కులగణన సర్వే వివరాలు బయటపెట్టకుండా తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసే కుట్ర పన్నుతుందని మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వేలోని కుల గణన సర్వే పూర్తి వివరాలు బయటపెట్టడం లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో
తమకు అనుకూలంగా ఉన్న చోట రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆమె ఆరోపించారు.

చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయండి
స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు ప్రకటించే లోపే కులగణన సర్వే (Caste Census Survey) వివరాలు వెల్లడించి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మాజీ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. హడావిడిగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి రాజకీయ ప్రయోజనం పొందడానికి ప్రయత్నిస్తే బీసీలకు అన్యాయం చేసినట్టే అని వ్యాఖ్యానించారు. గ్రామపంచాయతీల వారీగా కుల గణన వివరాలు వెల్లడించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల (BC Reservations) పెంపు కోసం తెలంగాణ జాగృతి మొదటి నుంచి చిత్తశుద్ధితో పని చేస్తుందని, రిజర్వేషన్ల పెంపు సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కవిత స్పష్టం చేశారు.

కులగణన సర్వే వివరాలు బయటపెట్టకుండా బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వ కుట్ర కనపడుతున్నది

తమకు అనుకూలంగా ఉన్న చోట రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది

స్థానిక సంస్థల ఎన్నికల తేదీలు ప్రకటించే లోపే కులగణన సర్వే వివరాలు వెల్లడించి…

— Kavitha Kalvakuntla (@RaoKavitha) September 23, 2025