Chiranjeevi Gives Pawan Kalyan Health Update: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసికోవాలని పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు సైతం ఎదురు చూస్తున్నారు. ఆయనకు సర్జరీ జరిగిందని తెలిసినప్పటి నుంచి ఏమైందని ఆందోళన చెందారు. పవన్ కళ్యాణ్ కోలుకోవాలని పలువురు ప్రముఖులు ఆకాంక్షిస్తూ ట్వీట్లు చేశారు. ఫోనులో ప్రధాని నరేంద్ర మోడీ పరామర్శించారు. పవన్ రికవరీ గురించి ఆయన భార్య అన్నా కొణిదెల అప్డేట్ ఇచ్చారు. తాజాగా చిరంజీవి సైతం ట్వీట్ చేశారు.

కళ్యాణ్ బాబు సేఫ్... చిరు మెగా హెల్త్ అప్డేట్!
''కళ్యాణ్ బాబు (Pawan Kalyan Helath Update By Chiranjeevi)కు విజయవంతంగా శస్త్ర చికిత్స జరిగింది. ప్రస్తుతం తమ్ముడు క్షేమంగా ఉన్నాడు. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. బాగా కోలుకుంటున్నాడు. వైద్యులు చెప్పిన వివరాల ప్రకారం... కళ్యాణ్ బాబు సాధారణ పరిస్థితికి తిరిగి రావడానికి సుమారు ఒక వారం పట్టవచ్చు. ప్రజలు, అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ అందరూ చూపించిన ప్రేమ, చేసిన ప్రార్థనలకు ధన్యవాదాలు. మనమందరం తమ్ముడిని మన ఆలోచనలలో ఉంచుకుని, ఆయనకు మనోధైర్యం, ఓదార్పు లభించాలని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిద్దాం'' అని చిరంజీవి ట్వీట్ చేశారు.

Also Read: Prakash Raj: రాముణ్ణి వెక్కరించలేదు... ఇది మతోన్మాద రాజకీయ నాయకులు ఏడుపు - ప్రకాష్ రాజ్ రియాక్షన్

Kalyan Babu has successfully undergone a medical procedure and is now safe, stable, and recovering well.

As per the doctors, it may take about a week for him to return to his normal routine. There is no cause for concern.

Thank you all for your love, concern, and prayers. Let…

— Chiranjeevi Konidela (@KChiruTweets) April 19, 2026

Wishing Hon’ble Deputy CM of Andhra Pradesh, @PawanKalyan Garu, a smooth and speedy recovery.

Looking forward to seeing you back in action, stronger than ever.

— Ram Charan (@AlwaysRamCharan) April 19, 2026

పవన్ కళ్యాణ్ శస్త్ర చికిత్సకు గల కారణాలను మెగా కుటుంబం గానీ, జనసేన పార్టీ గానీ బయట పెట్టలేదు. గోప్యంగా ఉంచారు. ఇప్పుడు చిరంజీవి చేసిన ట్వీట్ బట్టి పవన్ కళ్యాణ్ కోలుకోవడానికి వారం పడుతుంది. బాబాయ్ పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని అబ్బాయ్ రామ్ చరణ్ సైతం ట్వీట్ చేశారు.

Also Read: Peddi Special Song: మృణాల్ కాదు... మానస లేదు... సంయుక్తకు 'పెద్ది' స్పెషల్ సాంగ్ ఛాన్స్