పోలీస్ క్యారెక్టర్లే కాదు... పొలిటికల్ రోల్స్‌లోనూ తన మార్క్ చూపించారు డైలాగ్ కింగ్ సాయి కుమార్. 'అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప... హీరోలు, విలన్లు లేరీ నాటకంలో' అంటూ 'ప్రస్థానం'లో ఆయన చెప్పిన డైలాగ్ ఒక్కటే కాదు... ఆ రోల్ కూడా పొలిటికల్ సినిమాలకు బెంచ్ మార్క్ అయ్యింది. 'మయసభ' వెబ్ సిరీస్‌లో రాయపాటి చక్రధర్ రావు (సీనియర్ ఎన్టీఆర్) పాత్రలోనూ ఆయన నటనకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు మరోసారి రాజకీయ నాయకుడి పాత్ర చేశారు సాయి కుమార్. అదీ 'ధర్మస్థల నియోజకవర్గం'లో. ఆ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల చేశారు. అది ఎలా ఉందంటే?

'ధర్మస్థల నియోజకవర్గం'లో ఎమ్మెల్యేగా సాయి కుమార్
Sai Kumar Role In Dharmasthala Niyojakavargam Movie: సాయి కుమార్‌తో పాటు సుమన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ధర్మస్థల నియోజకవర్గం'. జై జ్ఞాన ప్రభ తోట దర్శకుడు. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా పతాకంపై మేరుం భాస్కర్ నిర్మించారు. నటరాజ్, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు ఇతర ప్రధాన తారాగణం. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.

దేశంలో అంతర్యుద్ధాలు ప్రోత్సహించి విదేశీ పెట్టుబడులు రాకుండా చేయడం, ప్రభుత్వాలను పడగొట్టడం డీప్ స్టేట్ పవర్ అంటూ 'ధర్మస్థల నియోజకవర్గం' ట్రైలర్ ప్రారంభమైంది. అప్పుడు ప్రజలు ఆందోళనలు చేయడం వంటివి చూపించారు. ఆ తర్వాత 'ధర్మస్థల నియోజకవర్గపు సామంత రాజు (ఎమ్మెల్యే)' అని బోర్డు ఉన్న బండిపై సాయి కుమార్‌ను చూపించారు. ఆయనది ఎమ్మెల్యే రోల్ అని అర్థం అవుతోంది. క్యారెక్టర్ పేరు భైరాజ్. ''ఇక్కడ మంత్రి, ముఖ్యమంత్రి, రాజ్యాంగం... అన్నీ నేనే'' అంటూ ఆయన చెప్పిన డైలాగ్ వింటే... ధర్మస్థల నియోజకవర్గంలో నియంతలా వ్యవహరించే క్యారెక్టర్ అని తెలుస్తోంది.

Also Read: Sireesha RJ Mahee Wedding Photos - మహీతో శిరీష పెళ్ళి... లిఖితా మూర్తి & సెలబ్రిటీల సందడి... వైరల్ వెడ్డింగ్ ఫోటోలు

దేశం మొత్తం తమ పార్టీ జెండా ఎగురవేసినా... ధర్మస్థల నియోజకవర్గంలో మాత్రం విజయం సాధించలేకపోతున్నామని ఓ పార్టీ నేత (30 ఇయర్స్ పృథ్వీ) అంటారు. అయితే... భైరాజ్ మీద విజయం కోసం వాళ్ళు ఏం చేశారు? ఓ సామాన్యుడు (సుమన్) ఎలా ఎదిరించాడు? అనేది 'ధర్మస్థల నియోజకవర్గం'లో చూడాలి. 'మనీ తప్ప మానవత్వంతో సంబంధం లేని మృగాల మధ్య బతుకుతున్నాం' అని సుమన్, 'రాజకీయం అనేది మృగాలు ఉండే అడవి లాంటిది. వాటి జోలికి వెళ్లకుండా తప్పించుకుని తిరిగితే ప్రశాంతంగా బతకొచ్చు' అని సాయి కుమార్ చెప్పిన డైలాగులు కథలో రాజకీయ పోటీని చెప్పాయి.

Also Read: Ghamasaan Telugu OTT - బుందేల్‌ ఖండ్ లోయల్లో పోలీస్ vs డెకాయిట్... జీ5లో ప్రతీక్ గాంధీ, అర్షద్ వార్సీ సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

సినిమాలో ఐదు పాటలూ రాసిన చంద్రబోస్!
'ధర్మస్థల నియోజకవర్గం'లో ఐదు పాటలు ఉన్నాయి. ఆ ఐదింటీనీ ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ రాశారు. ఆయన మాట్లాడుతూ... ''ఐదు మంచి పాటలు రాసే సందర్భాలు కల్పించిన మా దర్శకుడికి థాంక్స్. 'రంగస్థలం' తర్వాత పాటల పరంగా నాకు అంతటి సంతృప్తి కలిగించిన చిత్రమిది. 'న్యాయం చేయరా దేవుడా...', 'ధర్మో రక్షతి రక్షిత:', 'ఆరంభం...', 'కొడుకో కొడుకో', 'కాలం..' - ఐదు పాటలు రాశా. వీటికి తన సంగీతంతో ప్రాణం పోశాడు మహావీర్. స్వరకర్తగా అతనికి మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నా'' అని చెప్పారు.

Dharmasthala Niyojakavargam Movie Cast And Crew: సాయి కుమార్, సుమన్, నటరాజ, రాయంచ కొక్కుర, వరుణ్ సందేశ్, వితికా షేరు, రాజా రవీంద్ర, రాజీవ్ కనకాల, 'కాలకేయ' ప్రభాకర్, 30 ఇయర్స్ పృథ్వీ, శివ ప్రధాన పాత్రలు పోషించిన 'ధర్మస్థల నియోజకవర్గం' చిత్రానికి సాహిత్యం: చంద్రబోస్, గానం: సునీత, కెమెరా: వెంకట హనుమ, పోరాటాలు: నందు మాస్టర్, నృత్య దర్శకత్వం: శ్రష్టి వర్మ, మాటలు: అస్లాం, కూర్పు: సాయిబాబు తలారి, సంగీతం: మహావీర్ ఏలేందర్కళా దర్శకత్వం: భార్గవాచారి నౌండ్ల, నిర్మాత: మేరుం భాస్కర్, కథ - కథనం - దర్శకత్వం: జై జ్ఞాన ప్రభ తోట.

Also Read: Varun Tej On Ghani Flop And Bhari Movie - ఈసారి తప్పే జరగదు... నిహారికతో 'బరి'పై వరుణ్ తేజ్ సెన్సేషనల్ కామెంట్స్