Chiranjeevi Received NTR National Award : మెగాస్టార్ చిరంజీవి ఖాతాలో మరో అరుదైన గౌరవం చేరింది. తెలంగాణ గద్దర్ అవార్డ్స్ 2026లో ఆయన ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. గురువారం మాదాపూర్ హైటెక్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా జరిగిన ఈవెంట్‌లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన పురస్కారాన్ని అందుకున్నారు.

ఏపీ ప్రభుత్వానికి రిక్వెస్ట్

ఈ సందర్భంగా మాట్లాడిన చిరంజీవి... విజేతలందరికీ అభినందనలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం కూడా కళాకారులకు అవార్డులు ఇస్తే ప్రోత్సాహకంగా ఉంటుందని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. 'తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. కళాకారులు ఉన్న చోటే సుభిక్షంగా ఉంటుందనేది నానుడి. ఈ అవార్డులు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు. ఏపీ ప్రభుత్వం కూడా ఇలా అవార్డులు ఇస్తే బాగుంటుంది.' అంటూ చెప్పారు.

Also Read : అమెజాన్ ప్రైమ్ వీడియో మెగా లైనప్ - 55కి పైగా కొత్త సిరీస్‌లు... మీర్జాపూర్ నుంచి గూఢచారి 2 వరకూ కంప్లీట్ లిస్ట్