Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode మనీషా, మిత్రల దగ్గరకు సరయు, రాజులు వస్తారు. రాజు సరయుతో పెళ్లి కాకుండానే మిత్ర, మనీషాలకు ఫస్ట్‌నైట్ అయిపోయిందని అంటాడు. దాంతో మిత్ర రాజుని కొట్టడానికి వెళ్తాడు. సరయు మనీషా వాళ్లో మిత్ర నిన్ను ప్రేమించి లక్ష్మీని ప్రేమించాడు కదా ఇంకా నువ్వు మిత్ర కోసం ఎదురు చూస్తున్నావ్ అంట అని కావాలనే మనీషాని అంటుంది.

మిత్ర: మీ సలహాలు మాకు అవసరం లేదు మీరు దయచేయండి. మంచేదో చెడు ఏదో మాకు తెలుసు.
సరయు: నీకు మంచి బాగా తెలుసు మిత్ర పెళ్లి రోజు పెట్టుకొని మనీషాతో ఫస్ట్‌నైట్ చేసుకున్నావ్. ఇప్పుడు మాకు తెలిసింది రేపు మీడియాకు తెలుస్తుంది. మమల్ని నోరు మూయించినట్లు మీడియా నోరు మూయిస్తావా. ఆ పరిస్థితి రాకుండానే పరిష్కారం చూసుకోండి.
మనీషా: మాకు ఏం చేయాలో తెలుసు మీరు మీ పని చేసుకోండి.

సరయు ప్రతీ ఏడాది మూడు జంటలకు పెళ్లి చేస్తుంటామని మీ చేతితో జంటలకు మంగళసూత్రాలు ఇవ్వమని మిత్రకు చెప్తుంది. పంతులు కూడా చెప్పడంతో మిత్ర ఇస్తాడు. ఇంకో తాళి మిగిలిపోవడంతో వీళ్లు కూడా జంట కావాల్సిన వాళ్లే ముందు తొలిరేయి అయిపోయింది కదా ఇప్పుడు పెళ్లి చేసుకోండని అంటారు. పెళ్లి చేసుకోకపోతే మనీషా సూసైడ్ చేసుకోవాలని రాజు అంటాడు. మనకు ఎందుకులే అన్నట్లు సరయు రాజుని తీసుకెళ్లిపోతుంది. దాంతో మనీషా దొంగ ఏడుపు ఏడుస్తూ మీడియాకు విషయం తెలియక ముందే నేను చావాలని పరుగులు తీస్తుంది. మిత్ర మనీషాని ఆపుతాడు. నేను బతికితే నా మెడలో తాళి ఉండాలి లేదంటే ఉరితాడు ఉండాలని అంటుంది. దాంతో మిత్ర ఆలోచనలో పడతాడు.

మరోవైపు పనామె మరోసారి లక్ష్మీకి కాల్ చేయిస్తుంది. ఈసారి లక్ష్మీ కాల్ లిఫ్ట్ చేస్తుంది. పనామె తనని తాను పరిచయం చేసుకొని మిత్రని పెళ్లి చేసుకోవాలని మనీషా ప్లాన్ చేసిందని చెప్తుంది. త్వరగా వచ్చి సార్‌ని కాపాడుకోమని చెప్తుంది. దాంతో లక్ష్మీ పరుగులు తీస్తుంది. నేను చనిపోతా అని మనీషా బెదిరిస్తుంది. విషం బాటిల్ తీసి తాగేస్తానని గోల చేస్తుంది. దాంతో మిత్ర పెళ్లి మనం పెళ్లి చేసుకుందామని మనీషాని అమ్మవారి ఎదురుగా తీసుకెళ్లి తాళి కట్టడానికి సిద్ధ పడతాడు. లక్ష్మీ గుడికి వెళ్లి పంతుల్ని ఏమైనా పెళ్లిలు జరిగాయా అంటే రెండు మూడు జరిగాయని పంతులు చెప్తాడు. దాంతో లక్ష్మీ మిత్ర మనీషాని పెళ్లి చేసుకున్నాడని కుప్పకూలిపోయి ఏడుస్తుంది.

మరోవైపు మిత్ర, మనీషాని తీసుకొని ఇంటికి వస్తాడు. మనీషా తన చిటికెను వేలిని మిత్ర చేతిలో వేసి నడిచి వెళ్తుంది. సీన్ చూస్తే ఇద్దరికీ పెళ్లి అయినట్లే ఉంటుంది. గుడి దగ్గర లక్ష్మీ తల బాదుకొని ఏడుస్తుంది. మిత్ర, మనీషాలు ఒకరి చేయి మరొకరు పట్టుకొని గుమ్మం ముందు నిల్చొవడం జయదేవ్, రాజేశ్వరిదేవి, జానులు చూసి షాక్ అయిపోతారు. దేవయాని వచ్చి పెళ్లి అయిపోయిందని అనుకొని కిందకి వచ్చి జానుకి లడ్డూలు తీసుకురమ్మని చెప్తుంది. వాటిని తీసుకెళ్లి అందరికీ ఇస్తుంది ఎవరూ తీసుకోకుండా వెళ్లిపోతారు. ఇక మనీషా వాళ్ల దగ్గరకు వచ్చి మనీషా మెడలో తాళి లేకపోవడం చూసి షాక్ అయిపోతుంది. మిత్ర మనీషా చేయి వదిలేసి గదిలోకి వెళ్లిపోతాడు.

దేవయాని మనీషాకి ఏమైందని అడుగుతాడు. ఇక గుడిలో పనామె లక్ష్మీ దగ్గరకు వెళ్తుంది. నేను ఆలస్యం చేశానని లక్ష్మీ ఏడుస్తుంది. ఇక దేవయాని మెడలో తాళి లేదేంటని అడుగుతుంది. ఇక పనామె కూడా లక్ష్మీతో పెళ్లి ఆగిపోయిందని చెప్తుంది. మనీషా దేవయానికి ఏం జరిగిందో చెప్తుంది. మిత్ర మనీషాకి తాళి కట్టడానికి సిద్ధపడతాడు. తాళి కట్టబోతే లక్ష్మీ పేరు మిత్రకు వినిపిస్తుంది. దాంతో ఒక్క సారి ఆగిపోతాడు. తన పెళ్లిని గుర్తు చేసుకుంటాడు. లక్ష్మీని తాతగారు మిత్రకు అప్పగించడం లక్ష్మీ బాధ పడటం అన్నీ గుర్తు చేసుకొని మనీషా మెడలో తాళి కట్టకుండా ఆగిపోతాడు. మనీషాతో ఇంటికెళ్దామని అంటాడు. లక్ష్మీ విషయం తెలుసుకొని నా పేరు వినగానే మిత్ర గారు ఆగిపోయారా అని చాలా సంతోషపడుతుంది. ఆమెని హగ్ చేసుకొని సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇక దేవయాని నాలుగు సార్లు నీ పెళ్లి ఆగిపోయిందని ఇక ఇప్పటికీ నువ్వు మిత్రని దక్కించుకోలేవని అంటే మనీషా దేవయాని గొంతు పట్టి నలిపేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read:  కార్తీకదీపం 2 సీరియల్: ఎన్ని నిజాలు దాస్తావు జ్యోత్స్న.. వారసురాలి గురించి తెలుసుకున్న దశరథ్!