Chinmayi Sripada: కమల్, రజనీపై చిన్మయి విమర్శలు... లైంగిక వేధింపులు చేసిన వ్యక్తిని ప్రశంసిస్తారా?
1 month ago 5
ARTICLE AD
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth), లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan)... తమిళ చలన చిత్రసీమలో ఇద్దరూ ఇద్దరే. లెజెండరీ నటులు, అగ్ర కథానాయకులు. వాళ్ళిద్దరినీ విమర్శించే సాహసం ఎవరూ చేయరు. కానీ, సింగర్ చిన్మయి శ్రీపాద 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా కమల్, రజనీపై వ్యంగ్యంగా కామెంట్లు చేశారు. ఎందుకో తెలుసా?
వైరముత్తుకు జ్ఞానపీఠ్ అవార్డు
ప్రముఖ తమిళ రచయిత, సాహితీవేత్త వైరముత్తు (Vairamuthu Jnanpith)ను సాహితీ పురస్కారాల్లో అత్యున్నతమైన జ్ఞానపీఠ్ వరించింది. ఆయనకు పలు రాష్ట్రీయ, జాతీయ పురస్కారాలు వచ్చాయి. అయితే సాహితీ రంగంలో అత్యున్నత పురస్కారం రావడంతో తమిళనాట పలువురు ఆయనకు శుభాకంక్షాలు చెబుతున్నారు.
వైరముత్తుకు శుభాకాంక్షలు చెప్పిన తమిళ ప్రముఖుల్లో రజనీ, కమల్ ఉన్నారు. అది చిన్మయికి కోపం తెప్పించింది. వైరముత్తు తనను లైంగికంగా వేధించారని గతంలో ఆవిడ తెలిపారు. చిన్మయితో పాటు మరికొందరు మహిళలు సైతం విమర్శలు చేశారు. ఆ వివాదం ఇంకా కొనసాగుతోంది. సోషల్ మీడియా వేదికగా వైరముత్తుపై తన పోరాటం కొనసాగిస్తున్నారు చిన్మయి. వైరముత్తుకు మద్దతుగా నిలిచిన వ్యక్తులకు చురకలు అంటిస్తున్నారు. అందులో భాగంగా రజనీ, కమల్ మీద విరుచుకుపడ్డారు.
మహిళలకు మగవాళ్ల మద్దతు ఉండదు!
మగవాళ్ళు ఎప్పటికీ తమ వైపు నిలబడరని మహిళలు గుర్తు ఉంచుకోవాలని ఎక్స్ వేదికగా చిన్మయి శ్రీపాద పేర్కొన్నారు. సినిమా రంగంలో శక్తివంతమైన వ్యక్తులు రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత చెవిటి వాళ్ళుగా మారిపోయారని విమర్శలు చేశారు. తన మామ - గురువు వేధించారని, తమ పార్టీలో మహిళలు సైతం సదరు పోయెట్ మీద విమర్శలు చేసినా కమల్ పట్టించుకోవడం లేదని చిన్మయి ఎద్దేవా చేశారు. మగవాళ్ళు ఎప్పటికీ మగవాళ్లకు మద్దతు ఇస్తారని ఆవిడ పేర్కొన్నారు.
Also Read: Trisha: ఎయిర్ పోర్టులో త్రిష... మీడియా ప్రశ్నల వర్షం - సౌత్ క్వీన్ ఏం చెప్పారంటే?
P.S.: Men in such power in cinema transitioning to politics completely turning a deaf ear to women who come on record to say they were molested by “his uncle-mentor” must remind women who vote - that men will never be on our side.
The weirdest thing -… https://t.co/KB7VNAevu5
— Chinmayi Sripaada (@Chinmayi) March 14, 2026
వైరముత్తుకు రజనీకాంత్ శుభాకాంక్షలు చెప్పగా... 'అయ్యయ్యో' అంటూ వ్యంగ్యంగా స్పందించారు చిన్మయి. ఆవిడ వ్యవహారశైలి మీద ఎప్పటిలా సోషల్ మీడియాలో కొంత మంది విరుచుకుపడుతున్నారు.
Ayyyyyyoooo!!!
Puriyave puriyaadha??! https://t.co/d3c34dV49Y
— Chinmayi Sripaada (@Chinmayi) March 14, 2026
Read Entire Article