Cockroach Janata Party: కాక్రోచ్‌ జనతా పార్టీ(CJP) ఎక్స్ ఖాతాను భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు బ్లాక్ చేసింది. ఆప్‌ మాజీ సోషల్ మీడియా వ్యూహకర్త అభిజీత్‌ దీప్కే తిహార్ జైలుకు వెళ్తానేమో అంటూ కామెంట్స్ చేశారు. రెండు రోజుల క్రితం సీజేఐ సూర్యకాంత్ చేసిన బొద్దింక వ్యాఖ్యలు ఈ భారీ ఆన్‌లైన్ ఉద్యమానికి దారి తీసింది.

ప్రస్తుతం డిజిటల్ యుగంలో చిన్న కామెంట్ కూడా ఎంతో ప్రభావం చూపుతుంటాయి. అలాంటిదే కాక్రోచ్ జనతా పార్టీ. మే 15న సుప్రీంకోర్టులో ఒక విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ చేసినట్టుగా ప్రచారంలోకి వచ్చిన కొన్ని వ్యాఖ్యలు ఈ ఉద్యమానికి కేంద్ర బిందువు. నకిలీ డిగ్రీలతో వృత్తిలోకి ప్రవేశించే వారిని, సోషల్ మీడియా, ఆర్టీఐ ద్వారా నిరసనలు తెలిపే నిరుద్యోగ యువతను ఆయన బొద్దింకలు, పరాన్న జీవులు అని సంబోధించినట్టు వార్తలు వచ్చాయి.

అయితే తర్వాత ఆ విషయంపై సీజేఐ వివరణ ఇస్తూ, తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా ఉటంకించిందని, తన విమర్శ కేవలం నకిలీ డిగ్రీలు కలిగిన ఉన్న వారిపైనే తప్ప నిరుద్యోగ యువతపై కాదని స్పష్టం చేశారు. అప్పటికే బొద్దింక వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. దీనిపై ఆగ్రహించిన యువత మేం బొద్దింకలమే ప్రశ్నించడానికి వెనుకాడబోమంటూ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. దీంతో ఇదో వినూత్నమైన డిజిటల్ ఉద్యమంగా మారిపోయింది.

సీజేపీకి అనూహ్య ఆదరణ

Cockroach janta party @CJP_2029 new account pic.twitter.com/SPBnIIrOe6

— @CJP_2029 (@CJP_2029f2) May 21, 2026

ఆమ్‌ ఆద్మీ పార్టీ మాజీ సోషల్ మీడియా వ్యూహకర్త అభిజీత్‌ దీప్కే మే 16న కాక్రోజ్ జనతా పార్టీని ఒక వ్యంగ్యాత్మక రాజకీయ వేదికగా ప్రారంభించారు. బద్ధకస్తుల, నిరుద్యోగుల, ఎప్పుడూ సరైన విషయాలపై మాట్లాడే వారి పార్టీ అని దీనికి ట్యాగ్‌లైన్ ఇచ్చారు. దీని ఆఫీస్‌ వైఫై ఎక్కడ ఉంటే అక్కడ అని పేర్కొన్నారు.

ఈ వేదిక అనూహ్యంగా ప్రజలను ఆకట్టుకుంది. గంటలు, రోజుల వ్యవధిలోనే ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ వెళ్లింది. 14.5 మిలియన్లుకు చేరిందీ దీని ఫాలోవర్స్ సంఖ్య. ఇది భారతీయ జనతాపార్టీ ఇన్‌స్టాగ్రామ్‌ ఫాలోవర్స్ కంటే ఎక్కువ సాధించింది. డిజిటల్ స్పేస్‌లో ఒక వ్యంగ్య ఖాతా ఇంతటి ప్రభావాన్ని చూపడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.

ఎక్స్‌ ఖాతాపై నిషేధం

మే 21న కాక్రోచ్‌ జనతా పార్టీ అధికారిక ఎక్స్ ఖాతాను భారత్‌లో నిలివేస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. భారత్ ప్రభుత్వం నుంచి వచ్చిన లీగల్ డిమాండ్ మేరకు ఈ చర్య తీసుకున్నట్టు ఎక్స్ పేర్కొంది.

As expected Cockroach Janta Party’s account has been withheld in India. pic.twitter.com/44ymllnSMJ

— Abhijeet Dipke (@abhijeet_dipke) May 21, 2026

దీనిపై స్పందించిన అభిజీత్ దీప్కే " మేం ఊహించినట్టుగానే ఖాతాను బ్లాక్ చేశారు." అని పేర్కొన్నారు. అయితే డిజిటల్ నిరసనలను అడ్డుకోవడం సాధ్యం కాదని నిరూపిస్తూ నిషేధం విధించిన రెండు గంటల వ్యవధిలోనే కాక్రోజ్‌ ఈ బ్యాక్ అనే పేరుతో కొత్త ఖాతా ప్రారంభమైంది. ఈ ఖాతాకి కూడా గంటల వ్యవధిలోనే ఫాలోవర్స్ పెరుగుతున్నారు.

అంశం

వివరాలు

పార్టీ పేరు

కాక్రోచ్ జనతా పార్టీ (CJP)

వ్యవస్థాపకుడు

అభిజీత్ దీప్కే

ఎక్స్ ఖాతా

బ్లాక్ అయ్యింది.

ఫాలోవర్స్‌

1.45 మిలియన్లు(నాలుగు రోజుల్లోనే )

కొత్త ఖాతా

కాక్రోచ్ ఈజ్ బ్యాక్

తిహార్ జైలుకు వెళ్లాల్సిందేనా?

ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్ యూనివర్శిటీలో విద్యను పూర్తి చేసుకున్న అభిజీత్‌ దీప్కే భారత్‌కు తిరిగి రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... "నేను ఢిల్లీ విమానాశ్రయంలో దిగగానే, ఢిల్లీ పోలీసులు నన్ను నేరుగా తిహార్ జైలుకు తీసుకెళ్తారని భావిస్తున్నాను" అని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో తమను బొద్దింకల లాగా చూస్తున్నారని అదే తమ గుర్తింపుగా మారిందని అన్నారు.

ట్రేడ్ మార్క్ యుద్ధం

ఈ పేరుకు ఉన్న ఆదరణ గమనించిన కొందరు వ్యక్తులు కాక్రోచ్ జనతా పార్టీ పేరును ట్రేడ్‌ మార్క్‌ కింద నమోదు చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. అజీమ్ ఆదమ్ భాయ్ జామ్ , అఖండ్ స్వరూప్ అనే ఇద్దరు వ్యక్తులు విడివిడిగా ట్రేడ్ మార్క్ అప్లికేషన్‌లు దాఖలు చేశారు.