Dhurandhar 2 Vs Pushpa 2: 'పుష్ప 2' ఓపెనింగ్ రికార్డు సేఫేనా? 'ధురంధర్ 2' దెబ్బకు కిందకు వెళ్ళేది ఎవరు?
4 weeks ago 2
ARTICLE AD
బాలీవుడ్ ఇండస్ట్రీలో హయ్యస్ట్ ఓపెనింగ్ డే రికార్డు క్రియేట్ చేసే దిశగా రణవీర్ సింగ్ (Ranveer Singh) అడుగులు వేస్తున్నారు. ఆయన తాజా సినిమా 'ధురంధర్ 2' ఫస్ట్ డే కలెక్షన్స్ విషయంలో ఒక అంచనా వచ్చింది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ 'జవాన్' ఫస్ట్ డే కలెక్షన్లను 'ధురంధర్ 2' బీట్ చేయడం గ్యారంటీ. మరి, 'పుష్ప 2' సంగతి ఏంటి? ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా హిట్ రికార్డులు సేఫేనా? ఇండియా ఫస్ట్ డే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాలు ఏమిటి? అందులో ఏయే సినిమాలు ఉన్నాయి? అనేది చూస్తే...
'జవాన్' రికార్డులు గల్లంతు!
బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ విషయానికి వస్తే... అక్కడ హయ్యస్ట్ ఓపెనింగ్ డే రికార్డు షారుఖ్ ఖాన్ 'జవాన్' పేరిట ఉంది. ఆ సినిమా మొదటి రోజు రూ. 129 కోట్లు కలెక్ట్ చేసింది. దాన్ని 'ధురంధర్ 2' బీట్ చేస్తుంది. ఈ సినిమా మొదటి రోజు 200 కోట్ల రూపాయలు కలెక్ట్ చేయవచ్చని ఒక అంచనా. సో... ఆల్ టైమ్ బాలీవుడ్ రికార్డును ఖచ్చితంగా క్రియేట్ చేస్తుంది.
మరి, 'పుష్ప 2' సంగతేంటి?
'పుష్ప 2' ప్రపంచ వ్యాప్తంగా మొదటి రోజు వసూళ్లు 274 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో హయ్యస్ట్ ఓపెనింగ్ డే రికార్డు అల్లు అర్జున్ సినిమా పేరిట ఉంది. దాన్ని 'ధురంధర్ 2' బీట్ చేస్తుందో లేదో చూడాలి. అయితే... 'బాహుబలి 2' (రూ. 214 కోట్లు), 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' (రూ. 223 కోట్లు) రికార్డులు మాత్రం ప్రమాదంలో ఉన్నాయి.
ఇండియాలో ఓపెనింగ్ డే హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాలు:
పుష్ప 2: ది రూల్ - రూ. 274 కోట్లు
ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం - రూ. 223 కోట్లు
బాహుబలి 2: ది కంక్లూజన్ - రూ. 214 కోట్లు
కల్కి 2898 AD - రూ. 177 కోట్లు
కేజీఎఫ్ చాప్టర్ 2 - ₹159 కోట్లు
సలార్ - రూ. 158 కోట్లు
కూలీ - రూ. 153 కోట్లు
దే కాల్ హిమ్ ఓజీ - రూ. 144 కోట్లు
లియో - రూ. 142 కోట్లు
జవాన్ - రూ. 129 కోట్లు
Also Read: Ustaad Bhagat Singh: 'రాజా సాబ్' చేసిన తప్పు 'ఉస్తాద్' చేయలేదు...  ప్రభాస్ సినిమాకు జరిగిన పొరపాటు పవన్ కళ్యాణ్ చేయలేదు!
'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప 2: ది రూల్' తర్వాత ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ బరిలో 200 కోట్ల మార్క్ దాటే సినిమాగా 'ధురంధర్ 2'రికార్డు క్రియేట్ చేయడం గ్యారెంటీ. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆ మార్క్ రీచ్ అయ్యే మొదటి సినిమాగా చరిత్రకు ఎక్కడం గ్యారంటీ. అయితే ఈ సినిమా తెలుగు సినిమాలు ఎన్నింటిని దాటి ముందుకు వెళుతుంది? అనేది చూడాలి.
'ధురంధర్ 2' సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఇందులో రణవీర్ సింగ్ సరసన సారా అర్జున్ నటించారు. ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడీ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. మార్చి 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
Also Read: Dhurandhar 2 BO Day 1 Prediction: 'ధురంధర్ 2'తో బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు గల్లంతు... కుంభస్థలాన్ని కొడుతున్న రణవీర్ సింగ్
Read Entire Article