Divorce Risks in India : వివాహ బంధాన్ని తరచుగా జీవితంలో అత్యంత బలమైన సంబంధంగా పరిగణిస్తారు. కానీ ప్రతి సంబంధం ఎల్లప్పుడూ ఒకేలా ఉండదు. కాలక్రమేణా ప్రజల ఆలోచనలు, అవసరాలు, భావాలు మారుతాయి. ఈ మార్పులే తరచుగా సంబంధాలలో అంతరానికి కారణమవుతాయి. అందుకే ఈ మధ్యకాలంలో విడాకుల కేసులు పెరుగుతున్నాయి. అందుకే వివాహంలో ఏ సంవత్సరం రిలేషన్పై ఇంట్రెస్ట్ని తగ్గించి.. కష్టంగా మారుస్తుందో ఇప్పుడు చూసేద్దాం.

ఏ సంవత్సరంలో అత్యధిక విడాకులు జరుగుతాయి?

రిలేషన్స్ గురించి సమాచారం అందించే Marriage.com అనే వెబ్‌సైట్ ప్రకారం.. పెళ్లయిన మొదటి 2 సంవత్సరాలలో.. ఆ తర్వాత 5 నుంచి 8 సంవత్సరాల మధ్య విడాకుల ప్రమాదం అత్యధికంగా ఉంటుంది. అలాగే 7వ, 8వ సంవత్సరాలు సంబంధాలకు అత్యంత ప్రమాదకరమైన కాలంగా పరిశోధనలు వెల్లడించాయి.

Also Read : చీటింగ్ చేయడంలో మగవారు, ఆడవారికి మధ్య తేడాలు ఉంటాయా? వివాహేతర సంబంధాలకి కారణాలు ఇవే

చాలా మంది నిపుణులు దీనిని 'ఏడేళ్ల విసుగు'తో ముడిపెడతారు. ఇది ఒక పాత సిద్ధాంతం. దీని ప్రకారం పెళ్లయిన సుమారు 7 సంవత్సరాల తర్వాత.. చాలా జంటలు తమ సంబంధంపై ఆసక్తిని కోల్పోవడం ప్రారంభిస్తారట. ఇది పూర్తిగా నిరూపించబడనప్పటికీ.. అనేక పరిశోధనలు, గణాంకాలు 7వ, 8వ సంవత్సరాలలో విడాకుల కేసులు పెరిగాయని చూపించాయి.

ఎప్పుడు బంధం స్ట్రాంగ్ అవుతుందంటే..

ఈ క్లిష్ట కాలాన్ని విజయవంతంగా అధిగమించినవారు రాబోయే సంవత్సరాలలో విడాకులతో ముగిసే అవకాశం తక్కువగా ఉంటుందని కూడా ఈ అధ్యయనంలో తేలింది. వివాహం జరిగిన 9 నుంచి 15 సంవత్సరాల మధ్య.. చాలా జంటలు తమ సంబంధాలలో ఎక్కువ స్థిరత్వాన్ని, అవగాహనను పొందుతారట. ఈ సమయానికి పిల్లలు, వృత్తి, బాధ్యతలు పెరుగుతాయని అందుకే విడిపోయే అవకాశం తక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.

Also Read : బెస్ట్ ఫ్రెండ్‌తో గొడవైందా? ఈ టిప్స్ ఫాలో అయితే మళ్లీ బాండ్ స్ట్రాంగ్ అవుతుంది

విడిపోవడానికి కారణాలు ఇవే

ఒక రిలేషన్ విచ్ఛిన్నం కావడానికి ఒకే ఒక్క కారణం ఎప్పుడూ ఉండదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. విడాకులకు ఆర్థిక ఒత్తిడి అతిపెద్ద కారణాలలో ఒకటిగా పరిగణిస్తారు. డబ్బు లేకపోవడం, అప్పులు లేదా ఉద్యోగం కోల్పోవడం వంటి పరిస్థితులు సంబంధంపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తాయి. అంతేకాకుండా కాలక్రమేణా అభిప్రాయాలు మారడం కూడా అంతరానికి కారణం కావచ్చు.

పెళ్లయిన కొన్ని సంవత్సరాల తర్వాత భార్యాభర్తల లక్ష్యాలు, వృత్తి లేదా కుటుంబం వేరుపడటం మొదలవుతుంది. దీని కారణంగా వివాదాలు పెరుగుతాయి. అవిశ్వాసం, గృహ హింస, భావోద్వేగ మద్దతు లేకపోవడం కూడా విడాకులకు ప్రధాన కారణాలని నిపుణులు భావిస్తున్నారు. అలాగే చిన్న వయస్సులోనే పెళ్లి చేసుకోవడం, త్వరగా తల్లిదండ్రులు కావడం కూడా చాలా జంటలకు తమ సంబంధాన్ని కొనసాగించడం కష్టతరం చేస్తున్నాయట.

Also Read : అందంగా లేకపోయినా పర్లేదు.. ప్రేమగా ఉంటే చాలు, Shrekking ట్రెండ్ అంటే ఇదే