టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్లలో 'దిల్' రాజు (Dil Raju) ఒకరు. మ్యాగ్జిమమ్ టాప్ స్టార్ హీరోలతో సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. హీరోలకు హిట్స్ ఇవ్వడంతో పాటు ఆయన కూడా కలెక్షన్స్ సొంతం చేసుకున్నారు. ఆయన నిర్మాతే కాదు... డిస్ట్రిబ్యూటర్ కూడా! డిస్ట్రిబ్యూషన్ రంగంలో 'దిల్' రాజును నైజాం కింగ్ అంటారు. తెలంగాణ ఏరియాలో మేజర్ థియేటర్లు ఆయన చేతుల్లో ఉన్నాయనేది ఇండస్ట్రీ చెప్పే మాట. విశాఖలో కూడా 'దిల్' రాజు డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారు. అయితే నైజాంలో 'దిల్' రాజు, ఆ తర్వాత ఏషియన్ సునీల్ అధిపత్యానికి పోటీగా మైత్రి మూవీ మేకర్స్ రంగంలోకి దిగింది. ఇప్పుడు 'దిల్' రాజును పెద్ద దెబ్బ కొట్టింది.

'దిల్' రాజు ఇలాఖాలో మైత్రి అడుగు
తెలంగాణలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్ ఓపెన్ చేసిన మైత్రి... కొన్ని రోజులుగా వరుస సినిమాలు విడుదల చేస్తూ వస్తోంది. అయితే వాళ్ళకు థియేటర్లు లేకపోవడం పెద్ద మైనస్ అయ్యింది. ఆల్రెడీ ఉన్న థియేటర్లలో మెజారిటీ స్క్రీన్లు దిల్ రాజు, ఏషియన్ సునీల్, సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు చేతుల్లో ఉన్నాయి. వాళ్ళు సొంతంగా కట్టినవి, కొన్నవి కొన్ని అయితే లీజుకు తీసుకున్నవి ఇంకొన్ని.

థియేటర్లు లేకపోతే లాభం లేదనుకుని లీజుకు తీసుకోవడం లేదా కొనడం వంటివి చేయడం మొదలు పెట్టింది మైత్రి డిస్ట్రిబ్యూషన్ సంస్థ. హైదరాబాద్ సిటీలో బాలా నగర్ విమల్ థియేటర్ రెన్యూవల్ చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంది. కానీ వాళ్ళ చేతికి ఎక్కువ థియేటర్లు రావడం లేదు. తెలంగాణలో అక్కడ ఇక్కడ కాదు... ఇప్పుడు ఏకంగా దిల్ రాజు హోమ్ టౌన్ నిజామాబాద్‌లో అడుగు పెట్టింది.

Also Read: Peddi Nizam Release Issue - 'పెద్ది' రిలీజ్ హైడ్రామాకు శుభం కార్డు... 'దిల్' రాజు థియేటర్లలోనూ రామ్ చరణ్ సినిమా

నిజామాబాద్‌లోని నటరాజ్ థియేటర్‌ను లీజుకు తీసుకుంది మైత్రి. మొన్నటి వరకు ఇది ఏషియన్ డిస్ట్రిబ్యూషన్ చేతుల్లో ఉంది. అగ్రిమెంట్ పూర్తి అయ్యే వరకు, చివరకు వచ్చేదానికి ఎవరికీ తెలియనివ్వలేదు. అగ్రిమెంట్ చేసుకోవడానికి థియేటర్ ఓనర్ వెళ్లి ఏషియన్ సునీల్, దిల్ రాజు మనుషులకు చెబితే తప్ప వ్యవహారం అంత దూరం వచ్చిందని తెలియలేదట. మైత్రితో అగ్రిమెంట్ చేసి థియేటర్ ఖాళీ చేయమని చెప్పేశారు ఓనర్. దిల్ రాజు ఇలాఖాలో మైత్రి అడుగు పెట్టడం ఆయనకు పెద్ద దెబ్బ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

Photo Gallery: Naga Chaitanya Surprises Sobhita Dhulipala - శోభిత బర్త్ డే... ఆడియన్స్‌కు నాగ చైతన్య షాక్

ఒక్క థియేటర్ కాదు... టోటల్ ఎనిమిది!
నటరాజ్ థియేటర్ ఒక్కటే కాదని... నిజామాబాద్ ఏరియాలో మరో ఏడు థియేటర్లను కూడా మైత్రి డిస్ట్రిబ్యూషన్ లీజుకు తీసుకుందని తెలిసింది. దిల్ రాజు, శిరీష్ సోదరులకు ఇది ఇంకా పెద్ద దెబ్బ. అది కూడా పన్నెండేళ్లకు లీజు అగ్రిమెంట్స్ చేశారట. తమ హోమ్ టౌన్, సొంత ఏరియాలో తమకు తెలియకుండా థియేటర్లు లీజుకు తీసుకోవడంతో దిల్ రాజు బ్రదర్స్ బాగా అప్ సెట్ అయ్యారని టాలీవుడ్ టాక్.

ఇప్పటి వరకు తెలంగాణ, నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ పరంగా దిల్ రాజుది అప్పర్ హ్యాండ్. ఇప్పుడు ఆ అధిపత్యానికి తెర పడేటట్టు మైత్రి వేస్తున్న అడుగులు చూస్తుంటే అర్థం అవుతోంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడాలి.

Photo Gallery: Priyanka Chopra Swimsuit Holiday - స్విమ్‌సూట్‌లో గ్లోబల్ స్టార్... మహేష్ 'వారణాసి' బ్రేక్‌లో ప్రియాంక చోప్రా ఏం చేసిందో చూశారా?