<p>న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి వరుస షాకులు తగిలాయి. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓడిపోవడం పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. ఆప్ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం తన సొంత నియోజకవర్గంలో ఓటమి చెందారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి మరోసారి పోటీ చేసిన కేజ్రీవాల్ బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ చేతిలో ఓటమి చెందారు. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లుగా కేజ్రీవాల్ కనీసం ఎమ్మెల్యేగా నెగ్గపోవడం ఆప్ ను మరింత బాధిస్తోంది.</p>
<p> </p>