Eid Special Sher Kurma : బక్రీద్ స్పెషల్ షీర్ కూర్మా రెసిపీ.. టేస్టీగా, సింపుల్​గా ఇంట్లో చేసుకోండిలా

1 week ago 2
ARTICLE AD

Eid Sheer Kurma Recipe In Telugu : బక్రీద్ (Bakrid 2026) రోజున దాదాపు అందరూ ముస్లింలు షీర్​ కూర్మా చేసుకుంటారు. అలాగే వారు తినడంతో పాటు ఇతరులకు కూడా వీటిని అందిస్తారు. నోరూరించే ఈ రెసిపీని ముస్లింలే కాదు.. ఇతర వర్గాల వారు కూడా ఇష్టంగా తింటారు. మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా చేయాలి? షీర్ కూర్మా చేసేందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు

జీడిపప్పు - 10

బాదం - 10

పిస్తాలు - 12

సన్నని సేమ్యాలు - 50 గ్రామలు

పాలు - 1 లీటర్

పంచదార - 1 కప్పు

మిల్క్​మెయిడ్ - 3 టేబుల్ స్పూన్లు

తయారీ విధానం

ముందుగా జీడిపప్పు, బాదం, పిస్తాలను సన్నగా తురుముకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టాలి. దానిలో నెయ్యి వేసి జీడిపప్పు పలుకులు, పిస్తాలు, బాదం పలుకులు వేసి వేయించాలి. దోరగా వేగిన తర్వాత వాటిని తీసేసి పక్కన పెట్టుకోవాలి. అనంతరం సన్నని సేమ్యాను కూడా వేసి వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు మరో గిన్నె తీసుకుని దానిలో పాలు వేయాలి. పాలు బాగా మరగనివ్వాలి. అడుగు పట్టకుండా కలుపుతూ పాలను కాచుకోవాలి. అవి కాస్త దగ్గర అయిన తర్వాత వాటిలో మిల్క్​మెయిడ్ వేసి కలపాలి. అనంతరం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న సేమ్యాలను వేసి ఉడికించుకోవాలి.

పక్కనే మరోస్టౌవ్ వెలిగించి దానిపై మరో కడాయి పెట్టి పంచదార వేయాలి. అది కాస్త డార్క్ కలర్ అంటే లైట్ కారమెల్ కలర్ వచ్చే వరకు తిప్పుతూ ఉండలు లేకుండా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న పాకాన్ని పక్కనే ఉన్న పాల మిశ్రమంలో వేసి కలపాలి. పాకం బాగా కలిసేలా తిప్పి.. మిశ్రమాన్ని చిక్కగా కానివ్వాలి. చివరిగా ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్​ వేసి స్టౌవ్ ఆపేయాలి. కొందరు నేరుగా పంచదార వేసి కలిపేస్తారు. కానీ పాకం వచ్చాక వేస్తే రుచి మరింత పెరుగుతుంది.  అంతే టేస్టీ టేస్టీ బక్రీద్ స్పెషల్ షీర్ కూర్మా రెడీ.

షీర్ కూర్మాను వేడిగా తినొచ్చు. లేదా ఫ్రిడ్జ్​లో పెట్టుకుని చల్లగా కూడా తినొచ్చు. మీ రుచికి తగ్గట్లు పంచదార, డ్రై ఫ్రూట్స్ కొలతలు మార్చుకోవచ్చు. అలాగే దీనిని బక్రీద్ రోజునే కాదు.. ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు కూడా దీనిని సింపుల్​గా ఇంట్లో చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ షీర్ కుర్మాను ట్రై చేసి.. ఇంట్లో వారికి సర్​ఫ్రైజ్ ఇవ్వండి.

Read Entire Article