Chhattisgarh Encounter: ధమ్తారి, ఒడిశా సరిహద్దులో ఎన్‌కౌంటర్.. భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు నక్సలైట్లు మృతి

2 months ago 3
ARTICLE AD
<p>ఛత్తీస్&zwnj;గఢ్&zwnj;: కాంకేర్ జిల్లాలోని ధమ్తారి, ఒడిశా సరిహద్దులో ఆదివారం ఉదయం భద్రతా దళాలు.. నక్సలైట్ల మధ్య ఎన్&zwnj;కౌంటర్ జరిగింది. ఈ ఎన్&zwnj;కౌంటర్&zwnj;లో ముగ్గురు నక్సలైట్లను &nbsp;భద్రతా దళాలు హతమార్చాయి. ఇద్దరు పురుష , ఒక మహిళా నక్సలైట్ మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలం నుంచి ఒక SLR, ఒక 303 రైఫిల్, 12-బోర్ గన్&zwnj;ను స్వాధీనం చేసుకున్నారు. కాంకేర్ ఎస్పీ కళ్యాణ్ ఎల్లిసెల ఈ విషయాన్ని ధృవీకరించారు.</p> <p>కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని తియార్పాని అడవుల్లో ఎన్&zwnj;కౌంటర్ సమాచారం మేరకు కాంకేర్ డిఆర్&zwnj;జి, బిఎస్&zwnj;ఎఫ్, గరియాబంద్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అడవిలో తలదాచుకుని ఉన్న నక్సలైట్లు కాల్పులు జరిపారు. భద్రతా దళాలు వెంటనే స్పందించి ఎదురుకాల్పులు జరిపాయి. అడవిలో మరింత మంది నక్సలైట్లు దాగి ఉండవచ్చని పోలీసులు, భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఆ ప్రాంతంలో అడపాదడపా కాల్పుల మోత కొనసాగుతోంది.</p> <p>మరణించిన ముగ్గురు నక్సలైట్లలో సీతానది ఏరియా కమిటీ కమాండర్ శ్రావణ్ ధీర్, నగరి ఏరియా కమిటీ డిప్యూటీ కమాండర్ రాజేష్ ఉన్నారు.&nbsp;శ్రవణ్&zwnj;పై 8 లక్షలు రివార్డు ఉండగా, రాజేష్, బసంతిలపై 5 లక్షల రివార్డు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.</p>
Read Entire Article