CM Vijay Comments : ఒకే పవర్ సెంటర్ - సీఎంగా మీ విజయ్ మామ ఇస్తున్న హామీ... ఒక్క స్పీచ్‌తో విమర్శలకు చెక్
3 weeks ago 4
ARTICLE AD
Tamilnadu CM Vijay Speech Highlights : టీవీకే ప్రభుత్వంలో ఒకటే కేంద్రం ఉంటుందని చెప్పారు కొత్త సీఎం విజయ్. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. 'నా ప్రభుత్వంలో ఒక వైపు ఒక పవర్ సెంటర్, మరో వైపు ఇంకో పవర్ సెంటర్ అనే పరిస్థితి అసలు ఉండదు. నేను ఇప్పుడే స్పష్టంగా చెబుతున్నాను. ప్రజల డబ్బులో ఒక్క పైసా కూడా తాకను. తప్పు చేయను, తప్పు జరగనివ్వను. నా ప్రభుత్వంలో నా వెంట పని చేసే వారైనా సరే అలాంటి పనులు చేస్తే సహించను.
అధికార దుర్వినియోగం అనే ఆలోచన ఉంటే ఈ క్షణమే ఆ ఆలోచన తొలగించుకోవాలని చెబుతున్నా. మహిళలు, యువత, రైతులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కష్టపడే కార్మికులు, మత్స్యకారులు అందరూ మన టీవీకే ప్రభుత్వంలో సంతోషంగా, అభివృద్ధితో జీవిస్తారు.' అని తెలిపారు.
CM... కామన్ మ్యాన్
సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం తర్వాత గృహ వినియోగదారులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళల భద్రత కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్, అన్నీ నగరాలు, జిల్లాల్లో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు. 'జీవితంలో పేదరికం, ఆకలి బాగా తెలుసు. నేను మీలో ఒక్కడిని. మీ బిడ్డలా మీ కుమారుడిలా, మీ అన్నలా, మీ తమ్ముడిలా భావిస్తాను. మీరు కూడా నన్ను అలా భావించినందుకే సినిమా రంగంలో నాకు ఎంతో గొప్ప స్థానం ఇచ్చారు. పొటిటికల్ జర్నీలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా నా కోసం మీరు అండగా నిలబడ్డారు. అందుకే ఈ రోజు 'శ్రీ జోసెఫ్ విజయ్' అనే నిజాన్ని మీరు సాకారం చేశారు.' అని తెలిపారు.
Also Read : తమిళనాడు సీఎం విజయ్ - త్రిష కళ్లలో ఆనందం చూశారా... దళపతి ఫ్యామిలీతో సౌత్ క్వీన్
'తప్పుడు హామీలతో మోసం చేయను'
తాను తప్పుడు హామీలిచ్చి ప్రజలను మోసం చేయనని... సాధ్యమైన వాటినే చేస్తానని చెప్పారు విజయ్. 'అంటే అసాధ్యంగా కనిపించే పనులు చేయరా? లేక చేయలేరా?' అనే సందేహం మీకు కలగొచ్చు. కానీ కోట్లాది ప్రజలు నా వెంట ఉన్నప్పుడు, ఏ సమస్య వచ్చినా ఎదుర్కోగలం, ఏ పరిస్థితినైనా అధిగమించగలం అనే నమ్మకం నా మనసులో ఉంది. ప్రస్తుతం రూ.10 లక్షల కోట్ల భారం ఉంది. గత ప్రభుత్వం భారీ అప్పులు, మోయలేని భారాన్ని రాష్ట్రంపై వేసి వెళ్లింది.
క్లిష్ట పరిస్థితుల్లోనే మేము ఈ బాధ్యతను చేపట్టాం. పరిస్థితులన్నింటిని పరిశీలించిన తర్వాత ప్రజల కోసం ఒక వైట్ పేపర్ విడుదల చేస్తాం. ఈ ప్రభుత్వం పూర్తిగా పారదర్శకంగా ఉండాలని నా ఆశయం. ఏ విషయం అయినా ప్రజలకు స్పష్టంగా, బహిరంగంగానే చేస్తా. నేను చెప్పిన ప్రతి విషయాన్ని దశల వారీగా అమలు చేయడానికి ప్రయత్నిస్తా. ఇది మీ ప్రభుత్వం. మహిళల భద్రత విషయంలో చాలా కఠినంగా వ్యవహరిస్తా. అలాగే మాదకద్రవ్యాల సంస్కృతిని నియంత్రించడానికి అన్ని చర్యలు తీసుకుంటాను.' అని చెప్పారు.
Also Read : హ్యాపీయెస్ట్ బర్త్ డే మైడియర్ విజ్జూ - నా వాడి పుట్టినరోజు అంటూ రష్మిక క్యూట్ విషెష్
విజయ్... మామా..
మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, మీకు నా కృతజ్ఞత రుణం తీర్చుకునేందుకు మీ కోసం ఈ విజయ్ మామా అన్ని మంచి పనులు చేస్తాడు. టీవీకే సహచరులు నా  ప్రాణం వంటివారు. మీరు లేకపోతే ఏదీ ఉండేది కాదు. నా పార్టీ సహచరులకు, పార్టీ నిర్వాహకులకు, బూత్ ఏజెంట్లకు, నా ప్రియమైన వర్చువల్ వారియర్స్ అందరికీ కోట్ల కొద్దీ ధన్యవాదాలు. మనమంతా కలిసి ఒక కొత్త పాలన తీసుకువద్దాం. ఇదే ఒక కొత్త ఆరంభం.' అని అన్నారు.
Read Entire Article