Dhurandhar The Revenge Box Office Collection Day 1 Prediction: ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ధురందర్: ది రివెంజ్' విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే ఉంది. ఈ రోజు (మార్చి 18) సాయంత్రం ఐదు గంటల నుంచి ప్రీమియర్ షోలు పడుతున్నాయి. సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తే... బాలీవుడ్ రికార్డులు తిరగ రాసేలా ఉంది. మరి, ఈ సినిమా ఫస్ట్ డే (ఓపెనింగ్ డే) కలెక్షన్స్, ఓపెనింగ్ వీకెండ్‌ (మొదటి నాలుగు రోజుల్లో)లో ఎంత కలెక్ట్ చేయగలదో ఒక లుక్ వెయ్యండి.

'ధురంధర్ 2 ప్రివ్యూలు @ 50 కోట్లు
!Dhurandhar 2 Premiere Advance Booking Collection: రణవీర్ సింగ్ హీరోగా నటించిన 'ధురంధర్ 2' చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్‌లు భారీ జరిగాయి. ఈ సినిమా మీద విపరీతంగా క్రేజ్ ఉంది. శాక్‌నిల్క్ డేటా ప్రకారం... ఆల్రెడీ ఈ సినిమా ప్రివ్యూ షోల ద్వారా 47.91 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆల్మోస్ట్ 50 కోట్లు. ఈ రోజు సాయంత్రానికి ఈ నంబర్ 55కు చేరుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.

Also Read: Sarke Chunri Teri Sarke Song Lyrics: లిరిక్స్‌లో డబుల్ మీనింగ్స్... ఆ వల్గర్ స్టెప్పులేంటి? - యూట్యూబ్‌లో సాంగ్ డిలీట్

ప్రీమియర్లతో 50 కోట్లు కలెక్ట్ చేయడం అంటే... బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ రికార్డ్. ఇక, 'ధురందర్ 2' ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్‌లు మూడు రోజుల క్రితం ప్రారంభం అయ్యాయి. ఆల్రెడీ 29.06 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. బ్లాక్డ్ సీట్లతో కలిపి రూ. 38.57 కోట్లు సంపాదించింది. ఓవర్సీస్ నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. వీకెండ్ ప్రీ సేల్స్ ఆల్రెడీ 75 కోట్ల రూపాయలు దాటాయి. దాంతో 'ధురందర్ 2' టోటల్ ప్రీ సేల్స్ (బ్లాక్డ్ సీట్లతో కలిపి) 162 కోట్ల రూపాయల మార్కును దాటింది.

Also Read: Ustaad Bhagat Singh: 'రాజా సాబ్' చేసిన తప్పు 'ఉస్తాద్' చేయలేదు... ప్రభాస్ సినిమాకు జరిగిన పొరపాటు పవన్ కళ్యాణ్ చేయలేదు!

ఫస్ట్ డే 'ధురందర్ 2'కు ఎన్ని కోట్లు రావచ్చు?

పెయిడ్ ప్రివ్యూ టిక్కెట్లు 'ధురందర్ 2' కలెక్షన్లకు బాగా హెల్ప్ అయ్యాయి. షారుఖ్ ఖాన్ 'పఠాన్' (రూ. 57 కోట్లు), రణబీర్ కపూర్ 'యానిమల్' (రూ. 63 కోట్లు) కంటే ఫస్ట్ డే ఈ సినిమా ఎక్కువ కలెక్ట్ చేస్తుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా.

'ధురంధర్ 2' మొదటి రోజు టోటల్ కలెక్షన్లు (ప్రీమియర్ వసూళ్లతో కలిపి) రూ. 100 కోట్లకు పైగా ఉంటాయని అంచనా. హిందీ సినిమా హిస్టరీలో తొలిసారి ఈ రికార్డు నమోదు కానుంది.

ఓవర్సీస్ పెయిడ్ ప్రివ్యూల ద్వారా మొదటి రోజు ఆల్రెడీ 2.5 మిలియన్ డాలర్లను రాబట్టింది 'ధురంధర్ 2'. నార్త్ అమెరికాలో ఇండియన్ సినిమా ప్రీమియర్ షోస్ రికార్డును క్రియేట్ చేసే దిశగా దూసుకుపోతోంది.

పాకిస్తాన్‌ సహా గల్ఫ్ దేశాలలో 'ధురంధర్ 2' విడుదల కావడం లేదు. అయినప్పటికీ... ఈ సినిమా పలు ప్రాంతాలలో రికార్డులను బద్దలు కొడుతుందని అంచనా వేస్తున్నారు. ట్రేడ్ విశ్లేషకుల అంచనా ప్రకారం... 'ధురందర్ 2' ఫస్ట్ డే (ప్రివ్యూ వసూళ్లతో కలిపి) ₹200 కోట్లకు పైగా వసూలు చేసే అవకాశం ఉంది.

రణవీర్ సింగ్‌ సరసన సారా అర్జున్ కథానాయికగా నటించిన 'ధురంధర్ 2'లో ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, రాకేష్ బేడీ ప్రధాన పాత్రధారులు. మొదటి భాగంలో విలన్ రెహమాన్ డకాయిట్‌గా నటించిన అక్షయ్ ఖన్నా ఈసారి అతిథి పాత్రలో కనిపించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మార్చి 19న విడుదల కానుంది.

Also Read: Oscar: ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక