Producer Dheeraj Mogilineni New Project With Couple Friendly Team : యంగ్ హీరోయిన్ సంతోష్ శోభన్, మానస వారణాసి జంటగా నటించిన లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ డ్రామా 'కపుల్ ఫ్రెండ్లీ'. వాలెంటైన్స్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. ఏకంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాసే ఈ మూవీని 'వర్షం' మూవీతో కంపేర్ చేయడం బిగ్ హైప్ క్రియేట్ అవుతోంది. ఈ క్రమంలో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని ఇంట్రెస్టింగ్ అనౌన్స్‌మెంట్ చేశారు.

'కపుల్ ఫ్రెండ్లీ' టీంతో మరో మూవీ

'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ టీంతో మూవీ చేయనున్ననట్లు ధీరజ్ వెల్లడించారు. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించబోయే ఈ కొత్త ప్రాజెక్టులో సంతోష్ శోభన్, మానస వారణాసి హీరో హీరోయిన్లని ప్రకటించారు. యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాణంలో తాను భాగస్వామి కానున్నట్లు చెప్పారు. సరిగ్గా వచ్చే ఏడాది ఫిబ్రవరి 14నే ఈ మూవీ కూడా రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

Also Read : ఆ ఓటీటీలోకి విశ్వక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'ఫంకీ' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అంటే?