Christmas Gifts : క్రిస్మస్ 2024 ఆఫీస్ సెలబ్రేషన్స్​.. సీక్రెట్ శాంటాలో భాగంగా ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ గిఫ్ట్​లను కొలిగ్స్​కి ఇచ్చేయండి

11 months ago 7
ARTICLE AD

Christmas Gifts for Colleagues : క్రిస్మస్​ సమయంలో ఆఫీసుల్లో సీక్రెట్ శాంటాను చేస్తూ ఉంటారు. ఈ ఆనవాయితీ యూనైటెడ్ స్టేట్స్​లో ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. ఈ ట్రెడీషన్​ని ఇండియాలో కూడా ఫాలో అయ్యేవారు ఉన్నారు. క్రిస్మస్ సమయంలో మీ ఆఫీస్​లో కూడా ఈ ట్రెండ్​ని ఫాలో అయితే మీరు కూడా మీ కొలిగ్స్​కి గిఫ్ట్​లు ఇవ్వాల్సి ఉంటుంది.

సీక్రెట్ శాంటా అంటే..

క్రిస్మస్ సెలబ్రేషన్స్ సీక్రెట్ శాంటాలో భాగంగా కొలిగ్స్ అందరూ గిఫ్ట్​లు కొని ఓ చోట పెడతారు. అలా పెట్టిన గిఫ్ట్​లను వేరొకరు తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల ఏ కొలిగ్​ ఎవరికి ఏ గిఫ్ట్ ఇచ్చారో తెలీదు. ఇలా సీక్రెట్​గా గిఫ్ట్​లను ఇచ్చే ప్రక్రియనే సీక్రెట్ శాంటాగా చెప్తారు. అయితే సీక్రెట్ శాంటాగా ఎలాంటి గిఫ్ట్​లు కొలిగ్స్​కి ఇవ్వాలో కొందరికి తెలీదు. మీరు కూడా అలాంటివారిలో ఒకరా? అయితే తక్కువ బడ్జెట్​లో వచ్చే, కొలిగ్స్​కి ఉపయోగపడే గిఫ్ట్​లు ఎలా ఎంచుకోవాలో? ఎలాంటి గిఫ్ట్​లు.. ఎంత ధరలో వచ్చే అవకాశముందో ఇప్పుడు తెలుసుకుందాం.

రూ.500 లోపు

మీ బడ్జెట్​ రూ. 500 అయితే.. కాఫీ మగ్ లేదా పెన్​ని గిఫ్ట్​గా ఇవ్వొచ్చు. ఇండియన్ స్వీట్స్, లేదా చాక్లెట్స్ కూడా బెస్ట్ ఆప్షన్. పైగా క్రిస్మస్ సమయంలో చాక్లెట్స్​కి మంచి డిమాండ్ ఉంటుంది. పేపర్​ వైయిట్స్ లేదా స్ట్రెస్ బాల్​ని కూడా గిఫ్ట్​గా ఇవ్వొచ్చు. యూనిక్ కీ చైన్స్​, ఇండోర్ మొక్కను కూడా ఈ బడ్జెట్​లో గిఫ్ట్ చేయవచ్చు.

రూ. 500 నుంచి రూ.1000లోపు

కస్టమైజ్ చేయించిన నోట్ బుక్​ లేదా జర్నల్​ని సీక్రెట్ శాంటాగా ఇవ్వొచ్చు. ఇది న్యూఇయర్​లో వారికి హెల్ప్ చేస్తుంది. లగ్జరీ క్యాండిల్స్ లేదా సెంటెడ్ ఆయిల్స్ ఇవ్వొచ్చు. ఇవి ఒత్తిడిని దూరం చేస్తాయి. పైగా మనసుకు హాయిని కూడా ఇస్తాయి. మీరు ఓకే అనుకుంటే వైన్​ బాటిల్​ని కూడా గిఫ్ట్ చేయవచ్చు. బుక్ లేదా నవలను ఇవ్వొచ్చు. పెన్ హోల్డర్, పేపర్ ట్రేను డెస్క్ యాక్ససరీల్లో భాగంగా ఇవ్వొచ్చు. అమ్మాయిలు ఉంటే మీరు శారీని లేదా అబ్బాయిలకు షర్ట్​ని మీరు గిఫ్ట్​గా ఇవ్వొచ్చు.

Also Read : మొదటి ప్రపంచ యుద్ధంలో క్రిస్మస్ బ్రేక్.. ఆడుతూ పాడుతూ సెలబ్రేట్ చేసుకున్న శత్రుసైన్యం

రూ. 1000 నుంచి రూ. 2000 లోపు

మీ దగ్గర బడ్జెట్ కాస్త బెటర్​గా ఉంటే టోట్ బ్యాగ్ లేదా కస్టమైజ్డ్ ఫోన్ కేస్ ఇవ్వొచ్చు. మూవీ టికెట్స్ లేదా డిన్నర్ వోచర్​ని ఇస్తే రిలాక్సింగ్​గా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ప్యాక్ లేదా టీ లేదా కాఫీ గిఫ్ట్​ బాస్కెట్ ఇవ్వొచ్చు. కస్టమైజ్ చేసిన పెయింటింగ్, ఫోటోను కూడా గిఫ్ట్​గా ఇవ్వొచ్చు.

మీ బడ్జెట్​ ఏది అయితే.. దానికి తగ్గట్లు ఈ గిఫ్ట్స్​ తీసుకోవచ్చు. పైగా ఇప్పుడు మనం చదువుకున్న గిఫ్ట్స్ అన్ని ఏదొకరకంగా మీ కొలిగ్స్​కి బాగా హెల్ప్ అవుతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఇప్పటినుంచే ఏమి గిఫ్ట్​ని, ఎంత బడ్జెట్​లో ఇవ్వాలో డిసైడ్ అయిపోండి.

Also Read : పిల్లలు మంచిగా ప్రవర్తించేలా తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలివే

Read Entire Article