Chinni Serial Today Episode నాగవల్లి కావాలనే కావేరి ఆత్మని రెచ్చగొట్టి లోహితతో ఫోన్‌లో రికార్డ్ చేయిస్తుంది. ఈ వీడియో మ్యాడీకి చూపిస్తే అటు దెయ్యం కథ.. ఇటు చిన్ని కథ రెండు ముగిసిపోతాయని అంటుంది. మరోవైపు మ్యాడీ ఆర్డర్ చేసిన కేసు చందుకి వెళ్తుంది. నేను చిన్న కేక్ ఆర్డర్ చేస్తే పెద్ద కేక్ వచ్చిందేంటి అని డెలివరీ బాయ్‌ని అడుగుతాడు. ఇంతలో సరళ వచ్చి కేక్‌ని విసిరేసి.. మన జీవితాలు సర్వనాశనం చేసిన వాళ్లకి పుట్టినరోజులు చేయొద్దు అని చెప్తే నీకు అర్థం కాదారా.. నీ సంపాదనతో ఇల్లు గడవడమే కష్టం అనుకుంటే ఈ వేస్ట్ ఖర్చులు అవసరమా అని చందుని తిడుతుంది.

చందు డెలివరీ బాయ్‌తో కేక్ మారిపోవడం ఏంటి అని అడిగితే సేమ్ టైంకి చిన్ని అనే పేరుతో మరో కేక్ ఆర్డర్ వచ్చింది అందుకే మారిపోయింది సార్.. అని అంటాడు. ఎవరు ఆర్డర్ చేశారో డిటైల్స్ చెప్పవా అని చందు అంటే కచ్చితంగా చెప్తానని డెలివరీ బాయ్ అంటాడు. నాగవల్లి, లోహిత మ్యాడీకి వీడియో చూపించాలని వెళ్తారు. నాగవల్లి మ్యాడీ దగ్గరకు వెళ్లి మన ఇంట్లో వింతలు జరుగుతున్నాయని చెప్పాం కదా.. ఈ వీడియో చూస్తే నీకే తెలుస్తుంది. దీని అంతటికి చిన్నినే కారణం అని చూడు అని వీడియో చూపిస్తారు. మ్యాడీ చూసే టైంకి కావేరి ఆత్మ ఎఫెక్ట్ వల్ల ఫోన్‌లో చిన్ని చేసిన రీల్స్ కనిపిస్తాయి. మ్యాడీ దెయ్యం చూశాడని నాగవల్లి అనుకొని ఇప్పుడేమంటావ్ నాన్న అని అడుగుతుంది. చిన్నిలో ఇంత టాలెంట్ ఉందని నాకు తెలీదు మమ్మీ.. చాలా బాగా చేసింది అని అంటాడు. నాగవల్లి, లోహిత చిన్ని రీల్స్ చూసి షాక్ అయిపోతారు. రీల్స్ చేయడం వల్ల విచిత్రాలు జరగటం ఏంటి మమ్మీ అని మ్యాడీ అంటే రీల్స్ కొత్తగా ఉన్నాయని ఆంటీ అలా అన్నారని లోహిత కవర్ చేస్తుంది. నాగవల్లి, లోహిత బయటకు వెళ్లి చూస్తే చిన్ని కరెక్ట్ గానే ఉంటుంది. మరి మ్యాడీ చూసే టైంకి ఎందుకు ప్లే అవ్వలేదు అని నాగవల్లి అంటే దెయ్యం ఎఫెక్ట్ అని లోహిత అంటుంది. ఇంతలో శ్రేయ అక్కడికి రావడంతో లోహిత, నాగవల్లి అరుస్తారు.

చిన్ని పుట్టిన రోజు కోసం మ్యాడీ, వరుణ్ ఇళ్లంతా చక్కగా అలంకరిస్తారు. ఇంతలో కేక్ ఆర్డర్ వస్తుంది. ఇంత చిన్న కేక్ ఏంటి.. నేను పెద్ద కేక్ ఆర్డర్ చేశాను కదా అని మ్యాడీ అంటాడు. వేరే వాళ్ల కేక్ మనకి వచ్చినట్లు ఉందని వరుణ్ చెప్పి కేక్ మీద పేరు చూస్తే చిన్ని అని అంటుంది. వరుణ్, మ్యాడీ ఇద్దరూ షాక్ అయిపోతారు. ఓనర్‌కి కాల్ చేసి విషయం అడిగి తెలుసుకుంటా అని డెలివరీ బాయ్ వెళ్లిపోతాడు. నాగవల్లి, దేవా వచ్చి ఏంటి నాన్న మనకి అంత ద్రోహం చేసిన కావేరి కూతురికి నువ్వు భర్త్‌డే చేయడం ఏంటి అని అడుగుతారు. నేను ఈ పుట్టినరోజు చేస్తుంది కావేరి కూతురికో.. నా భార్య చిన్నికో కాదు.. నా ఫ్రెండ్ చిన్నికి.. నిజనిజాలు తేలే వరకు కావేరిని హంతకురాలిగా చూడను.. అప్పటివరకు చిన్ని ఈ ఇంట్లో నా ఫ్రెండ్‌గా ఉంటుంది.. ఫ్రెండ్ కోసం ఈ మాత్రం చేయకపోతే నా తప్పు అవుతుందని అమ్మని చంపింది ఎవరో తెలిస్తే ఆ వ్యక్తిని శిక్షించి తీరుతా అని అంటాడు.

చిన్నిని ఇంట్లో చూస్తూ భరించలేమని దాన్ని ఎలా అయినా చంపేయాలని దేవా అనడంతో ఏం చేస్తాం అని నాగవల్లి అంటుంది. ఇంతలో దేవా విషం బాటిల్ తీసి దీంతో ఈరోజే చంపేద్దాం అని అంటాడు. వెంటనే నాగవల్లి కేక్ మీద విషం వేస్తుంది. శ్రేయ చూసి పుట్టినరోజు నాడే చిన్ని చచ్చిపోతుందని సంతోషపడుతుంది. ఇక చిన్ని భర్త్‌డే కోసం రెడీ అయి మ్యాడీ ఫ్రెండ్‌ని కలవడానికి అని వెళ్లాడు ఇంకా రాలేదు ఏంటా అని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో మ్యాడీ వచ్చి చిన్నికి కిందకి రమ్మని అంటాడు. చిన్ని కళ్లు మూసి కిందకి తీసుకెళ్లాడు. చిన్ని చాలా చాలా హ్యాపీగా ఫీలవుతుంది. థ్యాంక్యూ మ్యాడీ నువ్వు నా భర్త్‌డే ఇలా చేస్తావని అనుకోలేదు అని అంటుంది. నా ఫ్రెండ్ కోసం ఈ మాత్రం చేయకుండా ఎలా ఉంటాను చిన్ని అని మ్యాడీ అంటాడు. తర్వాత చిన్నితో కేక్ కట్ చేయించి చిన్నికి తిపించగానే చిన్ని నోట్లో నుంచి రక్తం వచ్చి కింద పడిపోవడంతో చిన్ని అని మ్యాడీ అరుస్తాడు. తీరా చూస్తే దేవా ఇంకో నిమిషంలో జరగబోయేది ఇదే అని ఊహించుకుంటాడు. చిన్నికి మ్యాడీ కేక్ తినించే టైంకి లోహిత లోకి కావేరి ఆత్మ వచ్చి మ్యాడీ చేతిలో ఉన్న కేక్‌ ముక్కని విసిరేస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.