CM Revanth Reddy: కేసీఆర్ కు మంచి రోజులు ఎలా వస్తాయని దేవనకొండలో సీఎం రేవంత్ ప్రశ్నించారు. ఏకగ్రీవమైన బీఆర్ఎస్ సర్పంచ్‌లతో కేసీఆర్ సమావేశమైనప్పుడు మంచి రోజులు వస్తాయని చెప్పారు. ఆ వీడియోలు వైరల్ అయ్యాయి. వాటిపై రేవంత్ దేవనకొండ సభలో స్పందించారు. మంచి రోజులు కావు కానీ మీకు మళ్ళీ అవకాశం వస్తే మునిగిపోయే రోజులు వస్తాయన్నారు. కేసీఆర్ పరిస్థితి దయనీయంగా ఉంది, ఆయన ఒకప్పుడు బాగానే జీవించారు. ఒకప్పుడు కేసీఆర్ గేటు వద్ద ఉన్న హోం గార్డులు, ఎంపీలు మహమూద్ అలీ, ఈటల రాజేందర్ వంటి వారిని పంపించివేసిన తర్వాత ఆయన జాతకం తిరగబడిందన్నారు.

రెండేళ్ల క్రితం ఓటునే ఆయుధంగా మార్చి ప‌దేళ్లు తెలంగాణ ను ప‌ట్టి పీడించిన నాయ‌కుల గ‌డీల‌ను ఓటు అనే ఆయుధంతో కుప్ప‌కూల్చి ఇందిర‌మ్మ రాజ్యం తెచ్చారు.. ప్ర‌జా పాల‌న‌తో సంక్షేమం, అభివ్రుద్ది ని రెండు క‌ళ్ల‌తో ముందుకు వెళ్తున్నామన్నారు. ప్ర‌జా ప్ర‌భుత్వంలో మూడు కోట్ల ప‌ది ల‌క్ష‌ల మంది తెలంగాణ ప్ర‌జ‌లు స‌న్న బియ్యంతో బువ్వ తింటున్నారు.. దేశంలో న‌రేంద్ర మోదీ పాలిత గుజ‌రాత్ తో స‌హా బీజేపీ పాలిత ఏ రాష్ట్రంలో కూడా స‌న్న బియ్యం ఇవ్వ‌డం లేదు.. తెలంగాణ‌లోనే స‌న్న బియ్యం ఇస్తు దేశానికి ఆద‌ర్శంగా నిల‌బ‌డ్డామన్నారు. తెలంగాణ వ‌స్తే డ‌బల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామ‌ని ఒకాయ‌న న‌మ్మ‌బ‌లికాడు.. డ‌బుల్ బెడ్రూం ఇచ్చిన ఊరిలో మీరు ఓటు అడ‌గాలి, ఇందిర‌మ్మ ఇళ్లు ఇచ్చిన ఊర్లో మేం ఓటు అడుగుతామ‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో స‌వాల్ విసిరామన్నారు.కానీ వారు ముందుకు రాలేదననారు.

2000 కోట్లు ఖ‌ర్చు పెట్టి ప‌దెక‌రాల లో 150 గ‌దుల గ‌డీని నిర్మించుకున్నాడు.. మేము ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో 3,500 చొప్పున 22 వేల కోట్ల‌తో రాష్ట్రం లో 4 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప‌దేళ్లు అధికారంలో ఉండి ఉంటే 20 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్లు నిర్మించే వాళ్లం.. చెంచులు,గిరిజ‌నుల ఉన్న ప్రాంతంలో అద‌నంగా 25 వేల ఇళ్లు ఇచ్చాం.. ఆదివాసీ,లంబాడీలు, గిరిజ‌నుల‌ది ఈ ప్ర‌భుత్వమన్నారు. కాంగ్రెస్ వ‌స్తే క‌రెంటు ఉండ‌దు.. రైతు బంధు రాద‌ని కేసీఆర్ అన్నాడు.. ఉచిత క‌రెంటు పేటెంట్ రైట్ కాంగ్రెస్ పార్టీదన్నారు.

ఇద్ద‌రు స‌ర్పంచ్ లు, న‌లుగురు వార్డు మెంబ‌ర్ల ను కూర్చోబెట్టుకుని కేసీఆర్ మాట్లాడుతున్నారు.. మంచి రోజులు వస్తాయ‌ని కేసీఆర్ చెప్తున్నాడు.. కేసీఆర్ కు అవ‌కాశం వ‌స్తే ముంచే రోజులు వ‌స్తాయన్నారు. కొడుకు, బిడ్డ‌, అల్లుడు తెలంగాణ ను నాలుగు వైపుల నుంచి పీక్కు తిన్నారు.. 8 ల‌క్ష‌ల కోట్ల అప్పు చేసినా కేసీఆర్ ఆశ తీర‌లేదా..అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ కు అధికారం పోయింది,పార్ల‌మెంటు లో గుండు సున్నా వ‌చ్చింది, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థులు దొర‌క‌లేదు.. జూబ్లీహిల్స్ లో రెఫ‌రెండం అంటే బోర‌బండ ద‌గ్గ‌ర బీఆర్ఎస్ ను బండ‌కేసి కొట్టారన్నారు. కేసీఆర్ ...నీ కొడుకే నీకు గుది బండ‌.. అని తీవ్రంగా కౌంటర్ ఇచ్చారు.

ఎస్ ఎల్ బీసీ లో ప్ర‌మాద‌వ‌శాత్తు 8 మంది చ‌నిపోతే మామ అల్లుళ్లు పైశాచిక ఆనందంతో డ్యాన్స్ లు చేశారు... కేసీఆర్ , ఆయ‌న అల్లుడు నాగార్జున‌ సాగ‌ర్ , శ్రీశైలం లో బండ క‌ట్టుకుని దూకినా ఎస్ ఎల్ బీసీ ని పూర్తి చేస్తామన్నారు. దేవ‌ర‌కొండ‌లో జైపాల్ రెడ్డి చ‌దువుకున్న పాఠ‌శాల‌కు 6 కోట్ల నిధులు ఇస్తామని..వెంక‌టేశ్వ‌ర‌స్వామి టెంపుల్ ను పూర్తి చేసే బాధ్య‌త తీసుకుంటానన్నారు. రాబోయే 10 యేళ్లు అధికారంలో ఉంటాం.. అభివృద్ధిపథంలో నడిపిస్తామన్నారు. గ్రామాల్లో స‌ర్పంచ్ ను మంచి వాళ్ల‌ను ఎన్నుకోవాలని సూచించారు.