Childhood Obesity : పిల్లలు లావుగా అవ్వకుండా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.. లేకుంటే ఊబకాయం తప్పదు
2 months ago 3
ARTICLE AD
Prevent Obesity in Children : ఈ మధ్యకాలంలో పిల్లలు ఎదుర్కొంటోన్న అతి ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఊబకాయం ఒకటి. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య సంక్షోభాలలో ఇది ఒకటని చెప్తున్నారు నిపుణులు. పిల్లల నుంచి పెద్దలవరకు దీని బారిన పడుతున్నారు. ముఖ్యంగా బాల్యం నుంచే ఈ సమస్యను ఎదుర్కొనేవాళ్లు ఎక్కువైపోయారు. జంక్ ఫుడ్, షుగర్ డ్రింక్స్, స్క్రీన్ టైమ్ వంటివి లైఫ్​స్టైల్​పై ప్రభావం చూపిస్తున్నారు. పిల్లల్లో పెరిగిపోతున్న అనారోగ్యకరమైన అలవాట్లే బాల్యంలో వస్తోన్న ఊబకాయానికి కారణం అంటున్నారు డాక్టర్ స్మృతి పహ్వా.
పిల్లల్లో అనారోగ్యకరమైన అలవాట్లను సకాలంలో గుర్తించి.. జాగ్రత్తలు తీసుకోకపోతే అవి (Health Risks of Childhood Obesity) ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. స్కూల్​కి వెళ్లే పిల్లలకు ఆరోగ్యకరమైన జీవనశైలిని ఇవ్వడం చాలా అవసరమని చెప్తున్నారు. దీనిలో భాగంగా పిల్లల లైఫ్​స్టైల్​లో చేయాల్సిన అతి పెద్ద మార్పులను (Healthy Lifestyle Tips for Kids) ఆమె సూచించారు. అవేంటో.. వాటివల్ల పిల్లల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుందో.. ఊబకాయాన్ని ఎలా దూరం చేస్తాయో ఇప్పుడు చూసేద్దాం.
ఆహారంలో కచ్చితంగా చేయాల్సిన మార్పులు
మెరుగైన, పోషకాలతో (Nutrition Tips for Kids Health) నిండిన ఆహారాన్ని పిల్లలకు అందించడం చాలా మంచిది. ఆన్​లైన్​లో దొరికే అధిక కేలరీల ఫుడ్స్​ని వీలైనంత వరకు దూరంగా ఉంచాలి. జంక్​ఫుడ్​(Junk Food Effects on Children)ని పూర్తిగా పరిమితం చేయాలి. ఇది కేవలం పేరెంట్స్ మాత్రమే కాదు. స్కూళ్లో జంక్ ఫుడ్ తినడం వల్ల వచ్చే నష్టాలు.. ఆరోగ్య సమస్యలు వంటివి ప్రాక్టికల్​గా వారికి చూపిస్తూ అవగాహన కల్పించాలి. తాజా పండ్లు, కూరగాయలను రోజూ తినాలని.. వాటివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వారికి వివరించాలి. ఫుడ్ విషయంలో ఎడ్యూకేషన్ అనేది కేవలం తల్లిదండ్రుల నుంచే కాదు.. గురువుల వద్ద నుంచి వచ్చినప్పుడే మంచి ఫలితాలు చూడగలుగుతారు. దీనివల్ల ఇంటికి దూరంగా ఉన్నా సరే.. ఎలాంటి హెల్తీ ఫుడ్ తీసుకోవాలనేదానిపై పిల్లలకు అవగాహన ఏర్పడుతుంది.
శారీరక శ్రమను పెంచడం
స్కూలింగ్ చేసే పిల్లలకు ప్రతిరోజూ శారీరక శ్రమ (Physical Activity for School Children) ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఎక్కువసేపు స్కూల్లో కూర్చొని.. తర్వాత ట్యూషన్స్, నైట్ స్క్రీన్ లేదా పడుకోవడం వంటివి చేయడం వల్ల వారికి శారీరక శ్రమ పెద్దగా ఉండదు. ఇది వారి ఆరోగ్యంపై నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది. కాబట్టి పిల్లలకు రోజుకు 30 నిమిషాల శారీరక శ్రమ ఉండేలా చూసుకోవాలి. దీనికోసం ఉదయం, సాయంత్రం స్కూల్ తర్వాత అయినా పిల్లలతో ఆడించాలి. అలాగే స్కూళ్లో కచ్చితంగా స్పోర్ట్స్ పీరియడ్ ఉండేలా చూసుకోవాలి. స్పోర్ట్స్ పేరు చెప్పి సిలబస్ కంప్లీట్ చేయడం వంటి ఫార్మాలటీలు లేకుండా చూసుకోవాలి. శారీరక విద్య కచ్చితంగా అమల్లో ఉండాలి. దీనివల్ల పిల్లలు యాక్టివ్​గా ఉంటారు. ఎక్కువసేపు కూర్చోన్నా వారిలో మెటబాలీజం పెరుగుతూ ఉంటుంది. స్కూల్ లేనప్పుడు అవుట్​డోర్ గేమ్స్ ఆడించడం, యోగా, డ్యాన్స్ వంటివి చేయించవచ్చు. ఇవి పిల్లల్లో హెల్తీ లైఫ్​స్టైల్​కి కారణం అవుతుంది.
ఒత్తిడి లేకుండా..
పిల్లల్లో ఊబకాయాన్ని దూరం చేయాలంటే వారిపై ఒత్తిడి (Stress-Free Parenting Tips) లేకుండా చూసుకోవాలి. ఏ కారణం వల్ల అయినా వారు స్ట్రెస్​కి గురి అవుతున్నారు అనిపిస్తే.. వెంటనే వారిని అడిగి సమస్యను తెలుసుకోవాలి. పిల్లలపై చదువు అంటూ పేరెంట్స్, టీచర్స్ ఒత్తిడి చేయకూడదు. చదువు నేర్చుకునేలా సింపుల్ టెక్నిక్స్, ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పిల్లలకు అందించాలి. పిల్లలకు ఒత్తిడిలేని లైఫ్​స్టైల్ అందించగలిగితే వారు అన్నింటిలోనూ రాణించగలుగుతారు.
పిల్లలకు ఇలా ఇంటి నుంచే కాకుండా.. స్కూల్ నుంచి కూడా సహాయం అందితే.. ప్రారంభ దశలోనే వారిలో హెల్తీ లైఫ్​స్టైల్ అభివృద్ధి చెందుతుంది. ఇవి తర్వాతి కాలంలో కూడా హెల్ప్ అవుతాయి. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా హెల్ప్ అవుతుంది. ఆరోగ్యకరమైన భవిష్యత్తు తరాలను చూడగలుగుతాము.
Read Entire Article