Where to stream Cheekatilo Movie On OTT 2026: అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం రూపొందిన ఒరిజినల్ సినిమా 'చీకటిలో'. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. ఇందులో ప్రధాన పాత్రధారులు ఎవరు? చిత్ర కథ ఏమిటి? నిడివి ఎంత? స్ట్రీమింగ్ ఎప్పట్నించి? వంటి పూర్తి వివరాలు తెలుసుకోండి.

గురువారం అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్!
Cheekatilo Movie OTT Streaming Date: జనవరి 23వ తేదీ నుంచి తమ ఓటీటీ సబ్‌స్క్రైబర్‌లకు 'చీకటిలో' అందుబాటులో ఉంటుందని అమెజాన్ ప్రైమ్ వీడియో తెలిపింది. స్ట్రీమింగ్ డేట్ 23 (శుక్రవారం) అయినప్పటికీ... గురువారం (జనవరి 22వ తేదీ) అర్ధరాత్రి 12 గంటల నుంచి సినిమా వీక్షకులకు అందుబాటులోకి వస్తుంది.

Cheekatilo Runtime: 'చీకటిలో' రన్ టైమ్... రెండు గంటల పది నిమిషాలు. అంటే 130 నిమిషాలు అనుకోవచ్చు. అంటే... స్టార్టింగ్, ఎండ్ టైటిల్స్ తీసేస్తే రెండు గంటల్లో సినిమా కంప్లీట్ అవుతుంది.

శోభితతో పాటు ఎవరెవరు ఉన్నారు?
Who are the main leads in Cheekatilo: శోభితా ధూళిపాళ ప్రధాన పాత్రలో రూపొందిన 'చీకటిలో' చిత్రంలో ఇంకా ఎవరెవరు నటించారు? అనేది చూస్తే... సీనియర్ హీరోయిన్ ఆమని ఓ ప్రధాన పాత్ర పోషించారు. ఇంకా ఈషా చావ్లా, ఝాన్సీ, యంగ్ హీరో విశ్వదేవ్ రాచకొండ (35 - ఒక చిన్న కథ ఫేమ్), శ్రీనివాస్ వడ్లమాని, రమ్యా పొందూరి ఇతర పాత్రలు పోషించారు.

Also Read: Netflix Upcoming Movies Telugu: నెట్‌ఫ్లిక్స్‌ జాతర... పవన్ 'ఉస్తాద్' to వెంకీ 'ఏకే 47', చరణ్ 'పెద్ది' వరకు... 2026లో వచ్చే కొత్త సినిమాలు ఇవే

క్రైమ్ థ్రిల్లర్ 'చీకటిలో' చిత్ర కథ ఏమిటి?
What is the plot of Cheekatilo: ఈ సినిమాలో సంధ్య అనే క్రైమ్ పాడ్ కాస్టర్ పాత్రలో శోభితా ధూళిపాళ నటించారు. సిటీలో జరిగే కొన్ని దారుణమైన నేరాలు - ఘోరాలను ఆమె వెలుగులోకి తీసుకు వస్తుంది. తన దగ్గర ట్రైనింగ్ తీసుకునే ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో మరణిస్తారు. అతని మృతికి న్యాయం చేయాలని సంధ్య అలుపెరగని ప్రయత్నం చేస్తుంది. అప్పుడు మరిన్ని దారుణమైన నేరాలు వెలుగులోకి వస్తాయి. అవి ఏమిటి? సంధ్య దగ్గర శిక్షణ తీసుకునే వ్యక్తి ఎలా మరణించాడు? చివరకు ఏమైంది? అనేది సినిమా తెలుసుకోవాలి.

Also Read: Ticket Price Hike: టిక్కెట్టుపై వందకు ఆశ పడితే 100 కోట్లకు ఎసరు... ఎందుకీ హైకులు? పడిగాపులు?

'చీకటిలో' దర్శక నిర్మాతలు ఎవరెవరు?
Cheekatilo Director Producer: 'చీకటిలో' చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించారు. నిఖిల్ సిద్ధార్థ హీరోగా నటించిన 'కిరిక్ పార్టీ'తో ఆయన దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత సత్యదేవ్ హీరోగా మరొక సినిమా 'తిమ్మరుసు' చేశారు. సురేష్ ప్రొడక్షన్ ప్రై.లి. పతాకంపై డి. సురేష్ బాబు ప్రొడ్యూస్ చేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం రూపొందిన ఎక్స్‌క్లూజివ్ ఒరిజినల్ చిత్రమిది. దీనికి చంద్ర పెమ్మరాజు రచనా సహకారం అందించారు.

Also Read: ఎవరీ గీతూ మోహన్‌దాస్? 'టాక్సిక్' టీజర్‌తో హాట్ టాపిక్‌... డైరెక్టరే కాదు, నటిగా అవార్డు విన్నర్