Tips to Child to Grow Taller : ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులకు పిల్లల ఎత్తుపై ఆందోళన ఉంటుంది. మా పిల్ల/పిల్లాడు ఎందుకు పొడవు పెరగడం లేదనే డౌట్తో ఉంటారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన ప్రధానమైన విషయాలు కొన్ని ఉన్నాయి. పిల్లల ఎదుగుదల అనేది కేవలం జన్యు లక్షణాలపై మాత్రమే ఆధారపడదు. ఆహారం, నిద్ర, జీవనశైలి కూడా కీలక పాత్ర పోషిస్తాయని గుర్తించాలి.

పిల్లలకు హెల్తీ ఫుడ్ పెట్టడమే కాదు.. అన్ని పోషకాలు సరిగ్గా అందుతున్నాయో లేదో చెక్ చేసుకోవాలి. కానీ పిల్లల ఎత్తు పెరగడాన్ని అడ్డుకునే 3 సాధారణ తప్పులు ఉన్నాయి. వీటిని సెట్ చేస్తే పిలల్ల పెరుగుదల్లో మంచి ఫలితాలు చూస్తారు. తెలియకుండా చేసే తప్పులు ఎత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతాయో.. వాటిని ఎలా సరిచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రోటీన్ లోపం..

చాలా మంది తల్లిదండ్రులు పిల్లలు ఎక్కువగా తింటారని అన్నం, రోటీ, స్నాక్స్, జంక్ ఫుడ్ వంటివి ఇస్తారు. కానీ శరీర ఎదుగుదలకు ఇవి సరిపోవు. వీటిలో ప్రోటీన్ తక్కువ ఉంటుంది. పిల్లల ఎత్తు పెరుగుదలకు ప్రోటీన్ చాలా ముఖ్యమైన పోషకంగా చెప్తారు.

ప్రోటీన్ తక్కువగా తీసుకుంటే..

పిల్లలకు ప్రోటీన్ తక్కువగా ఇస్తే.. వారి ఎముకలు, కండరాలు సరిగా అభివృద్ధి చెందవు. గ్రోత్ హార్మోన్ పనితీరు తగ్గుతుంది. పదేళ్లలోపు పిల్లలకు రోజుకు సుమారు 35–45 గ్రాముల ప్రోటీన్ ఇవ్వాలి.

ప్రోటీన్కు బెస్ట్ సోర్స్..

పిల్లలకు ప్రోటీన్ ఇవ్వాలంటే.. కొన్ని బెస్ట్ ఫుడ్స్ ఉన్నాయి. పప్పులు, మొలకలు, చికెన్ లేదా చేపలు, పాలు, పెరుగు, పనీర్, పల్లీలు వంటి హెల్తీగా, టేస్టీ ప్రోటీన్ సోర్స్. వీటిని పిల్లల డైట్లో ఏదొక రకంగా ఇచ్చేలా ప్లాన్ చేసుకుంటే.. పిల్లల ఎదుగుదల సహజంగా మెరుగుపడుతుంది.

నిద్ర లేకపోవడం

పిల్లల ఎదుగుదలలో “గ్రోత్ హార్మోన్” చాలా ముఖ్యమైనది. ఇది ప్రధానంగా రాత్రి గాఢ నిద్రలో విడుదల అవుతుంది. కానీ చాలామంది పిల్లలు రాత్రుళ్లు ఆలస్యంగా పడుకుంటారు. మొబైల్/టీవీ ఎక్కువగా చూస్తారు. పిల్లలు 9 గంటల కంటే తక్కువ నిద్రపోతే గ్రోత్ హార్మోన్ పనిచేయదు. కాబట్టి వారు రోజుకు 9–10 గంటలు నిద్రపోయేలా చూడాలి. రాత్రి 10 గంటలలోపే పడుకోవడం పిల్లలకు చాలా మంచిది.

అవుట్డోర్ గేమ్స్..

పిల్లలు ఎక్కువ సమయం మొబైల్, టాబ్లెట్, గేమ్స్‌ అంటూ ఇండోర్ గేమ్స్ ఎక్కువగా చూస్తున్నారు. ఇది వారి శారీరక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. కానీ పిల్లలు బయట ఆడుకునేలా లేదా ఏదైనా స్పోర్ట్ ఆడేలా చూసుకోవాలి. ఇది వారిలో గ్రోత్ హార్మోన్‌ను పెంచుతుంది. దీనివల్ల ఎముకలను బలంగా మారతాయి. అంతేకాకుండా శరీరాన్ని స్ట్రెచ్ అయ్యేలా చేస్తాయి.

పిల్లలు ఎత్తు పెరిగేందుకు ఫాలో అవ్వాల్సిన టిప్స్..

పిల్లలు ఎత్తు పెరగడానికి కొన్ని యాక్టివిటీస్ సహాయపడతాయి. అవి రన్నింగ్, స్విమ్మింగ్, స్కిప్పింగ్. అయితే బాస్కెట్‌బాల్ లేదా బ్యాడ్మింటన్ ఆడినా కూడా హైట్ పెరిగే అవకాశం ఉంది. సైక్లింగ్ అలవాటు కూడా మంచి ఫలితాలు ఇస్తుంది. కాబట్టి రోజుకు కనీసం ఓ గంట ఏదొక యాక్టివిటీ చేయించండి.

పిల్లల ఎత్తు పెరగడంలో చిన్న చిన్న అలవాట్లే పెద్ద పాత్ర పోషిస్తాయి. సరైన ఆహారం, తగినంత నిద్ర, రోజువారీ శారీరక వ్యాయామం ఉంటే పిల్లలు సహజంగానే ఆరోగ్యంగా, పొడవుగా పెరుగుతారు.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.