Chittoor Pilla Song Lyrics: చిత్తూర్ పిల్ల సాంగ్ లిరిక్స్... 'సతీ లీలావతి'లో మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్లి పాట - అమ్మాయిలు పాడుకునేలా
1 month ago 6
ARTICLE AD
మెగా కోడలు లావణ్య త్రిపాఠి కొణిదెల ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'సతీ లీలావతి'. ఇందులో మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరో. పెళ్లి నేపథ్యంలో ఈ సినిమాలో ఓ పాట తెరకెక్కించారు. ప్రజెంట్ ఆ సాంగ్ వైరల్ అవుతోంది. 'చిత్తూర్ పిల్లా...' అంటూ సాగే ఆ పాటను వనమాలి రాశారు.
పెళ్లి పాట... ప్రతి పెళ్లిలో వినిపించేలా!
పెళ్లి మీద ప్రతి అమ్మాయికి బోలెడు ఆశలు ఉండటం సహజం. కాబోయే భర్త గురించి కలలు కనడం కూడా! పెళ్లి అంటే ఓ సందడి. జీవితంలో ఒక్కసారి వచ్చే పండుగ. అటువంటి పెళ్లి సంబరాన్ని తెరపై ఆవిష్కరించేలా 'చిత్తూర్ పిల్ల' సాంగ్ సాగింది. వనమాలి రాసిన ఈ పాటకు మిక్కీ జే మేయర్ మంచి బాణీ అందించారు. నూతన మోహన్, కృష్ణ తేజస్వి, రితేష్ జి రావు పాడారు. ఈ సాంగ్ లిరిక్స్ చూస్తే...
ఓ.. గంపెడంత ఆశపెట్టుకుంటే.. కొంపముంచిపోయేరో...
బాహుబలి లాంటి ఈ బావను బద్నాము చేసిందిరో...
గుండెలో టెంపులే కట్టి పూజలే చేశానురో
చిన్ననాటి ఈ దేవదాసుని చీ కొట్టి పోయిందిరో
ఆ... మెరికలాంటి కుర్రోడమ్మ
చురుకు చూపు చిన్నోడమ్మ
మనసులోంచి కాసేపైనా పోనే పోడమ్మా
వలపు చిచ్చు పెట్టాడమ్మా...
వరుడి వేషం కట్టాడమ్మా...
వాడి ఊసే రేయిపగలు... అయ్యో రామా...
సిద్దమైంది కళ్యాణమాల... సిగ్గులేమో తెల్లారికల్లా
సంబరాల సందేవేళ... గట్టిమేలమింక వాయించలేరా
ఓరి పిల్లా... రాయే పిల్లా... చిక్కావే చక్కని చిత్తూరు పిల్లా
మాయపిల్లా... తేనే జల్లా... నవ్వుతుంటే గుండెజల్లా
ఓరి పిల్లా... రాయే పిల్లా... చిందేసి ఆడేటి చిత్తూరు పిల్లా
వెల్లువయ్యే పెళ్లి కళ... ఇన్నినాళ్ల తీపి కలా తీరుతుందే
నేనింకా నమ్మేలా
మెరికలాంటి కుర్రోడమ్మ
చురుకు చూపు చిన్నోడమ్మ
వాడి వెంట సాగేదాక ఆగేనా... నా ప్రేమ...
చరణం 1
వాడ్ని ముద్దుతో రోజంతా మురిపించేస్తాలే...
చంటి పిల్లోడిలా కొంగుకే కట్టేసుకుంటాలే...
యెన్ని తప్పుల్ని చేస్తున్నా.. మన్నించేస్తాలే...
కంట నీరైన రాకుండా కాపాడుకుంటాలే...
ఇద్దరి మధ్య యుద్దాలు వస్తే.. నేనే సారీ చెబుతాలే
అందరి ముందు శ్రీవారి గొప్పలు చాటింపు వేస్తాలే
ఎంత ప్రేముందే వాడంటే పిల్ల... ఏడ దాచావే ఈ ఆశలల్లా
మాటలేలా... మాపటేలా... మూడు ముళ్లు గోల కానిస్తేపోలా
ఓరి పిల్లా... రాయే పిల్లా... చిక్కావే చక్కని చిత్తూరు పిల్లా
మాయపిల్లా... తేనేజల్లా... నవ్వుతుంటే గుండెజల్లా
ఓరి పిల్లా... రాయే పిల్లా... చిందేసి ఆడేటి చిత్తూరు పిల్లా
వెల్లువయ్యే పెళ్లి కళ... ఇన్నినాళ్ల తీపి కలా తీరుతుందే
నేనింకా నమ్మేలా
Also Read: Chiranjeevi - Venkatesh: చిరంజీవి కోసం వెంకటేష్ టైటిల్ త్యాగం... మూడు నేషనల్ అవార్డులు వచ్చిన ఆ సినిమా ఏదో తెలుసా?
చరణం 2
తోడులేని దారిలోన తొలిపరిచయమిదిగా
ప్రేమ కోరి జారుతున్న మనసిక నిలవదుగా
తడబడు అడుగులు మెల్లగా.. నడిచెను తన వెనుక
లో లోన మది వింటే... వింతే చూశాకా...
మురిసేనుగా... వలపులు మొదలవగా
పలికిన వేద మంత్రమే
కొసరెను ప్రేమ పరవశమే
కదలని హృదయము
కరిగిన సమయము...
త్వరపడమని తరిమెను తనకిక జతగా
లావణ్య త్రిపాఠి కొణిదెల, దేవ్ మోహన్ జంటగా నటించిన 'సతీ లీలావతి' సినిమాను ఆనంది ఆర్ట్ క్రియేషన్స్, దుర్గాదేవి పిక్చర్స్ సంస్థలపై నాగ మోహన్ నిర్మించారు. తాతినేని సత్య దర్శకత్వం వహించారు.
Read Entire Article