DIY Hair Masks for Dry Hair : పొడిబారిన జుట్టు చూసేందుకు చాలా రఫ్‌గా ఉంటుంది. జుట్టులో తేమ లేకపోవడం వల్ల బలహీనంగా మారుతుంది. చిట్లిపోతుంది(split ends). హెయిర్ బ్రేకేజ్ అవుతుంది. అలాంటి సమయంలో హీట్ స్టైలింగ్, కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తే పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది. కాలుష్యం, సరైన పోషకాహారం లేకపోవడం కూడా పొడి జుట్టుకు కారణమవుతాయి.

అందుకే జుట్టు మరింత డ్రై కాకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కెమికల్ ప్రొడక్ట్స్ వాడకుండానే ఇంట్లోనే లభించే సహజ పదార్థాలతో పొడి జుట్టును దూరం చేసుకోవచ్చు. జుట్టుకు లోతైన తేమ, పోషణ అందించవచ్చు. ఇంతకీ ఆ ఇంటి చిట్కాలు ఏంటో.. వాటిని ఎలా జుట్టుకు అప్లై చేస్తే మంచిదో.. వాటివల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అవిసె గింజల జెల్

ఫ్లాక్స్ సీడ్స్‌(Flaxseed Gel)లో ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ప్లాంట్ కంపౌండ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి జుట్టుకు సహజమైన తేమను అందిస్తాయి. దీనిని అప్లై చేయడం వల్ల డ్రై హెయిర్‌ సాఫ్ట్‌గా మారుతుంది. ఫ్రిజ్ తగ్గిస్తుంది. కర్ల్స్‌కు సహజ డెఫినిషన్ ఇస్తుంది. జుట్టును లైట్‌గా ఉంచుతుంది.

కలబంద గుజ్జు

అలొవెరా సహజ హైడ్రేషన్‌కు ప్రసిద్ధి చెందింది. దీని జెల్ను తలకు అప్లై చేస్తే తేమ అందుతుంది. స్కాల్ప్ని శాంతింపజేస్తుంది. పొడిబారిన జుట్టును హైడ్రేట్ చేస్తుంది. జుట్టుకు మెరుపును ఇచ్చి.. మేనేజ్ చేయడం సులభం చేస్తుంది.

అరటి పండు హెయిర్ మాస్క్

అరటిలో పొటాషియం, విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇది సహజ కండిషనర్‌లా పనిచేస్తుంది. రఫ్ క్యూటికల్స్‌ను స్మూత్ చేసి.. జుట్టు చిట్లడాన్ని తగ్గిస్తుంది. బలహీనమైన జుట్టుకు మృదుత్వం ఇస్తుంది. అరటిని మెత్తగా ముద్దలా చేసి.. మాస్క్‌లా అప్లై చేసి 20-30 నిమిషాల తర్వాత కడగాలి. అయితే అరటిని వదిలించుకోవడం కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎటైనా బయటకు వెళ్లేప్పుడు కాకుండా ఇంట్లో ఉండేప్పుడు అప్లై చేసుకుంటే మంచిది.

పెరుగు మాస్క్..

పెరుగులో ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. ఇవి జుట్టు బలాన్ని పెంచడంలో సహాయపడతాయి. ఇది పొడిబారడాన్ని తగ్గించి.. తలకు పోషణ ఇస్తుంది. జుట్టు టెక్స్చర్ మెరుగై.. సిల్కీ ఫినిష్ ఇస్తుంది.

తేనె + ఆలివ్ ఆయిల్

తేనె సహజంగా తేమను ఆకర్షిస్తుంది. ఆలివ్ ఆయిల్ తేమను లాక్ చేస్తుంది. ఈ రెండు కలిసి ఫ్రిజ్‌ను కంట్రోల్ చేస్తాయి. హైడ్రేషన్‌ను సీల్ చేసి గ్లోసీ లుక్ ఇస్తాయి.

కొబ్బరి నూనె

కొబ్బరి నూనెను నార్మల్గా కాకుండా.. కాస్త వేడి చేసి జుట్టుకు అప్లై చేస్తే అది లోపలికి బాగా చేరుకుంటుంది. ప్రోటీన్ లాస్ తగ్గించడంలో సహాయపడుతుంది. స్కాల్ప్కి బాగా మసాజ్ చేస్తే రక్త ప్రసరణ మెరుగుపడి.. రూట్స్ బలపడతాయి. జుట్టు మృదువుగా, సాఫ్ట్‌గా మారుతుంది.

వారానికి 1-2 సార్లు ఈ సహజమైన మాస్క్స్, టిప్స్ ఫాలో అయితే మంచి ఫలితాలు చూడగలుగుతారు. అప్లై చేసి 20-30 నిమిషాలు ఉంచాలి. తర్వాత మైల్డ్ షాంపూతో కడగాలి. ఇలా రెగ్యులర్గా ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. జుట్టుకు తేమ, బలం, మెరుపు అంది.. మృదువుగా, ఆరోగ్యంగా మారుతుంది.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.