Dhurandhar 2 Vs Baahubali 2: ధురంధర్ 2 vs బాహుబలి 2... ప్రభాస్ రికార్డులు సేఫ్, రణవీర్ ఎక్కడ తగ్గాడో తెలుసా?
1 month ago 6
ARTICLE AD
హిందీ చిత్రసీమకు ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన 'ధురంధర్ 2' ఊపిరి పోసింది. భారీ విజయం కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ ఇండస్ట్రీకి ఓ సాలిడ్ బ్లాక్ బస్టర్ ఇచ్చింది. బాక్స్ ఆఫీస్ బరిలో ఆ సినిమా దూకుడు చూసి ఫస్ట్ ప్లేసుకు చేరుకుంటుందని భావించారు. అయితే... ఆమిర్ ఖాన్ 'దంగల్', రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన 'బాహుబలి 2' రికార్డులను ఇంకా బీట్ చేయలేదు.
ప్రభాస్ బాహుబలి 2 రికార్డులు సేఫ్...
రణవీర్ సినిమా ఎక్కడ వెనుకబడింది?
'దంగల్'కు చైనాలో ఎక్కువ: ఇండియాలో 'దంగల్' హిట్టే. అయితే... ఆ సినిమా చైనాలో భారీ బ్లాక్ బస్టర్. కేవలం ఆ దేశంలో మాత్రమే 1305 కోట్లు వసూలు చేసింది. మరి 'ధురంధర్ 2'కు చైనాలో అటువంటి అవకాశం లభించలేదు. గల్ఫ్ దేశాల్లో కూడా ఈ సినిమాపై నిషేధం విధించడం వల్ల వసూళ్ళలో కొంత గండి పడింది. గల్ఫ్ దేశాల్లో విడుదలైతే అక్కడ నుంచి 100 కోట్లు వచ్చేవి అని అంచనా. ఇప్పుడు అది నష్టం కిందకు వస్తుంది.
దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువ: దక్షిణాది రాష్ట్రాల్లో 'ధురంధర్ 2'ను చూశారు. అయితే మన సినిమాల స్థాయిలో వసూళ్లు రాలేదు. 'పుష్ప 2', 'బాహుబలి 2', 'ఆర్ఆర్ఆర్' సినిమాలు అటు హిందీలో, ఇటు దక్షిణాది భాషల్లో భారీ వసూళ్లు సాధించాయి. ఆ సినిమాలతో పోలిస్తే... ప్రాంతీయ భాషల్లో 'ధురంధర్ 2' అంత వసూళ్లు రాబట్టలేదు.
రణవీర్ సింగ్ సినిమాకు తెలుగు వెర్షన్ నుంచి రూ. 42.56 కోట్లు, తమిళం నుంచి రూ. 19.39 కోట్లు, కన్నడ నుంచి రూ. 3.66 కోట్లు, మలయాళం నుంచి రూ. 1.77 కోట్లు మాత్రమే వచ్చాయి. సౌత్ నుంచి వచ్చే పాన్ ఇండియా సినిమాలు కేవలం దక్షిణాది రాష్ట్రాల్లో వంద కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తాయి. అదీ మైనస్ అయ్యింది.
Also Read: Bad Boy Karthik Movie Review - 'బ్యాడ్ బాయ్ కార్తీక్' రివ్యూ: బాబోయ్... మరీ అంత బ్యాడా? నాగశౌర్య సినిమాను చూడలేమా?
పెద్దలకు మాత్రమే అన్నట్టు 'A' సర్టిఫికేట్!
'ధురంధర్ 2' సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి 'A' సర్టిఫికేట్ లభించింది. దాంతో థియేటర్లలో 18 ఏళ్లు పైబడిన ప్రేక్షకులు మాత్రమే సినిమాను చూడగలిగారు. సో... పిల్లలను తీసుకు వెళ్లలేక కుటుంబ ప్రేక్షకులు సినిమాకు దూరంగా ఉండాల్సి వచ్చింది. దానికి తోడు సినిమా నిడివి 3 గంటల 49 నిమిషాలు కావడం వల్ల కొంత మంది యువత కూడా థియేటర్లకు వెళ్ళలేదు. వయలెన్స్ ఎక్కువ ఉందని టాక్ రావడం మరొక మైనస్.
Read Entire Article