Delhi Election 2025 : ఢిల్లీలో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. మొన్నటిమొన్న సీఎం అతిషిని త్వరలోనే అరెస్ట్ చేస్తారన్న ట్వీట్ ద్వారా చెప్పిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. ఇప్పుడు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో తొలిసారిగా తన భారత కూటమి మిత్రపక్షమైన కాంగ్రెస్‌పై దాడి చేశారు 'మమ్మల్ని కాపాడండి.. మమ్మల్ని రక్షించండి' అని కాంగ్రెస్‌ ముందు వేడుకునేలా తయారైంది బీజేపీ పరిస్థితి.. ఎల్‌జీకి ఫిర్యాదు చేసే ధైర్యం బీజేపీకి లేకపోవడం వల్లే సందీప్ దీక్షిత్ తో చేయించింది. కాంగ్రెస్, బీజేపీ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని, ఢిల్లీ ప్రజలను ఎలా అడ్డుకుంటున్నారో మీరు చూస్తూనే ఉన్నారు అని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే మహిళా సమ్మాన్ యోజనను తీసుకువస్తామని కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా ప్రతి మహిళకు నెలనెలా రూ.2100 ఇస్తామని చెప్పారు. దీనిపై కేబినెట్ తీర్మానం చేశాస్తామన్నారు. 60 ఏళ్లు పైబడిన వృద్ధుల వైద్యానికి అయ్యే ఖర్చును ఢిల్లీ ప్రభుత్వమే భరిస్తుందని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. ఈ రెండు పథకాలు ప్రజలకు అనుకూలంగా ఉన్నాయని, ఈ పథకాలను నమోదు చేయడం ప్రారంభించిన వెంటనే, పొడవైన క్యూలు కనిపించాయని చెప్పారు. దీన్ని చూసి బీజేపీ భయపడుతోందని ఆరోపించారు. ఈ పథకాలకు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నిస్తోందన్నారు.

బీజేపై విరుచుకుపడ్డ కేజ్రీవాల్.. తాము ప్రకటించిన పథకాలను అడ్డుకునేందుకు బీజేపీ గూండాలను పంపిందని ఆరోపించారు. ఎన్నికల హామీలను ఎన్నికల తాయిలాలని తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ఆ పార్టీకి మహిళల పట్ల గానీ, వృద్ధుల పట్ల గానీ ఎలాంటి కనికరం లేదని చెప్పారు. ఢిల్లీలో బీజేపీకి మరోసారి ఓటమి తప్పదని తెలిసే ఇలా నైతిక విలువలు మర్చిపోయి వ్యవహరిస్తుందన్నారు.

సంక్షేమ పథకాలపై కంప్లైంట్

సంక్షేమ పథకాలపై కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ ఇచ్చిన కంప్లైంట్ పై కేజ్రీవాల్ స్పందించారు. ఇది బీజేపీతో కలిసి కాంగ్రెస్ ఆడుతున్న సరికొత్త అనుబంధ రాజకీయమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఎన్నికల హామీలో ఇచ్చినవే చేస్తున్నామని, అందులో తప్పేముందన్నారు. ఈ విషయంలో తాను జైలుకు వెళ్లడానికైనా సిద్ధమేనని కేజ్రీవాల్ చెప్పారు.

ఢిల్లీ సీఎం అతిషిని అరెస్ట్ చేసే అవకాశం

అంతకుముందు ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం అతిషి భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అతిషిని ఫేక్ కేసులో అరెస్ట్ చేయవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. అతిషి అరెస్ట్ కంటే ముందుకు కొందరు నేతల ఇళ్లలోనూ సోదాలు చేస్తారంటూ ఆరోపించారు. ఆప్ ప్రకటించిన మహిళా సమ్మన్ యోజన, సంజీవని యోజన పథకాలపై ప్రజల్లో ఆదరణ దక్కడంతో కొందరు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని మండిపడ్డారు.

Also Read : Customer Food Habits Of 2024 : ఒక్క ఆర్డర్ లోనే 250 పిజ్జాలు - సింగిల్ మీల్ ఆర్డర్ పై రూ.5 లక్షలు - స్విగ్గీ, జొమాటోలో 2024లో రికార్డ్ ఆర్డర్స్