Dhanush's Tere Ishq Mein Titled As Poetic In Telugu : కోలీవుడ్ స్టార్ ధనుష్ తెలుగులో ఇటీవల 'కుబేర' తర్వాత రీసెంట్‌గా తమిళంలో 'ఇడ్లీ కడై' మూవీతో మంచి సక్సెస్ అందుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా ఆయన మూవీస్ చేస్తూ ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేస్తుంటాడు. తమిళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ మూవీస్‌తో తనదైన యాక్టింగ్‌తో క్రేజ్ సంపాదించుకున్నాడు.

బాలీవుడ్ మూవీకి డిఫరెంట్ టైటిల్

ధనుష్ ఇప్పటికే బాలీవుడ్‌లో 'రంజనా' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ తెలుగులో రిలీజ్ కాలేదు. తాజాగా 'తేరే ఇష్క్ మే'తో మళ్లీ అలరించబోతుండగా... ఈ నెల 28న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు ఆడియన్స్‌లో ఆయనకు ఉన్న క్రేజ్ దృష్ట్యా మూవీని తెలుగులో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో 'అమర కావ్యం' అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారు.

ఈ చిత్రానికి ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తుండగా... ధనుష్ సరసన కృతి సనన్ హీరోయిన్‌గా నటించింది. లవ్ రొమాంటిక్ డ్రామాగా 'తేరే ఇష్క్ మే' రూపొందించగా... తెలుగులో ఆ ఎమోషనల్ జర్నీ కంటిన్యూ అయ్యేలా అద్భుతమైన ప్రేమ కావ్యం అనే అర్థంతో 'అమర కావ్యం' అంటూ టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. మూవీని భూషణ్ కుమార్, హిమాన్షు శర్మ, క్రిషన్ కుమార్‌లు కలిసి నిర్మించారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు. పాన్ ఇండియా లెవల్‌లో మూవీ రిలీజ్ కానుంది. ప్రస్తుతం ధనుష్ ఇళయరాజా బయోపిక్‌లో నటిస్తున్నాడు.

Also Read : ప్రభాస్ 'స్పిరిట్' సినిమాకు ఆ ఇద్దరూ అసిస్టెంట్ డైరెక్టర్లు... ఇది మాటలకు అందని మాస్ మూమెంట్!