Ideal Daily Intake of Tea : టీ లేకుండా రోజును ప్రారంభించడం కొందరికి అసంపూర్ణంగానే ఉంటుంది. ఉదయం నిద్ర లేచింది మొదలు టీ కావాలి అంటూ తలలు పట్టుకునేవారు లేకపోరు. కొందరు మార్నింగ్ లేదా ఈవెనింగ్ టీ తాగితే.. మరికొందరు రోజంతా కప్పుల, కప్పుల టీ తాగుతారు. అయితే మీ వయసుకు ఇది సరైనదో కాదో.. వయసుకు తగ్గట్లు ఎంత టీ తాగాలో ఎప్పుడైనా ఆలోచించారా? ఎక్కువ టీ తాగితే వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో.. ఏ వయసు వారు ఎంత మోతాదులో టీ తాగవచ్చో ఇప్పుడు చూసేద్దాం.

హెల్త్‌లైన్ అనే ఆరోగ్య సమాచార వెబ్‌సైట్ ప్రకారం.. టీలోని కెఫీన్, ఇతర సమ్మేళనాలు శక్తిని అందిస్తాయి. కానీ దీనిని అధికంగా తీసుకున్నప్పుడు అది హానికరంగా కూడా మారవచ్చు. కాబట్టి టీని తక్కువ మోతాదులో తీసుకోవడం.. లేదా వయసుకు తగ్గట్లు తీసుకోవాలి. లేదంటే టీకి ప్రత్యామ్నాయంగా ఇతర హెర్బల్ టీలు తీసుకోవాలని సూచించింది.

రోజులో ఎంత టీ తాగాలి..

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజులో ఎంత టీ తాగాలి అనేది.. వయస్సు, ఆరోగ్య పరిస్థితి, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా టీనేజర్లు, యువకులు రోజుకు 1 నుంచి 2 కప్పుల కంటే ఎక్కువ కెఫిన్ ఉన్న టీ తాగకూడదు. ఆరోగ్యంగా ఉన్న పెద్దలు 3 నుంచి 5 కప్పుల గ్రీన్ టీ తాగవచ్చు. మిల్క్ టీ మాత్రం తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఆరోగ్య ప్రయోజనాల కోసం ఈ పరిమాణం ఉత్తమమైనదని అనేక అధ్యయనాలు నిరూపించాయి.

ఎక్కువ టీ తాగితే..

ఎక్కువగా టీ తాగితే ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అధికంగా కెఫిన్ తీసుకోవడం వల్ల నిద్రలేమి, తలనొప్పి, కడుపు నొప్పి, ఆందోళన వంటి సమస్యలు పెరగవచ్చు. గర్భిణీ స్త్రీలు ముఖ్యంగా వారు తీసుకునే కెఫిన్ పరిమాణంపై శ్రద్ధ చూపించాలని చెప్తున్నారు. పరిశోధనల ప్రకారం.. గర్భధారణ సమయంలో అధిక కెఫిన్ ప్రమాదాన్ని పెంచుతుంది. రోజుకు 300 మిల్లీగ్రాముల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెప్తున్నారు.

గుర్తించుకోవాల్సిన విషయాలు..

టీ మోతాదే కాదు.. టీ తాగే సమయం కూడా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖాళీ కడుపుతో ఎక్కువగా టీ తాగడం వల్ల ఎసిడిటీ, జీర్ణ సమస్యలు వస్తాయి. భోజనం చేసిన వెంటనే టీ తాగడం వల్ల శరీరంలో ఐరన్ శోషణ తగ్గుతుంది. వైద్యుల ప్రకారం.. టీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కానీ దాని పరిమాణం, సమయం విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమని సూచిస్తున్నారు.

టీ బదులుగా బెటర్ ఆప్షన్..

మీరు టీ ఎక్కువ తాగే అలవాటు ఉన్నవారు అయితే మీ మిల్క్ టీని గ్రీన్ టీతో రిప్లేస్ చేయమని నిపుణులు సూచిస్తున్నారు. కేటెచిన్స్ అనే యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల.. ఇటీవలి కాలంలో గ్రీన్ టీ ఒక ఆరోగ్యకరమైన పానీయంగా ప్రజాదరణ పొందింది. ఈ సమ్మేళనాలు గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్, కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంతో సంబంధం కలిగి ఉన్నాయని పరిశోధనలు తేల్చాయి.

అధ్యయనాల ప్రకారం.. గ్రీన్ టీ జీవక్రియను పెంచి, కొవ్వును కరిగించడంలో కూడా సహాయపడవచ్చు. క్రమం తప్పకుండా గ్రీన్ టీ తాగే వ్యక్తులు బరువు నియంత్రణలో మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఇది వారి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెప్తున్నారు. కాబట్టి మీరు టీని గ్రీన్ టీ లేదా ఇతర హెర్బల్ టీలతో రిప్లేస్ చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.

ఇంట్రెస్టింగ్ హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.