Dharma Mahesh New Restaurant: అమీర్‌పేట్‌లో 'డ్రింకర్ సాయి' హీరో కొత్త రెస్టారెంట్... ఈసారి జిస్మత్‌ స్పెల్లింగ్ మారింది!
1 week ago 2
ARTICLE AD
ఇటీవల వార్తల్లో నిలిచిన హీరో ధర్మ మహేష్ (Dharma Mahesh). 'డ్రింకర్ సాయి' సినిమా (Drinker Sai Movie)లో ఆయన హీరోగా నటించారు. అంతకు ముందు మరో సినిమా 'సింధూరం' చేశారు. ఆయన ఫ్యామిలీ లైఫ్ వివాదమైంది. ఇప్పుడు వాటిని పక్కన పెట్టి వ్యాపారం మీద దృష్టి పెట్టారు.
హీరోకి పాపులర్ మండీ రెస్టారెంట్!
హైదరాబాద్ సిటీలో నాన్ వెజ్ ప్రియులకు 'జిస్మత్' తెలిసే ఉంటుంది. ఆ రెస్టారెంట్ ఓనర్ ఎవరో కాదు... ధర్మ మహేష్. ఇంతకు ముందు దాని స్పెల్లింగ్ 'Gismat Mandi' అని ఉండేది. ఇప్పుడు ఆ పేరును 'Jismat Mandi'గా మార్చారు. కొత్తగా అమీర్ పేట్ ఏరియాలో 'జిస్మత్ జైల్ మండీ' పేరుతో తనయుడు జగద్వాజ పుట్టినరోజు సందర్భంగా కొత్త రెస్టారెంట్ ప్రారంభించారు. బ్రాండ్ పేరు మార్పు వెనుక మెరుగైన నాణ్యత, భావోద్వేగం, వారసత్వం ఉన్నాయని తెలిపారు.
Also Read: పూజతో 'స్పిరిట్' షూటింగ్ షురూ... మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా - ప్రభాస్ ఎక్కడ?
కుమారుడు జగద్వాజకు కంపెనీ బాధ్యతలు
'జిస్మత్ జైల్ మండీ' ప్రారంభోత్సవంలో ధర్మ మహేష్ తన వ్యాపారాల నిమిత్తం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ధర్మ మహేష్ కంపెనీ యాజమాన్యాన్ని పూర్తిగా తన కుమారుడు జగద్వజకు అంకితం చేస్తున్నానని తెలిపారు. ఇక నుంచి బిజినెస్ మొత్తం తనయుడు జగద్వాజ పేరు మీదకు మార్చనున్నట్టు వివరించారు. ఇక ఈ యాజమాన్యం బదిలీ వ్యవహారాలు పూర్తి అయ్యే వరకు పర్యవేక్షకుడిగా మాత్రమే ధర్మ మహేష్ ఉంటారు.
Also Read: 'ది రాజా సాబ్'కు ప్రభాస్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? హీరోయిన్లు, ఆర్టిస్టులకు అందులో సగం కూడా ఇవ్వలేదు
Read Entire Article