కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'కర' (Kara Movie). ఈ సినిమా పోస్టర్ బయటకు రాగానే అందరూ టైటిల్ గురించి రకరకాలుగా మాట్లాడుకున్నారు. అసలు కర అంటే ఏంటి? ఇదేం టైటిల్ అనుకున్నారు. ఇక ఇదే విషయాన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ధనుష్ కూడా ప్రస్థావించాడు. ఈ ఈవెంట్‌లో ఒక్కొక్కరు ఒక్కోలా తన సినిమా పేరుని పలికారని డైరెక్టర్, నిర్మాత ఇలా అందరి గురించి ధనుష్ చెప్పాడు. ఒకరేమో కార అన్నారని, మరొకరే కరా అని అన్నారు.. కానీ ఈ మూవీ పేరు జస్ట్ కర.. కర.. అంతే.. మీరు కారా, కీరా ఇలా ఏమైనా అనుకోండి.. సినిమా మాత్రం అందరికీ నచ్చుతుందని ధనుష్ అన్నారు. ఇది క్వాలిటీ ఫిల్మ్ అని, థియేటర్లలో అద్భుతాలు సృష్టిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

వెంకీ అట్లూరితో ధనుష్ మరో సినిమా!
'కర' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి వచ్చిన వెంకీ అట్లూరిని మాత్రం ధనుష్ తెగ ఆడుకున్నాడు. వాళ్లిద్దరూ కలిసి 'సార్' (తమిళంలో 'వాతి') చేశారు. అది హిట్. ఇప్పుడు మరొక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈవెంట్‌లో వెంకీ అట్లూరితో ధనుష్ 'అతి వినయం ప్రదర్శించకు.. నువ్వు మరీ అంత యాక్ట్ చేయకు.. వరుసగా హిట్లు కొడుతున్నావ్.. సార్.. అనుకుంటూ మరీ హంబుల్‌గా యాక్ట్ చేస్తున్నావ్.. యాక్టింగ్ మా పని.. నువ్వు డైరెక్షన్ చెయ్యి చాలు'' అంటూ కౌంటర్లు వేశారు. వెంకీ అట్లూరి ‘సార్’ తరువాత మళ్లీ ఓ కథ చెప్పాడట. కానీ కథ చెప్పి అటే కనిపించకుండా పోయాడట. ఆ కథ చాలా నచ్చిందట.. మళ్లీ అదే కథను తీసుకుని త్వరగా రా అని వెంకీ అట్లూరికి స్టేజ్ ముఖంగానే ధనుష్ చెప్పేశాడు.

See Photos: Mehreen Pirzada Wedding Pics - సడన్‌గా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన హీరోయిన్ మెహరీన్... భర్తతో ఫస్ట్ ఫోటోలు

'కర' సినిమా అద్భుతంగా ఉంటుందని, విఘ్నేశ్ రాజా పేరు ఇంకా ఎక్కువగా వినిపిస్తుందని, ఆయనొక గొప్ప దర్శకుడు అని పొగిడేశాడు ధనుష్. తమ కోసం వచ్చిన సాయి దుర్గ తేజ్, బుచ్చిబాబుకి ధనుష్ థాంక్స్ చెప్పారు. షూటింగ్ ఉన్నా కూడా ముగించుకుని తమ కోసం వచ్చిన బుచ్చిబాబుకి థాంక్స్ చెబుతూ.. పెద్ది కూడా మంచి విజయం సాధించాలని ధనుష్ కోరుకున్నారు.

See Photos: Ram Charan - 'పెద్ది' స్పెషల్ సాంగ్ షూటింగ్ నుంచి రామ్ చరణ్... శృతిని దాచేశారేంటి బుచ్చి?

'సార్', 'ఇడ్లీకొట్టు' తర్వాత మళ్లీ తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తున్నానని... 'కర' సినిమా కచ్చితంగా అందరినీ ఆకట్టుకుంటుందని, ఇదొక గొప్ప సినిమాగా నిలుస్తుందని ధనుష్ తెలిపారు. ఏప్రిల్ 30న తమ సినిమా రాబోతోందని, అందరూ తప్పకుండా థియేటర్లో చూసి సపోర్ట్ చేయాలని ధనుష్ కోరారు. ఇందులో 'ప్రేమలు', 'డ్యూడ్' ఫేమ్ మమితా బైజు హీరోయిన్.

Also Read: Peddi Release Date - 'పెద్ది' రిలీజ్ డేట్ లీక్ చేసిన బుచ్చిబాబు... జూన్‌లో రామ్ చరణ్ సినిమా ఎప్పుడు వస్తుందంటే?