవ్వుతూ ఉంటే చాలా బాగుందని చెల్లి గురించి అనుకుంటుంది. ఇక గాయత్రీ అక్కతో ఓ క్లైంట్‌కి ల్యాండ్ చూపించడానికి వెళ్లానని జరిగింది చెప్తుంది. గాయత్రీ, అనంత్ ల్యాండ్ చూడటానికి వెళ్లినప్పుడు గాయత్రీ చేతికి ఓ క్రీమ్ రాసుకొని అనంత్‌కి కూడా రాసుకోమని ఇస్తే దానికి అనంత్ ఆడవాళ్లు మేకప్ లేకుండా బయటకు రారా.. కిలోలు కిలోలు పూసుకుంటారు అని సెటైర్లు వేస్తాడు. దాంతో సరే నీకు క్రీమ్ వద్దు కదా అయితే ఓకే అని గాయత్రీ అంటుంది. ఇక ఇద్దరూ ల్యాండ్ చూస్తూ ఉంటే అనంత్ జారి నీటిలో పడిపోతాడు.

గాయత్రీ చేయి అందిస్తుంది. చూసి చూండగానే పడిపోయానే అంటూ సాంగ్ వేసుకుంటారు. ఇక అనంత్ బయటకు వచ్చి ఏదో కుట్టినట్లు ఉందని భుజం మీద గోక్కుంటాడు. దాంతో గాయత్రీ ఈ చెరువులో జలగలు ఉంటాయి అని చెప్పి షర్ట్ విప్పమని భుజం మీద జలగ తీస్తుంది. ఇక అనంత్ జలగలు దండ యాత్ర చేస్తున్నాయి అని ప్యాంట్ విప్పేస్తాడు. కారులో అందుకే క్రీమ్ ఇచ్చానని గాయత్రీ అంటుంది. ఆ విషయం అక్కకి చెప్పి తెగ నవ్వుతుంది. ఇంతలో త్రిపుర వాళ్ల పిన్ని వచ్చి తల నొప్పి వస్తుందని చెప్తుంది. దాంతో త్రిపుర తానే వంట చేస్తానని అంటుంది. గాయత్రీ తిట్టుకుంటుంది. అక్కతో పని చేయించడానికి అన్నీ నొప్పులు వస్తాయని అంటుంది. ఇక అనంత్ ల్యాండ్ గురించి చెప్తాడు. ఓకే అని తండ్రి చెప్తాడు.

బ్యాంక్‌లో డబ్బులు ఇవ్వమని చెప్తాడు. ఆ మాటలు విన్న బాల ఓ బాక్స్ తీసుకొచ్చి అది తన బ్యాంక్ అని అందులో చాలా డబ్బులు వేయమని తండ్రి, తమ్ముడి దగ్గర డబ్బులు తీసుకుంటాడు. సాగర కన్యకి చూడటానికి చాలా డబ్బులు వచ్చాయని రేపు సాగర కన్యని చూస్తానని అనుకుంటాడు. త్రిపుర వంట చేస్తుంది. ఊర్వశి వచ్చి వంకాయ కర్రీ చేయలేదా అది చేయలేదా అని అడుగుతుంది. త్రిపుర వదినతో అన్నయ్య రాలేదా అంటే ఈ రోజు శాలరీ రోజు కదా రారులే అంటుంది. ఇంతలో అన్న వస్తాడు. తినడానికి పిలిచినా రాకుండా లోపలికి వెళ్లి ఓ సూట్ కేసులో పేకముక్కలు చూసుకొని దండం పెట్టుకొని ఫోన్‌లో ఆట ఆడుతాడు. ఈ సారి ఎలా అయినా లాభాలు రావాలని అనుకుంటాడు.

ఇక ప్రమీల తన భర్త ఓడిపోవడమే తప్ప వచ్చేదేం లేదని అంటుంది. ఉదయం అందరూ బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొంత మంది పిల్లలతో కలిసి త్రిపుర బస్ ఎక్కుతుంది. ఇక సాగర కన్యని చూడటానికి బాల బస్ వెనక పరుగులు తీస్తాడు. త్రిపుర బాలకి చేయి అందిస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: సత్యభామ సీరియల్: క్రిష్‌ సాక్షిగా సంజయ్, సంధ్యల పెళ్లి.. తలోదిక్కూ తలపట్టుకొని ఏడుపు.. సత్యకి నిజం తెలిస్తే!