Cheapest 7 Seater Cars India 2025: భారతదేశంలో 3 వరుసలు/ 7 సీట్ల కార్లకు డిమాండ్‌ ఎప్పటికప్పుడు పెరుగుతోంది. పెద్ద కుటుంబాలు ఎక్కువగా ఉండే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సెగ్మెంట్‌కి ప్రత్యేక ఆదరణ ఉంది. తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ మంది కంఫర్ట్‌గా ప్రయాణించడానికి, 3 వరుసలుగా ఉండే 7 సీటర్ కార్లు సరైన ఎంపిక. మార్కెట్లో ప్రస్తుతం వివిధ కంపెనీల నుంచి MPVలు, SUVలు అందుబాటులో ఉన్నాయి.

1. Renault Triber (₹5.76 లక్షలు – ₹8.60 లక్షలు, ఎక్స్‌-షోరూమ్‌)
1.0 లీటర్ పెట్రోల్ – 72hp పవర్‌
దేశంలోనే అత్యంత చవకైన 7 సీటర్ కార్ అంటే ముందు చెప్పాల్సింది దీని గురించే. మూడు వరుసల సీటింగ్, మధ్య వరుస 60:40 స్ప్లిట్, స్లైడ్ & రిక్లైన్ ఆప్షన్లు, చివరి వరుసను పూర్తిగా తీసేయగలిగే అవకాశాలు - ఇవన్నీ ఈ కార్‌ను బడ్జెట్ ఫ్యామిలీ సెగ్మెంట్‌లో బెస్ట్‌గా నిలబెడతాయి.

2. Mahindra Bolero (₹7.99 లక్షలు – ₹9.69 లక్షలు)
1.5 లీటర్ డీజిల్ – 76hp
గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత పాపులర్ 7 సీటర్ SUV. రఫ్ రోడ్లపై బోలెరో పనితీరు అద్భుతం. కానీ ఇంటీరియర్ మాత్రం సాదాసీదాగా ఉంటుంది. మూడో వరుసలో సైడ్-ఫేసింగ్‌ సీట్లు పిల్లలకు మాత్రమే సరిపోతాయి.

3. Mahindra Bolero Neo (₹8.49 లక్షలు – ₹10.49 లక్షలు)
1.5 లీటర్ డీజిల్ – 100hp
బోలెరో కంటే మోడర్న్ స్టైల్ ఇంటీరియర్, బెట్టర్ క్వాలిటీ మెటీరియల్స్ ఇచ్చారు. మూడో వరుసలో జంప్ సీట్లు ఉన్నప్పటికీ స్పేస్ పరిమితం. పవర్ మాత్రం బాగుంది.

4. Maruti Ertiga (₹8.80 లక్షలు – ₹12.94 లక్షలు)
1.5 లీటర్ పెట్రోల్ – 103hp
ఫ్యామిలీలకు ఎక్కువగా నచ్చే MPV ఇది. పెద్ద సైజ్ విండోలు, కంఫర్ట్‌బుల్ సీట్లు, వెనుక వరుసలో USB-C పోర్టులు, ప్రాక్టికల్ కేబిన్ - ఇవన్నీ ఎర్టిగాను హై-వాల్యూమ్ కార్‌గా నిలబెడతాయి.

5. Toyota Rumion (₹10.44 లక్షలు – ₹13.62 లక్షలు)
103hp, 1.5-లీటర్ పెట్రోల్
ఎర్టిగాకు ఇది ట్విన్ మోడల్. అదే ఇంజిన్, అదే సీటింగ్ లేఅవుట్. కానీ టయోటా బ్యాడ్జ్‌తో వచ్చింది. టయోటా బ్రాండ్ వారంటీ, సేల్స్ నెట్‌వర్క్ అదనపు ప్రయోజనాలు.

6. Kia Carens (₹10.99 లక్షలు – ₹12.77 లక్షలు)
115hp, 1.5-లీటర్ పెట్రోల్; 116hp, 1.5-లీటర్ డీజిల్‌
ప్రీమియం ఇంటీరియర్, సులభంగా మూడో వరుసలోకి వెళ్లగలిగే యాక్సెస్ ఉంది, కుటుంబాలకు సూపర్ కంఫర్ట్ ఇస్తుంది. 6 అడుగుల వ్యక్తి కూడా వెనుక వరుసలో సెట్ అవుతాడు.

7. Kia Carens Clavis (₹11.08 లక్షలు – ₹20.71 లక్షలు)
115hp, 1.5-లీటర్ పెట్రోల్; 160hp, 1.5-లీటర్‌ టర్బో పెట్రోల్‌; 116hp, 1.5-లీటర్ డీజిల్‌
కారెన్స్‌ ప్రీమియం ఫేస్‌లిఫ్ట్. వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, బాస్ మోడ్, 1.5 టర్బో పెట్రోల్ ఆప్షన్ - ఇవన్నీ ఈ మోడల్‌ను సెగ్మెంట్‌లో లగ్జరీ ఆప్షన్‌గా నిలబెడతాయి.

8. Citroen Aircross (₹11.37 లక్షలు – ₹13.69 లక్షలు)
82hp, 1.2-లీటర్ పెట్రోల్; 110hp, 1.2-లీటర్‌ టర్బో పెట్రోల్‌
సూపర్ కంఫర్ట్ సీట్లు, మంచి లెగ్‌రూమ్, సీట్లు పూర్తిగా తొలగించే అవకాశం. కానీ చివరి వరుసలో స్పేస్ పిల్లలకు మాత్రమే సరిపోతుంది.

9. Mahindra Scorpio Classic (₹12.98 లక్షలు – ₹16.70 లక్షలు)
130hp, 2.2-లీటర్ డీజిల్‌
క్లాసిక్ డిజైన్, పవర్‌ఫుల్ 2.2 డీజిల్ ఇంజిన్. మూడో వరుసలో సైడ్-ఫేసింగ్ సీట్లు ఉన్నప్పటికీ క్రాష్ ప్రొటెక్షన్ తక్కువ.

10. Mahindra Scorpio N (₹13.20 లక్షలు – ₹24.17 లక్షలు)
203hp, 2-లీటర్‌ టర్బో పెట్రోల్‌; 132hp/175hp 2.2-లీటర్ డీజిల్‌
క్లాసిక్‌ మోడల్‌తో పోలిస్తే ఇది పూర్తిగా మోడర్న్ వెర్షన్‌. ఫ్రంట్-ఫేసింగ్ సీట్లు, పవర్‌ఫుల్‌ ఇంజిన్ ఆప్షన్లు (175hp డీజిల్, 203hp టర్బో పెట్రోల్), 4x4 ఆప్షన్ దీనిలో ఉన్నాయి. ఈ లిస్ట్‌లో ఉన్న ఏకైక రియల్ 4x4 SUV ఇది.

తెలంగాణ & ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద కుటుంబాలు ఎక్కువగా ఉండటంతో 7 సీటర్ కార్లకు డిమాండ్ జోరుగా కొనసాగుతోంది. ₹6 లక్షల నుంచి ప్రారంభమై, మీ బడ్జెట్‌కి తగ్గట్టుగా ఉండే ఈ టాప్ 10 కార్ల నుంచి మీ కుటుంబానికి సరిపోయే ఆప్షన్‌ను సులభంగా ఎంచుకోవచ్చు.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.