Tharun Bhasckar's ENE Repeat Release Date Locked : 2018లో చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'ఈ నగరానికి ఏమైంది?'. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించగా... మాస్ కా దాస్ విశ్వక్ సేన్, సుశాంత్ రెడ్డి, అభినవ్, వెంకటేశ్ కాకుమాను ప్రధాన పాత్రల్లో నటించారు. 'ENE Repeat' పేరుతో సీక్వెల్ కూడా అనౌన్స్ చేయగా... తాజాగా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు.

రిలీజ్ ఎప్పుడంటే?

'ఈ నగరానికి ఏమైంది' రిలీజై ఎనిమిదేళ్లు పూర్తైన సందర్భంగా స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన మేకర్స్... రిలీజ్ డేట్‌పై కూడా క్లారిటీ ఇచ్చారు. నవంబర్ 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నలుగురు మధ్య తరగతి యువకుల జీవితంలో జరిగిన ఘటనలను 'ఈ నగరానికి ఏమైంది?'లో చూపించారు.

ఫస్ట్ పార్ట్‌లో విశ్వక్, సుశాంత్ రెడ్డి, వెంకటేశ్ కాకుమాను, అభినవ్ గోమటం ప్రధాన పాత్రల్లో నటించగా... సుశాంత్ ప్లేస్‌లో శ్రీనాథ్ మాగంటిని తీసుకున్నారు. అనుకోని కారణాలతో సుశాంత్ పోషించిన కార్తీక్ పాత్రలో శ్రీనాథ్ నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి సురేష్ బాబు, సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మిస్తున్నారు. సీక్వెల్‌లో బాలయ్య అతిథి పాత్రలో నటించనున్నట్లు గతంలో ప్రచారం సాగింది. మరి, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

Also Read : RAPO23 Update : ఎనర్జిటిక్ హీరో రామ్ కొత్త మూవీ స్టార్ట్ - డైరెక్టర్, హీరో కమ్ ప్రొడ్యూసర్... సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్