Curd vs Buttermilk vs Lassi : పెరుగు, మజ్జిగ, లస్సీ మధ్య తేడాలు ఇవే.. ఎప్పుడు తాగాలి? ఎందుకు తాగాలి? ఎలా తీసుకుంటే మంచిది?

1 month ago 6
ARTICLE AD

Curd Buttermilk Lassi Benefits : వేసవిలో చాలామంది పెరుగు, మజ్జిగ, లస్సీని తమ డైట్లో చేర్చుకుంటారు. ఈ మూడు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ చాలామంది ఈ మూడింటినీ ఒకేలా భావిస్తారు. వాస్తవానికి ఇవి మూడూ వేర్వేరు డ్రింక్స్. వాటి తయారీ  తీరు నుంచి.. పోషక విలువలు, తాగే సమయం అన్నీ వేర్వేరుగా ఉంటాయి. మరి వేసవిలోకాలంలో వీటిని ఏ సమయంలో తీసుకుంటే మంచిదో.. ఎలా తీసుకుంటే శరీరం చల్లగా, ఆరోగ్యంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగు

పెరుగు అంటే పాలకు పులిసే పదార్థం కలిపి తయారు చేసే ఘన ఆహారం. ఇందులో మంచి బ్యాక్టీరియా అంటే ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. కాల్షియం, ప్రొటీన్, విటమిన్ B12 పుష్కలంగా ఉంటాయి. పెరుగన్నం తింటే శరీరం లోపలి నుంచి చల్లగా మారుతుంది.

ఎప్పుడు తింటే మంచిది?

పెరుగు మధ్యాహ్నం భోజనంతో తింటే చాలా మంచిది. అలాగే వేసవిలో రోజూ తినవచ్చు. రాత్రుళ్లు తినకపోవడమే మంచిది. ఎందుకంటే జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉంటుంది.

మజ్జిగ

మజ్జిగ అంటే పెరుగుకు నీరు కలిపి చిలికి చేసే డ్రింక్. ఇందులో కొవ్వు చాలా తక్కువగా ఉంటుంది. శరీరాన్ని వేగంగా చల్లబరుస్తుంది. జీర్ణశక్తి పెంచుతుంది. ఉప్పు, జీలకర్ర, అల్లం కలిపిన మజ్జిగ మరింత బెనిఫిట్స్ ఇస్తుంది.

మజ్జిగ ఎప్పుడు తాగాలి?

మజ్జిగ భోజనం చేసిన వెంటనే తాగవచ్చు. మధ్యాహ్నం తాగితే అలసట తగ్గుతుంది. బయటి నుంచి వచ్చిన వెంటనే తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. రోజుకు 2–3 గ్లాసులు తాగవచ్చు.

లస్సీ

చాలామంది మజ్జిగ, లస్సీ ఒకటే అనుకుంటారు. లస్సీ అంటే పెరుగుకు నీరు కలిపి చక్కెర లేదా ఉప్పు వేసి చిక్కగా చేసే డ్రింక్. ఇది మజ్జిగ కంటే మందంగా, పోషకాలతో నిండి ఉంటుంది. దీనిలో స్వీట్ లస్సీ, సాల్టెడ్ లస్సీ, మామిడికాయ లస్సీ వంటి రకాలు ఉంటాయి. ఇందులో కొవ్వు, కేలరీలు కొంచెం ఎక్కువగా ఉంటాయి.

లస్సీ తాగాల్సిన సమయం

ఉదయం బ్రేక్​ఫాస్ట్ తర్వాత తాగితే మంచిది. జిమ్ చేసిన తర్వాత ఎనర్జీ కోసం తాగవచ్చు. భోజనానికి ముందు తాగితే ఆకలి తగ్గుతుంది. రాత్రి తాగడం మంచిది కాదు. బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

పెరుగు vs మజ్జిగ vs లస్సీ

పెరుగు ఘనమైన ఆహారం.. కొవ్వు మోస్తరుగా ఉంటుంది. భోజనంతో తింటే మంచిది. మజ్జిగలో కొవ్వు తక్కువగా ఉంటుంది. భోజనం తర్వాత లేదా మధ్యాహ్నం తాగడం బెస్ట్. లస్సీలో కొంచెం ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఉదయం లేదా భోజనానికి ముందు తాగితే మంచిది.

వేసవిలో తీసుకుంటే వచ్చే లాభాలు

వేసవిలో పెరుగు, మజ్జిగ, లస్సీ తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. శరీర ఉష్ణోగ్రత తగ్గి.. జీర్ణశక్తి మెరుగవుతుంది. డీహైడ్రేషన్ తగ్గుతుంది. మంచి బ్యాక్టీరియా పెరిగి పొట్ట సమస్యలు తగ్గుతాయి. చర్మం తేమగా, ఆరోగ్యంగా ఉంటుంది. అలసట, నీరసం తగ్గుతాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

చల్లటి పెరుగు లేదా మజ్జిగ నేరుగా ఫ్రిజ్ నుంచి తీసి తాగడం మంచిది కాదు. రాత్రి పూట పెరుగు తినకూడదు. డయాబెటిస్ ఉన్నవారు స్వీట్ లస్సీ తాగకూడదు. ఆయుర్వేదం ప్రకారం మజ్జిగ వేసవిలో అన్నింటికంటే శ్రేష్ఠమైన పానీయం. కాబట్టి లిమిటెడ్గా తీసుకోవచ్చు.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

Read Entire Article