CSK Complains on DJ Song: ఐపీఎల్‌ 2026 సీజన్ ఉత్సాహంగా సాగుతున్న వేళ, మైదానం బయట కొత్త వివాదం చెలరేగింది. ఏప్రిలే 14న బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మద్య జరిగిన మ్యాచ్‌ కేవలం పరుగులకే పరిమితం కాలేదు. మైదానంలో వినిపించిన సంగీతం ఇప్పుడు బీసీసీఐ గడప తొక్కింది. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను కించపరిచేలా వ్యవహరించంపై సీఎస్‌కే యాజమాన్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఏం జరిగింది?

ఈ వివాదానికి ప్రధాన కారణం స్టేడియంలో ప్లే చేసిన ఒక వైరల్ పాట. దోసె, ఇడ్లీ , సాంబార్‌, చట్నీ, అనే పదాలు ఉండే పాటను డీజే ప్లే చేయడంపై సీఎస్‌కే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పాట సాధారణంగా సోషల్ మీడియాలో దక్షిణ భారత్‌లోని కొన్ని వర్గాల ప్రజల మూస పద్ధతులను ప్రతిబింబిస్తూ మీమ్స్‌లో వాడుతుంటారు. కేవలం పాట మాత్రమే కాకుండా సీఎస్‌కే ఆటగాళ్లు అవుటైనప్పుడు డీజే చేసిన వ్యాఖ్యలు కూడా అగౌరవంగా ఉన్నాయని జట్టు మేనేజ్మెంట్‌ భావిస్తోంది.

సాధారణంగా ఐపీఎల్‌ మ్యాచ‌లలో హోమ‌ టీమ్‌కు మద్దతుగా డీజేలు పాటలు పాడుతూ, కామెంట్స్ చేస్తూ లోకల్ బాయ్స్‌ను ఎంకరేజ్ చేస్తుంటారు. ఈ విషయంలో డీజే తన పరిధిని దాటి ప్రవర్తించారని సీఎస్‌కే మేనేజింగ్ డైరెక్ట్ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. " హోమ్ టీమ్‌కు మద్ధతుగా డీజేలు ఉండటం సాధారణమే, కానీ చిన్న స్వామి స్టేడియంలో పరిస్థితి భిన్నంగా ఉంది. మా ఆటగాళ్లపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిని దృష్టిలో ఉంచుకొని మేం బీసీసీఐకి లేఖ రాశాం" అని అన్నారు.

ప్రత్యర్థి జట్టును అవమానించడం లేదా వారి మనోధైర్యాన్ని దెబ్బతీయడం డీజే బాధ్య కాదని, ఇది క్రీడాస్ఫూర్తికి విరుద్ధమని సీఎస్‌కే అధికారరులు పేరొన్నారు. " వారు ప్రత్యర్థులను కించపరచడానికి అక్కడ లేరు" అని ఒక అధికారి తన ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలోనూ దోసె, ఇడ్లీ పాటపై వివాదం

ఈ దోసె, ఇడ్లీ పాట వివాదం గతంలో కూడా నెలకొంది. గత ఏడాది కూడా జితే్ శర్మ ఈ పాట పాడినప్పుడు సీఎస్‌కే అభిమానులు ఫైర్ అయ్యారు. గతేడాది ఆర్సీబీ స్వయంగా జితేష్ శర్మ ఈ పాట పాడుతున్న వీడియోను పోస్ట్ చేయడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కానీ ఈసారి ఒక అధికారిక మ్యాచ్‌ జరుగుతున్నప్పుడు స్టేడియం డీజే దీనిని వాడటం వివాదం మరింత తీవ్రమైంది.

Csk dj special song for Jitesh Sharma.#CSKvsRCB #MSDhoni #ViratKohli pic.twitter.com/1897QPgSHU

— INDIAN CRICKET FC (@monk258012) March 28, 2025

ఐపీఎల్ నుంచి స్పందన

సీఎస్‌కే చేసిన ఈ ఫిర్యాదుపై ఐపీెల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇప్పటికే దృష్టి పెట్టింది. " మేం సీఎస్‌కే నుంచి ఫిర్యాదు అందుకున్నాం. దానిని పరశీలిస్తున్నాం." అని ఒక ఉన్నత స్థాయి ఐపీఎల్ అధికారి అన్నారు.