Karachi Cocaine Queen Madam Pinky Arrest: పాకిస్థాన్ డ్రగ్ నెట్‌వర్క్‌లో అత్యంత శక్తివంతమైన మహిళగా పేరుగాంచిన అన్మోల్ అలియాస్ మేడమ్ పింకీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. కరాచీలోని సంపన్న వర్గాలకు, ముఖ్యంగా డిఫెన్స్ హౌసింగ్ అథారిటీ వంటి మిలిటరీ బ్యాక్డ్ ఏరియాల్లోని ఎలైట్ క్లయింట్లకు ఈమె కోకైన్ సరఫరా చేసేది. క్వీన్ మేడమ్ పింకీ — పేరు ఒక్కటి చాలు, ఎంజాయ్ చేయండి అనే స్లోగన్‌తో ఈమె బ్రాండెడ్ డ్రగ్స్ విక్రయించేదని విచారణలో తేలింది. అయితే, ఆమె అరెస్ట్ సమయంలో పోలీసులు ఆమెకు బేడీలు వేయకుండా, ఒక వీఐపీలా కోర్టు కారిడార్లలో నడిపించడం చూసి పాక్ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.

వైట్ వర్సెస్ గోల్డెన్ కోకైన్

పింకీ నెట్‌వర్క్ ఎంత పక్కాగా ఉంటుందంటే.. ఆమె దగ్గర రెండు రకాల కోకైన్ అందుబాటులో ఉండేది. గ్రాము రూ. 25,000 పలికే వైట్ కోక్ ఒకటైతే, అత్యంత నాణ్యమైన గోల్డెన్ కేటగి ' గ్రాము రూ. 40,000 కు విక్రయించేది. విచారణలో ఆమె పోలీసుల ముందే గొప్పలు చెప్పుకుంటూ.. పాకిస్థాన్‌లో నా కంటే నాణ్యమైన కోకైన్‌ను ఎవరూ తయారు చేయలేరు అని సవాల్ విసిరింది. ఆమె వద్ద నుంచి 1.5 కిలోల కోకైన్, 7 కిలోల తయారీ రసాయనాలతో పాటు ఆస్ట్రియా మేడ్ గ్లాక్ పిస్టల్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Anmol Pinky, Alias cocaine Queen Arrested by Karachi police and produced in court but like a Queen not a Culprit...Before this she threatened the Police officer on phone and challenged them to Arrest her if they can... pic.twitter.com/N6QyAZlU6U

— Shehla Fazil (@FazilShehl99253) May 14, 2026

సినిమాను మించిన ఫ్లాష్ బ్యాక్

పింకీ జీవితం ఒక పక్కా క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తుంది. 14 ఏళ్లకే ఇల్లు వదిలి మోడలింగ్ రంగంలోకి వెళ్లాలనుకున్న ఆమె, కరాచీ పార్టీ సర్కిల్స్‌లో పరిచయాలతో డ్రగ్స్ దందాలోకి దిగింది. అంతర్జాతీయ కోకైన్ స్మగ్లింగ్ ముఠాతో సంబంధాలున్న ఒక లాయర్‌ను ఆమె వివాహం చేసుకోవడం ఆమె కెరీర్‌లో టర్నింగ్ పాయింట్. 2019లోనే ఈమెపై కేసులు నమోదైనప్పటికీ, కొన్నాళ్లు అజ్ఞాతంలోకి వెళ్లి మళ్ళీ కరాచీ సామ్రాజ్యాన్ని శాసించడం మొదలుపెట్టింది. ఆమెకు ఉన్న రాజకీయ, అధికారిక పలుకుబడి వల్లే పోలీసులు కూడా ఆమెను అరెస్ట్ చేసేటప్పుడు ప్రోటోకాల్ పాటించారని విమర్శలు వస్తున్నాయి.

Lyari Female Lawyer Approaches City Court & demands death penalty for cocaine queen Pinky

Hang Cocaine Queen Pinky. She is ruining the new generation, says Advocate Sher Bano pic.twitter.com/UCwnx0ulyF

— P Connect (@ConnectingPak) May 15, 2026

సోషల్ మీడియాలో పేర్ల పంచాయితీ

ట్విట్టర్ లో పింకీ అరెస్ట్ పై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా డ్రగ్ డీలర్లకు ఎల్ చాపో , బ్లాక్ విడో వంటి భయంకరమైన పేర్లు ఉంటే.. మన దగ్గర పింకీ ఏంటి బ్రూ అని ఒకరు ఎద్దేవా చేయగా.. పింకీ అనేది గ్యాంగ్‌స్టర్ పేరులా లేదు, బబ్లీ అని పెట్టుకుంటే బాగుండేది అని మరొకరు సెటైర్ వేశారు. మరికొందరు మాత్రం బాలీవుడ్ వాళ్లు ఈ కథను ఎత్తుకెళ్లకముందే పాకిస్థాన్ సినిమా తీయాలి అని సూచిస్తున్నారు.

పోలీసులపై వేటు

పింకీకి వీఐపీ ట్రీట్‌మెంట్ ఇచ్చిన వీడియోలు వైరల్ కావడంతో సింధ్ హోంమంత్రి జియాఉల్ హసన్ సీరియస్ అయ్యారు. దర్యాప్తు అధికారి, గార్డెన్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ సహా ముగ్గురు అధికారులను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పింకీ మూడు రోజుల పోలీస్ రిమాండ్‌లో ఉంది. ఈ కోకైన్ క్వీన్ నోరు విప్పితే పాకిస్థాన్‌లోని ఇంకెంత మంది బడా బాబుల పేర్లు బయటకు వస్తాయోనని ఆ దేశ మీడియా ఆసక్తిగా గమనిస్తోంది.