Stay Fit with These Simple Yoga Poses : బిజీ, స్ట్రెస్ఫుల్ లైఫ్‌లో అందరికీ జిమ్‌కి వెళ్లడం, గంటల తరబడి వర్కౌట్ చేయడం సాధ్యం కాదు. గంటల కొద్దీ కూర్చుని చేసే పనులు, మొబైల్, ల్యాప్‌టాప్ వాడకం వల్ల శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. అలాగే ఆహారంతో వచ్చే ఆరోగ్య సమస్యలు శారీరకంగా, మానసికంగా కూడా కృంగదీస్తాయి. దీనివల్ల అలసట, ఎనర్జీ తగ్గడం కామన్ అయిపోయింది. అలాంటప్పుడు మీరు మీ డేలో కేవలం 10 నిమిషాలు యోగాకు కేటాయించండి అంటున్నారు యోగా నిపుణులు.

మీకున్న 24 గంటల్లో రోజుకు కేవలం 10 నిమిషాలు యోగాకు కేటాయిస్తే చాలట. పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేకుండా సింపుల్ ఆసనాలతో శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవడంతో పాటు.. మానసికంగా మంచి ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు. ఇంతకీ ఆ ఈజీ ఆసనాలు ఏంటి? వాటిని ఎలా వేయాలి? వాటి వల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.

మర్జ్యాసనం (Cat-Cow Pose)

ఈ పోజ్ చాలా సింపుల్. చేతులు, మోకాళ్లపై శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ.. వెన్నెముకను పైకి, కిందకి మెల్లగా కదిలించాలి. దీనిని రెగ్యులర్గా చేయడం వల్ల వెన్నునొప్పి తగ్గుతుంది. బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. ఎక్కువసేపు కూర్చునే వాళ్లకు బెస్ట్ పోజ్గా చెప్తారు.

తడాసనం (Mountain Pose)

ఇది నిలబడి చేసే పోజ్. ఇది చూడటానికి సింపుల్ అయినా చాలా పవర్‌ఫుల్ ఆసనం. దీనిని చేయడం వల్ల బాడీ బాలెన్స్ మెరుగవుతుంది. భంగిమ సెట్ అవుతుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తగ్గుతాయి.

ఉత్తనాసనం (Standing Forward Bend)

నిలబడి ముందుకు వంగే ఈ పోజ్ బాడీకి మంచి స్ట్రెచ్ ఇస్తుంది. దీనివల్ల వెన్నెముక రిలాక్స్ అవుతుంది. మెదడుకు రక్తప్రసరణ పెరిగి అలసట తగ్గుతుంది.

భుజంగాసనం (Cobra Pose)

పొట్ట మీద పడుకుని పై భాగాన్ని పైకి లేపే ఈ పోజ్ చాలా ఫేమస్. దీనివల్ల వెన్నెముక బలపడుతుంది. ఛెస్ట్ ఓపెన్ అవుతుంది. డైజెషన్‌కు కూడా మేలు చేస్తుంది.

వృక్షాసనం (Tree Pose)

ఒక కాలు మీద నిల్చొని శరీరాన్ని బ్యాలెన్స్ చేయడమే పోజ్. దీనిని రెగ్యులర్గా చేయడం వల్ల ఫోకస్ పెరుగుతుంది. బ్యాలెన్స్ మెరుగవుతుంది. కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఉదయాన్నే చేయడం వల్ల వర్క్పై ఫోకస్ చేయగలుగుతారు.

బాలాసనం (Childs Pose)

ఈ పోజ్ పూర్తిగా రిలాక్స్ అవ్వడం కోసం చేస్తారు. దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది. మైండ్ ప్రశాంతంగా మారుతుంది. బాడీకి రెస్ట్ ఇస్తుంది. లేజీగా ఉన్నప్పుడు కూడా ఈ పోజ్ ఈజీగా చేయగలుగుతారు.

అనులోమం, విలోమం

ఒక ముక్కు రంధ్రం ద్వారా శ్వాస తీసుకుని.. మరో నాసిక ద్వారా వదిలే టెక్నిక్ ఇది. దీనివల్ల మైండ్ ప్రశాంతంగా ఉంటుంది. స్ట్రెస్ తగ్గుతుంది. కాన్సంట్రేషన్ పెరుగుతుందని చెప్తారు.

ఫిట్గా ఉండాలి.. కానీ టైమ్ లేదు అనుకునేవారికి ఈ ఆసనాలు చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. ఉదయం లేవగానే ఓ పది నిమిషాలు దీనికి కేటాయించడం వల్ల మానసికంగా మెరుగవ్వడమే కాకుండా.. ప్రొడెక్టివ్గా మారవచ్చని చెప్తున్నారు. మార్పు అనేది ఒక్క రోజులో జరగకపోవచ్చు కానీ.. రెగ్యులర్గా చేయడం వల్ల డిఫరెన్స్ మీరే చూస్తారు.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.