<p>Case Registered case against KA Paul | హైదరాబాద్‌: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డా. కె.ఎ. పాల్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. కేఏ పాల్ తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ మహిళా ఉద్యోగి షీ టీమ్‌ను ఆశ్రయించింది. బాధితురాలు కొంతకాలం నుంచి పాల్ కార్యాలయంలో పనిచేస్తున్నారని సమాచారం.</p>
<p>కేఏ పాల్ తనపై లైంగిక వేధింపులపై పాల్పడుతున్నాడని వివరాలతో కూడిన ఆధారాలను బాధితురాలు షీ టీమ్‌కు సమర్పించింది. ఆమె ఫిర్యాదుతో కేసును పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు షీ టీమ్ బదిలీ చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు కేసును నమోదు చేసి తదుపరి దర్యాప్తు ప్రారంభించారు.</p>
<p>"కొద్దిరోజులుగా కేఏ పాల్ లైంగికంగా వేధిస్తున్నాడు. పని పేరుతో అనుచితంగా ప్రవర్తిస్తున్నాడు" అని ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది. పోలీసుల సమాచారం ప్రకారం, ఆమె అందించిన ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. మరెవరికైనా workplace లో ఇలాంటి అనుభవాలు ఎదురైతే, వెంటనే షీ టీమ్ లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పంజాగుట్ట పోలీసులు ఆమెకు హామీ ఇచ్చారు.</p>
<p>ఈ కేసు రాజకీయంగా సంచలనం రేపే అవకాశముంది. కేఏ పాల్ టీం మాత్రం మహిళ ఆయనపై చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని పేర్కొంది. ప్లాన్ ప్రకారం ఆయనపై ఆరోపణలు చేస్తున్నారంటూ కొట్టిపారేసింది. </p>