Chinni Serial Today Episode: మ్యాడీ భర్త్‌డే పార్టీకి అతన్ని ప్రెండ్స్‌ అందరినీ తప్పకుండా రావాలంటూ నాగవల్లి పిలుస్తుంది. మధు నువ్వు మర్చిపోకుండా రావాలని చెబుతుంది. అలాగే నీతో కొంచెం విడిగా మాట్లాడాలని చెప్పగా సరే అని చెప్పి అందరినీ పంపించేస్తుంది మధు. ఇప్పుడు చెప్పండి ఆంటీ ఎందుకు నాతో విడిగా మాట్లాడాలని అంటున్నారని అడుగుతుంది. ఏం చెప్పమంటావ్‌... అర్థరాత్రి నువ్వు ఇచ్చిన భర్త్‌డే సెలబ్రేషన్స్‌ బాగున్నాయని చెప్పమంటావా.? లేక నేను వద్దు వద్దు అని చెబుతున్నా నువ్వు మ్యాడీ వెంట తిరగడం బాగుందని చెప్పమంటావా అని మండిపడుతుంది. లేక నువ్వు భర్త్‌డే పార్టీకి వస్తే నేను ఒక అద్భుతమై సర్‌ప్రైజ్‌ ఇవ్వబోతున్నానని చెప్పమంటావా అని అంటుంది. కానీ నువ్వు మాత్రం రేపు మ్యాడీ బర్త్‌డే పార్టీకి తప్పకుండా రావాలని అని చెప్పి వెళ్లిపోతుంది.

నాగవల్లి వెళ్లిన తర్వాత లోహితా అక్కడికి వస్తుంది. పిన్ని ఇచ్చే సర్‌ప్రైజ్‌ ఏంటోనని ఆలోచిస్తున్నావా...అది చూసి నువ్వు తట్టుకోలేవు అంటుంది. కాబట్టి నువ్వు రేవు పుట్టినరోజు వేడుకలకు రావొద్దని..వస్తే నాగవల్లి ఇచ్చే సర్‌ప్రైజ్ చూసి షాక్‌కు గురవుతావని హెచ్చరిస్తుంది. ఒకవేళ ఆమె ఇవ్వకున్నా అంతకన్నా పదిరెట్ల సర్‌ప్రైజ్ నేను నీకు ఇవ్వాల్సి వస్తుందని అంటుంది. దీనికి మధు దీటుగా సమాధానిస్తుంది. తప్పకుండా వస్తానని...మీరు నాకు ఇవ్వడంకాదని, నేనే మీకు పెద్ద సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నానని అంటుంది. దీనికి ఉడుకున్న లోహితా...నువ్వే చిన్నివి అన్న సంగతి మ్యాడీకి చెప్పేస్తానని కోపంగా అంటుంది. అప్పుడు నేను కూడా నువ్వు బిజినెస్‌ మ్యాగ్నిట్ కుమార్తెవు కాదు...చందు వాళ్ల చెల్లెలివి అని చెప్పగలను అని బెదిరిస్తుంది. నువ్వు ఎన్ని కుట్రలు చేస్తున్నా...నువ్వు నా మేనమామ కుమార్తెనని చెప్పడం లేదని అంటుంది. ఇప్పటికీ మించిపోయింది లేదని...నువ్వు ఎవరో వరణ్‌కు చెప్పేయమని హెచ్చరిస్తుంది. ఒళ్లు దగ్గర పెట్టుకుని అబద్ధాలు చెప్పడం మానేసి నిజాలు చెప్పాలని సూచించి వెళ్లిపోతుంది.

మధు మీద కోపంతో లోపలికి వెళ్లిపోయిన లోహి....శ్రీయను రెచ్చగొడుతుంది. నువ్వు ఫోన్‌లో కామెడీవీడియోలు చూస్తూ కూర్చుంటే నీ బతుకు కామెడీ అయిపోతుందని హెచ్చరిస్తుంది. రేపు మీ బావ బర్త్‌డే అయితే నువ్వు ఎలా ఉండాలి అని అంటుంది. అతనిలో ఎలా గడపాలని ఆలోచించాలి కదా అని నిలదీస్తుంది. ఆ మధు ఎంతో దూరం నుంచి మన ఇంటికి వచ్చి మీ బావ బర్త్‌డే సెలబ్రేషన్లు చేస్తుంటే...నువ్వు మాత్రం ఫోన్‌లో వీడియోలు చూస్తూ కూర్చున్నావ్ అని నిలదీస్తుంది. ఇప్పటికైనా నువ్వు కళ్లు తెరవకుంటే పరిస్థితి చేయిదాటిపోతుందని చెబుతుంది. నువ్వు మీ బావకు దగ్గర అవ్వాలంటే ఏం చేయాలో ఆలోచించమంటుంది. బర్త్‌డే సందర్భంగా ఏదైనా స్పెషల్ గిప్ట్‌ ఇవ్వాలని సూచిస్తుంది. మెల్లగా మీ బావ దృష్టి నీవైపు మళ్లించుకోమని చెబుతుంది. నువ్వు చెప్పినట్లే బావకు స్పెషన్ గిప్ట్‌ ఇచ్చి దగ్గరవుతానని చెబుతుంది.

గదిలో ఒంటరిగా కూర్చుని బాధపడుతున్న మ్యాడీ దగ్గరకు వచ్చి నాగవల్లి అతన్ని ఓదార్చుతున్నట్లు నటించి చిన్ని మీద, వాళ్ల అమ్మమీద లేనిపోని చాడీలు చెబుతుంది. దూరమైన మీ అమ్మ కలలు నిజం చేయాల్సిన బాధ్యత నీపై ఉందని చెబుతుంది. జరిగిపోయిన దాని గురించి కాకుండా...జరగాల్సిన దాని గురించి ఆలోచించమని చెబుతుంది. ఈ బర్త్‌డే నీకు లైఫ్‌లాంగ్ గుర్తిండిపోవాలని చెబుతుంది. చిన్నిని, వాళ్ల అమ్మను ఈరోజు నుంచి పూర్తిగా మర్చిపో అని పదేపదే మ్యాడీ మెదడులోకి ఎక్కిస్తుంది.

తెల్లారిన తర్వాత నాగవల్లి, భర్తతో కలిసి వచ్చి మ్యాడీకి మంచి గిప్ట్‌లు ఇచ్చి ఆశీర్వదిస్తారు. కిందికి వచ్చి నాగవల్లితో ఆమె భర్త అంటాడు...ఈరోజు చాలా మంచిరోజని..నా మేనకోడలిని కోడలిగా చేసుకోబోతున్న రోజు అని ఆమెకు చెబుతాడు. ఈరోజే వాళ్ల పెళ్లి అనౌన్స్‌ చేస్తానని అందరి ముందు చెబుతా అంటాడు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని...అందరికీ సర్‌ప్రైజ్ ఇద్దామని అంటాడు. ముఖ్యంగా ఆ మధుకు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియదంటాడు.

చందును అడ్డం పెట్టుకుని లోహికి గట్టి కౌంటర్ ఇవ్వాలని మధు అనుకుంటుంది. దారిలో ఉన్న చందు దగ్గరకు వెళ్తుంది. చందును ఆ బర్త్‌డే పార్టీకి ఎలా తీసుకెళ్లాలని ఆలోచిస్తుంది. అప్పుడే మ్యాడీ మధుకు ఫోన్ చేసి పార్టీకి వస్తున్నారా లేదా అని అడుగుతాడు. ఆల్రేడీ దగ్గరకు వచ్చేశామని....మధ్యలో శేఖరం మాస్టార్ కనిపిస్తే మాట్లాడాతున్నామని చెబుతుంది. దీంతో శేఖర్‌కు ఫోన్‌ ఇమ్మని చెప్పగా....అతను బర్త్‌డే పార్టీకి రమ్మని పిలుస్తాడు. దీంతో అందరూ కలిసి మ్యాడీ బర్త్‌డే పార్టీకి వెళ్తారు. మ్యాడీ వాళ్ల ఇంటికి వచ్చిన తన అన్నయ్యను చూసి లోహిత షాక్‌కు గురవుతుంది. అన్నయ్య నన్ను ఇక్కడ చూశాడంటే కొంపలు మునుగుతాయని మెల్లగా అక్కడి నుంచి జారుకోవడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.