Emergency Fund : 2026కి ముందే ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధం చేసుకోండిలా.. చిన్న పొదుపులతో పెద్ద భద్రత!

3 weeks ago 2
ARTICLE AD

Build Your 2026 Emergency Fund : చూస్తుండగానే 2025 సంవత్సరం కూడా అయిపోయింది. ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు హెల్త్, డబ్బుకి సంబంధించిన గోల్స్ చాలామంది పెట్టుకుంటారు. అయితే దానిని మీరు రీచ్ కాలేకపోవచ్చు కానీ.. 2026కి మాత్రం ఇప్పటినుంచే  సిద్ధంగా ఉండొచ్చు. 2026 జనవరి రాకముందు నుంచే కొన్ని టిప్స్ ఫాలో అవుతూ ఎమర్జెన్సీ ఫండ్ ప్లాన్ చేసుకోవాలి. అసలు ఎమర్జెన్సీ ఫండ్ ఎందుకు ఉండాలి అనే ప్రశ్న మీలో ఉంటే..  జీవితం ఊహించని మలుపు తీసుకున్నప్పుడు మీకు, మీ కుటుంబానికి హెల్ప్ అయ్యే డబ్బులను ఎమర్జెన్సీ ఫండ్ అంటారు. అయితే ఇది ఎవరి దగ్గరి నుంచి అప్పు చేయడం, లోన్ తీసుకోవడం వంటిది కాదు. మీకు మీరు ఆర్థిక భద్రత ఇచ్చుకోవడం.

ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడు హెల్ప్ అవుతుంది?

ఏదైనా కారణంచేత, అనుకోకుండా ఆసుపత్రిపాలు అయినప్పుడు బిల్ పే చేయడానికి, ఉద్యోగం కోల్పోవడం లేదా కారు రిపైర్ ఇలా ఎన్నో అనుకోని ఖర్చులకు.. అప్పు తీసుకోకుండా, మీ డిపాజిట్లు బ్రేక్ చేయకుండా ఉంచడమే దీని లక్ష్యం. అయితే దీనిని మీరు 2026లోపు ప్రారంభించాలనుకుంటే.. ఈ రెండునెలల్లో ఈ చిన్న మార్పులు చేసి.. ఫండ్ సేవ్ చేయవచ్చు. అదెలాగో చూసేద్దాం.

ఎక్కడ సేవ్ చేయాలంటే?

మీకు నిధులు అవసరమైనప్పుడు భద్రత, లిక్విడిటీ ప్రధానం. అంటే మీ ఎమర్జెన్సీ ఫండ్ అవసరమైనప్పుడు సులభంగా అందుబాటులో ఉండాలి. అలా అని సాధారణ ఖర్చుల కోసం తీసేయగలిగేంత సులభంగా ఉండకూడదు. అలాంటప్పుడు మీరు డబ్బును సేవింగ్స్ అకౌంట్​లో కాకుండా రికరింగ్ డిపాజిట్లు (RDలు) చేయవచ్చు. నెలవారీ దానిలో కొంత మొత్తం ఉంచవచ్చు. ఇది ఆటోమేటిక్​గా, నెలనెల కట్ అవుతుంది. అలాగే దాదాపు 6–7 శాతం వడ్డీని ఇస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో తీయడం కూడా సులభంగా చేయవచ్చు.

లేదంటే మీరు స్వీప్-ఇన్ ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ట్రై చేయవచ్చు. అలాగే మీరు మ్యూచువల్ ఫండ్లతో సౌకర్యంగా ఉంటే.. లిక్విడ్ ఫండ్లు మంచి ప్రత్యామ్నాయం. అవి స్వల్పకాలిక రుణ సాధనాల్లో పెట్టుబడి పెడతాయి. స్థిరమైన, తక్కువ-రిస్క్​తో రాబడి ఇస్తాయి.

ఆటోమేట్ చేసి వదిలేయండి

పొదుపు చేయడానికి ఉత్తమ మార్గం ఏమిటంటే.. ఖర్చు చేసిన తర్వాత మిగిలిపోయిన వాటిని ఆదా చేయడానికి వేచి ఉండకుండా.. దానిని ఆటోమేట్ చేయడం మంచి లక్షణం. మీ జీతం మీ ఖాతాలో పడిన వెంటనే స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ లేదా SIPని సెటప్ చేయండి. నెలకు రూ. 5,000 – రూ.10,000 కూడా RD లేదా లిక్విడ్ ఫండ్​ చేయవచ్చు.

మీరు ఈ నెలకు 7,500తో RD లేదా SIP ప్రారంభిస్తే.. వచ్చే సంవత్సరం చివరి నాటికి.. మీరు దాదాపు 90,000 ఆదా చేస్తారు. ఇది అత్యవసర పరిస్థితుల్లో రుణం తీసుకోకుండా ఉండేందుకు హెల్ప్ అవుతుంది. డైరక్ట్ కట్ అయ్యేలా పెట్టుకోవడం వల్ల మీరు మరిచిపోయినా ఇబ్బంది ఉండదు.

చిన్నగా ప్రారంభించండి

పొదుపు చేయడానికి మీరు మీ జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని ఫుడ్ డెలివరీలను లేదా ఆన్లైన్ ఆర్డర్లను తగ్గిస్తే చాలు. మేము నెల నెలా ఎక్కువ డబ్బు పెట్టలేము అనుకున్నప్పుడు చిన్నగా ప్రారంభించండి. నెలకు 2,000 పెట్టండి. ఇది కూడా సంవత్సరానికి 24,000 అవుతుంది. ఈ రోజు చిన్న పొదుపులు భవిష్యత్తులో పెద్ద మొత్తంలో మీకు మనీ ఇవ్వవచ్చు.

మీ ఎమర్జెన్సీ ఫండ్​ని విలాసాల కోసం అస్సలు ఉపయోగించకూడదు. దానిని ఎప్పుడూ పక్కకే ఉంచాలి. మీరు ఎంజాయ్ చేయాలనుకున్న ఇతర ఏ పనులకైనా మీరు వాటిని బ్రేక్ చేయకుండా ఉంచగలిగితే మంచిది.

Read Entire Article