రామాయణం, మహాభారతం సహా పురాణాలు మనకు ఎన్నో అస్త్రాల గురించి బోధిస్తాయి. శక్తి ఎంత గొప్పది అయినా కానీ దాన్ని ధర్మంతోనే ఉపయోగించాలి..లేదంటే అది వినాశనానికి దారి తీస్తుంది.

సుదర్శన చక్రం, బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం సహా అద్భుతమైన అస్త్రాల గురించి తెలుసుకుందాం

సుదర్శన చక్రం

సుదర్శన చక్రం శ్రీ మహావిష్ణువు అత్యంత ప్రియమైన ఆయుధం. సు అంటే మంచి, దర్శనం అంటే దర్శనం... అంటే దుష్టులను భయపెట్టేది, సాధువులకు రక్షణ ఇచ్చే దర్శనం. ఈ చక్రంతో శ్రీ కృష్ణుడు ఎందరో రాక్షసులను సంహరించాడు. ఆధ్యాత్మికంగా ఇది కాలచక్రం, ధర్మం చక్రం. మన జీవితంలో దుష్ట భావాలను నాశనం చేసి మంచి మార్గం చూపించ శక్తి. ఇదెంత శక్తివంతమైనది అంటే..శివుడిమీద కూడా ప్రయోగించగా.. శివయ్య తన తత్వాన్ని కాపాడుతున్నాడని చెబుతారు. నిజమైన శక్తి ధర్మంలో ఉందని సూచిస్తుంది సుదర్శన చక్రం.

బ్రహ్మాస్త్రం

మహాభారతంలో అర్జునుడు, అశ్వత్థామ, కర్ణుడు వంటి మహా యోధులు దీనిని ఉపయోగించారు. ఇది సృష్టి, సంహారం రెండింటినీ సూచిస్తుంది. బ్రహ్మాస్త్రం వాడేటప్పుడు కూడా ధర్మం పాటించాలి. ఎందుకంటే అశ్వత్థామ ఉపయోగించినప్పుడు ఉత్తర గర్భంపై ప్రయోగించాడు...అప్పుడు గర్భంల ఉన్న పరీక్షితుడిని శ్రీకృష్ణుడు రక్షించాడు. అంటే బ్రహ్మాస్త్రం శక్తి అనంతం. బ్రహ్మాస్త్రం అంటే బ్రహ్మదేవుడు సృష్టించిన అస్త్రం అనుకుంటారు కానీ.. బ్రహ్మము అనేది ఓ తత్వం, వివరణ చెప్పలేనిది అని అర్థం. సృష్టి అంతా ఒక్కటే అయితే ఆయనే పరమాత్మ, పరబ్రహ్మ. ఆయన ద్వారా వచ్చిన అస్త్రం కాబట్టి బ్రహ్మాస్త్రం.

నారాయణాస్త్రం

శ్రీ మహావిష్ణువు అస్త్రం నారాయణాస్త్రం. ఎదురుతిరిగితే మరింత శక్తివంతమవుతుంది. ఎదురుగా ఉన్నవారు ఆయుధాలు వదిలి, సమర్పణతో నమస్కరిస్తే మాత్రమే ఆగుతుంది. మహాభారతంలో అస్వత్థామ ఈ అస్త్రాన్ని ప్రయోగించాడు..భీముడు ఎదురుతిరగడంతో మరింత భయంకరంగా మారింది..కృష్ణుడు , అర్జునుడు సమర్పణ చేయడంతో ఆగింది. అహంకారాన్ని నాశనం చేసే ఈ అస్త్రం - వినయం, సమర్పణ ఇదే నిజమైన రక్షణ

పాశుపతాస్త్రం

లయకారుడు అయిన శివుడి నుంచి వచ్చిన ఆయుధం పాశుపతాస్త్రం. త్రిశూలకార జ్వాలల నుంచి వచ్చిన ఈ ఆయుధం సమస్త సృష్టిని నాశనం చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ ఆయుధాన్ని అర్జునుడికి ప్రసాదించాడు శివుడు. ఆధ్యాత్మికంగా ఇది అజ్ఞానం, దుష్ట శక్తుల సంహారానికి ప్రతీక. శివుడి కృపతో మాత్రమే దీన్ని నియంత్రించవచ్చు

నాగపాశం

సర్ప శక్తి బంధనంగా చెప్పే ఈ ఆయుధం నాగరాజు ఆకాశంలో నాగపాశం. ఇది శత్రువును పాములతో చుట్టి బంధించి విషయం ద్వారా బాధపెడుతుంది. ఈ అస్త్రాన్ని రావణుడు, ఇంద్రజిత్తు ఉపయోగించారు. ఆధ్యాత్మికంగా ఇది మనస్సును బంధఇంచే కామ, క్రోధ శక్తులను సూచిస్తుంది

అగ్ని అస్త్రం - వారుణాస్త్రం

అగ్ని, జల శక్తులతో కూడిన బాణం ఇది. అగ్ని దేవుడి శక్తి శత్రు సైన్యాలను కాల్చేస్తుంది. వరుణుడి అనుగ్రహంతో వచ్చిన వారుణాస్త్రం వరదలు, నీటి బంధనాలు సృష్టిస్తుంది. ప్రకృతి శక్తులతో సమతుల్యం చూపిస్తాయి

వజ్రాస్త్రం

ఇంద్రుడి ఉరుము ఆయుధం వజ్రాస్త్రం. బ్లూ ఎలక్రిక్ శక్తి గల ఆయుధం ఇది. ఎదుటివారిని ఉరుములా కొట్టి నాశనం చేస్తుంది. ఆధ్యాత్మికంగా ఇది వేగవంతమైన జ్ఞానోదయాన్ని సూచిస్తుంది

ఈ అద్భుతమైన అస్త్రాలు పురాణాల్లోనే కాకుండా మన జీవితంలోనూ ఉన్నాయి. మనిషిలో అహంకారం, కోపం, అజ్ఞానం..వీటన్నింటినీ ఈ అస్త్రాల్లానే ధ్వంసం చేయాలి. అందుకు కావాల్సింది ధర్మం, వినయం, భగవంతుడి కృప. అస్త్రాల్లానే వీటిని కూడా సరైన మార్గంలో ఉపయోగించి జీవితంలో ధర్మ యుద్ధం చేయాలి.

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు

శ్రావణమాసం 2026: శుభదినాలు, వరలక్ష్మీ వ్రతం తేదీలు, పూజా విధానాలు!